క్యాన్సర్ నిర్మూలన ధ్యేయంగా సత్యసాయి సేవా సమితి...

వర్గల్లో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరం 

క్యాన్సర్ నిర్మూలన ధ్యేయంగా సత్యసాయి సేవా సమితి...

జయభేరి, వర్గల్, ఫిబ్రవరి 07 :
క్యాన్సర్ వ్యాధి నిర్మూలన ధ్యేయంగా సత్య సాయి సేవ సమితి పనిచేస్తుందని సత్యసాయి సేవా సంస్థల స్టేట్ మెడికల్ కోఆర్డినేటర్ భాస్కరరావు పేర్కొన్నారు. వర్గల్ మండల కేంద్రంలో శుక్రవారం క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరాన్ని శ్రీ సత్య సాయి సేవా సంఘం తెలంగాణ (మహిళ) విభాగం ఆధ్వర్యంలో MNJ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ సౌజన్యంతో బస్సు ద్వారా పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ... సత్య సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సత్యసాయి సేవా సంస్థల మెడికల్ కోఆర్డినేటర్ భాస్కర్ రావు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ శిబిరాలను నిర్వహించి సుమారు 5600 మంది కి టెస్టులు చేయడం జరిగిందన్నారు. అందులో కొంతమంది వ్యాధిగ్రస్తులకు హాస్పటల ద్వారా మందులను అందజేసి వారికి వ్యాధి నయం చేసే విధంగా తోడ్పడడం జరిగిందన్నారు. వర్గల్ మండల కేంద్రంలో 110 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రామ సేవా మహా యజ్ఞం టీమ్ మెంబర్ వెంకట నరసింహారెడ్డి, జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు యమునారాణి, డాక్టర్ సత్యకుమార్, మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ మోహన్, సత్యసాయి సేవా కమిటీ సభ్యులు పాండుగౌడ్, భాషయ్య గౌడ్ ,బైరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More హరీష్ రావు పై అక్రమ కేసులు తగవు