Srikrodhi : శ్రీక్రోధి నామ సంవత్సరం
ముందుగా 'జయభేరి' న్యూస్ ప్రేక్షకులందరికీ శ్రీక్రోధి నామ తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు.... అందిస్తూ కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ సమగ్ర విశ్లేషణ..
ముందుగా 'జయభేరి' న్యూస్ ప్రేక్షకులందరికీ
శ్రీక్రోధి నామ తెలుగు సంవత్సరాది
ఉగాది పండుగ శుభాకాంక్షలు....
అందిస్తూ కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ సమగ్ర విశ్లేషణ..
కాలాన్ని లెక్క కట్టినది ఉగాది...
తిధి వార నక్షత్ర యోగాలను మానవ జీవనస్థితి గతులను కాలచక్ర గతిని ముందుగానే పసిగట్టిన మన హిందూ సనాతన ధర్మానికి ఆయువుపట్టు మొదటి మెట్టు ఉగాది పండుగ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. హిందూ సనాతన సంప్రదాయ పండుగలలో తొలి పండుగగా పేరు సంపాదించుకున్న పండుగ తెలుగు సంవత్సరాది ఉగాది. కాలాన్ని లెక్క కట్టే తెలుగు సంవత్సరాలలో 38వ సంఖ్య క్రోధి నామ సంవత్సరo. ఈ ఏడాది స్వాగతం పలుకుతుంది...
తెలంగాణ అంటేనే ఆత్మ గౌరవ పోరాట స్ఫూర్తి కి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఉన్న మన రాష్ట్రంలో ఉగాది పండుగ అంటే మన అస్తిత్వాన్ని సనాతన ధర్మాన్ని మరొక్కసారి గుర్తు చేసుకుని తెలుగు సంవత్సర ప్రారంభాన్ని చేసుకుంటాం.
ఉగాది పండుగ నాడు పొద్దున్నే స్త్రీలు తలంటు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి పిల్లలు కొత్త బట్టలు ఆటపాటలతో పల్లె తల్లి ప్రకృతి శోభను తనలో నింపుకొని మావిడాకుల తోరణాలతో ప్రతి గడప ముస్తాబై ఇష్ట ఆరాధ్య దైవాలకు పూజలు మహా ఘనంగా జరుగుతాయి. ఉదయాన్నే ఇంట్లో ఉండే స్త్రీలు తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించుకొని దేవుడికి పూజ చేసిన తరువాత షడ్రు రుచుల సంగమాన్ని తయారు చేసుకుని ప్రసాదంగా తీసుకుంటారు.
తీపి పులుపు చేదు కారం వగరు ఉప్పు ఇలా అన్ని రుచులను మిళితం చేసుకొని కొత్త కుండలో పచ్చడిని తయారు చేసుకొని ఇంటిల్లి పాదులు తీసుకుంటారు.. ఇలా తీసుకోవడం వలన సనాతన సాంప్రదాయ రీతిలో మన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఆచారంతోపాటు ఆహారాన్ని భుజించి వ్యవహారాన్ని నడిపించే హిందూ సనాతన సాంప్రదాయ గొప్పతనాన్ని ప్రారంభ సంవత్సరంలో ఇలా మొదలు పెట్టుకుంటాం..
ఆరు రుచుల సంగమాన్ని సేవించిన తర్వాత కష్టం సుఖం దుఃఖం సంతోషం ఆనందం ఇలా మన జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టసుఖాలను సమపాళ్ళుగా చేసుకొని వాటిని ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని పొందుకోవడానికి ఉగాది పచ్చడను వజ్రతుల్యంగా ఉన్న మన దేహాన్ని అమృతతుల్యంగా మార్చుకోవడం కోసం ఉగాది పచ్చడను కచ్చితంగా మనం సేవించాలి...
తెలుగు భాష సంస్కృతి విభిన్న రీతిలో మన సనాతన సంప్రదాయాన్ని పాటిస్తూ ఈ రోజున చివరగా పంచాంగ శ్రవణాన్ని తెలుసుకుంటారు. పంచాంగ శ్రవణం అంటే తిధి వార నక్షత్ర యోగ గమనాల సమహారం అని చెప్పొచ్చు.. నిజానికి ఇక్కడే కాలాన్ని లెక్క కట్టే ఒక మేధో సంపత్తిని మన ధర్మం ఏనాడో కాలాన్ని లెక్క కట్టి మానవ జీవితంలో ఎదురయ్యే స్థితిగతులను తెలుసుకుంటూ కాలచక్ర గతి నియమాలను లెక్కిస్తూ పంచాంగ శ్రవణాన్ని మనకు పరిచయం చేసింది...
పంచాంగ శ్రవణంలో తిథి వార నక్షత్ర యోగాలను కాలచక్రం యొక్క గతిని తెలుసుకొని జీవితంలో మానసికంగా దృఢంగా ఉండడానికి ఎదురయ్యే కష్టాలను ముందుగానే పసిగట్టి వాటిని ఎలా ఎదుర్కోవాలో వివిధ రకాల ఆధ్యాత్మిక విప్లవానికి సంసిద్ధులంగా చేస్తోంది ఉగాది పండగ.
మానవ జీవితాన్ని ప్రకృతితో ముడి పెడుతూ ఎన్నో విషయాలను మనం గతంలోని తెలుసుకున్నాం. నిజానికి మానవ శరీరంలో నీటి శాతం సగభాగం ఉంటుంది కాబట్టి ప్రకృతిలో కూడా నీటి భాగం సగభాగం ఉంటుంది. అంటే ప్రకృతితో మమేకమైతేనే మానవ జీవన విధానం సాఫీగా సాగుతుందనేది మనం ఆధ్యాత్మికంగా నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం.
ఇక ఉగాది పంచాంగ శ్రవణం విన్న తర్వాత మనలో చాలామంది పేరుగాంచిన కవులు ఉగాది కవి సమ్మేళనాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇక కష్ట సుఖాలను మంచి చెడులను దుఃఖ ఆనందాలను తెలియజేస్తూ ఉగాది పచ్చడి ఎలా అయితే తీసుకున్నామో అలాగే కాలచక్రాన్ని కాల గమనాన్ని పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకొని మనకు ప్రకృతిలో రాత్రి పగలు ఎలా ఉంటాయో అలాగే ప్రతి భార్య భర్త ఎలాంటి గొడవలు ఉన్న వాటిని వెనువెంటనే పరిష్కరించుకొని కలిసి జీవితాన్ని పంచుకోవాలని తెలుగు సంవత్సరాది మనకు ఓ చక్కని సందేశాన్ని బోధిస్తోంది...
కవి సమ్మేళనంలో ఉగాది పండుగను గురించి విభిన్న రకాలుగా అక్షరమాలలను సంధిస్తూ కవులు తన కవిత్వాలను విప్లవాత్మకంగా కొందరు రాస్తే వివరనాత్మకంగా మరికొందరు రాస్తారు..
ఏదేమైనా 38వ క్రోధినామ సంవత్సరంలో మనం తెలుసుకోవాల్సింది మనలో ఉన్న కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకొని సమాధానాలను వెతుక్కోవాలనిజయభేరి న్యూస్ కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ .....
మీ అందరినీ కోరుకుంటున్నాం.....
సర్వేజనా సుఖినోభవంతు ...
సర్వేజనా సుజనో భవంతు
శుభం భూయాత్....
- కడారి శ్రీనివాస్
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత
గాయకులు, సామాజిక ఉద్యమకారులు
Post Comment