Danger Politics : కుల మతాలపై రాజకీయమా..!?

తీరు మారకపోతే పెను ప్రమాదమే!?

  • మతం మాటున...  ప్రజాస్వామ్యమా... ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే చిన్నచూపుగా మారుతుంది. ఇష్ట రాజ్యాంగ ప్రచారం చేసుకోవచ్చు నచ్చిన విధంగా డబ్బులు పంచొచ్చు అనే విధంగా అభ్యర్థుల పనితీరు చూస్తే అసహ్యం పుట్టిస్తుంది. ఇదంతా ఎన్నికల్లో గెలుపు కోసమేనా... గెలిచిన తర్వాత ప్రజల్ని పట్టించుకుంటారా...

Danger Politics : కుల మతాలపై రాజకీయమా..!?

త్వరలో జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో రకరకాల రాజకీయ ప్రకంపనలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ అడుగులు వేస్తుంటే.. ఇంకోవైపు కమలం పార్టీ పతంగి పార్టీ నీదా!? అంటే నాదా!? అనే విధంగా మతకల్లోలాలను రే కొట్టించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో సమరాన్ని రేకెత్తిస్తుంది. ఈ నేపథ్యంలో 'జయభేరి' సంధిస్తున్న కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్... సమగ్ర రాజకీయ విశ్లేషణ...

జయభేరి, హైదరాబాద్ :
పార్లమెంటు ఎన్నికలు తెలంగాణలో రాష్ట్రంలో జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడున్న రాజకీయ పార్టీలు ఒక్కొక్కరిది ఒక్కొక్క దారిని వెతుక్కుంటూ ఎలాగైనా గెలవాలని వ్యూహాలను రచిస్తూ ముందుకు వెళుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా, ప్రజాస్వామ్యంలో కులం మత ప్రాంత విభేదాలకు దూరంగా ఉండాల్సిన రాజకీయాలు నేటి రాజకీయ పరిస్థితుల్లో మతం మీద కులాల మీద రాజకీయం చేయడం పరిపాటి అయిపోతుంది. ఇది ముమ్మాటికి క్షమించరాని నేరం. భారత రాజ్యాంగ రచన చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏనాడో ఒక మాట చెప్పాడు. కుల మతాలకతీతంగా ప్రజాస్వామ్యం నడవాలి అంతే కానీ మతం ప్రాథమికన ప్రజాస్వామ్యం మనుగడ పరిఢవిల్లదు అంటూ ఘాటుగా ఆయన స్పందించిన తీరు చూస్తే నేటికీ ఆయన మాటకు విలువ లేకుండా పోతుంది అని నిక్కచ్చిగా చెప్పవచ్చు. మారుతున్న సమాజంలో మనుషులు మారుతున్న నేటి తరుణంలో రాజకీయ పార్టీలు తన రంగును మార్చుకుంటున్నాయి. దీనికి నిదర్శనంగా హైదరాబాదులో బిజెపి మజ్లిస్ పార్టీ ల మధ్య రసవత్తరంగా మతం మీదనే రాజకీయాలు నడిపిస్తున్నారు ఇరువురు నేతలు.

Read More వివాహ వేడుకల్లో పాల్గొన్న ఉద్యమ నాయకులు మహ్మద్ అప్జల్ ఖాన్

బిజెపి పార్టీ నుంచి అనూహ్య రీతిలో మాధవి లత ఎంపీ అభ్యర్థిగా టికెట్ నందుకున్న నాటి నుండి రోజురోజు సోషల్ మీడియాలో వివిధ ఛానల్లో ఆమె ప్రవర్తన చూస్తే సనాతన ధర్మాన్ని ఈవిడే మోసుకొచ్చింది అన్న అనుమానం రాకపోదు. ఇంకోవైపు మజ్లిస్ పార్టీ అది ముందు నుంచి ముస్లింలకు అనువుగానే వారి హక్కుల కోసం వారి రాజకీయ అధికారం కోసం ప్రవర్తిస్తూ వస్తున్న పార్టీ.. ఇలా ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న పోరు మతంపై జరిగే యుద్ధంల తలపిస్తుంది. ఇంకోవైపు బిజెపి అభ్యర్థి మాధవి లత దూకుడు మామూలుగా లేదు. హైదరాబాద్ అభ్యర్థిగా బిజెపి మాధవి లతను ప్రకటించినప్పటి నుండి అటు సోషల్ మీడియాలో ఇటు వివిధ న్యూస్ ఛానల్ లో ఆమె మాటల తూటాలను సంధిస్తున్న తీరును చూస్తే పూర్తిగా వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దానికి ఉదాహరణగా శ్రీరామ నవమి రోజున విల్లు ఎక్కుపెట్టి బాణం వదులుతున్నట్లు ఒక పెద్ద ఫోజు ఇవ్వడం ఇప్పుడు మీడియా కంటపడి పూర్తిగా వివాదాస్పదం అయిపోతుంది. దీనిపై పోలీసులు కేసును నమోదు చేశారు.

Read More నవవధువు వివాహానికి పుస్తే మట్టెలు అందజేసిన గోలి సంతోష్

హైదరాబాదులో మజ్లిస్ పార్టీ సలావుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ వీరిద్దరి రాజకీయం గత రెండు దశాబ్దాలుగా సాగుతున్నప్పటికీ వారి పార్టీకి విజయానికి తిరుగులేకుండా సాగుతోంది. ఇటు బిజెపి అటు మజ్లిస్ పార్టీ నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయ ప్రచారం ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు ప్రసంగాలతోనే కాదు వారి యొక్క నటన అభినయం కలిపి చూస్తే మనకు ఒకవైపు గాలిపటం ఎగరేస్తున్న మజిలీస్ పార్టీ కనిపిస్తే ఇంకోవైపు గాలిపటం దారం కట్ చేసిన రీతిలో బిజెపి అభ్యర్థి ప్రచారహోరను కొనసాగిస్తుంది. ఇది చాలదన్నట్టుగా హైదరాబాదులో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ నాయకులు రావడం ఇక్కడ ప్రచారాలు మొదలుపెట్టడం మరింత ఆసక్తిని నెలకొల్పేలా చేస్తుంది. హైదరాబాద్ ఎంపీ స్థానంలో బిజెపి మజిలీస్ పార్టీ హోరహోరీగా పోరును నడిపిస్తున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ అభ్యర్థులు ఇటు బి ఆర్ఎస్ అభ్యర్థులు నామమాత్రంగానే ఇక్కడ ప్రచారంలో కొనసాగుతున్నారు.
ముఖ్యంగా మనం ప్రస్తావించుకోవలసిన అంశం మత ప్రాతిపదికనే ఇక్కడ ప్రచారం జరుగుతోంది మొత్తానికి ఓటింగ్ కూడా అలానే సాగితే మాత్రం ప్రజాస్వామ్యం మనగలకు దెబ్బ పెట్టుగా మారే అవకాశం లేకపోలేదు..

Read More నల్లగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా 

హైదరాబాద్ ఎంపీ స్థానంలో పోటీ చేస్తున్న హీరో నేతలు మజిలీస్ పార్టీ బిజెపి పార్టీ నేతలు వినూత్నంగా ప్రచార హక్కులను కొనసాగిస్తున్నారు. బిజెపి అభ్యర్థి మాధవి లత క్రిస్టియన్ ఫాదర్లను కలుస్తూ ఆశీర్వాదం తీసుకోవడం, ఇంకోవైపు అసదుద్దీన్ హిందూ పూజారుల చెంత ఆశీర్వాదం తీసుకోవడం ఇప్పుడు రాజకీయంలో ఇదొక కొత్త ట్రెండును సృష్టిస్తుంది. మొత్తానికి ప్రజాస్వామ్యంగా జరిగే రాజకీయ సమరంలో ఇరు పార్టీ నేతలు తమ మతాల ప్రాతిపదికన ప్రచారాలు కొనసాగించడం ప్రజాస్వామ్యం మనుగడకు ముప్పు వాటిల్లుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More మత్తుపదార్థాల అవగాహన కార్యక్రమం 

75 ఏళ్ల ప్రజాస్వామ్యంలో లౌకికవాదం రాను రాను పుస్తకాల్లోనే తప్ప స్వేచ్ఛ స్వాతంత్రాలు భారత ప్రజలకు హరించకుపోతున్నాయి అనే విషయంలో బిజెపి ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు గవర్నర్ వ్యవస్థను నాశనం చేసి ఇంకోవైపు కార్పొరేట్ వ్యవస్థకు పూర్తి అధికారాలను కట్టబెడుతూ ఏకంగా సామాన్య మద్దతురగతి బడుగు బలహీన వర్గాల బతుకులను మరింత ఆర్థిక భారం వారిపై మోపుతూ 10 ఏళ్ల బిజెపి పాలనలో సామాన్యులకు ఒరిగింది ఏమిటి అన్న ప్రశ్న ప్రతి చోట వినిపిస్తోంది. అయితే బిజెపి అభ్యర్థి మాధవి లత ప్రచారానికి బిజెపి నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ మాధవి లతకు టికెట్ ఇవ్వడంపై కొంత అసంతృప్తిగా ఉంటూ రాజాసింగ్ ప్రచారానికి దూరం గా ఉన్నారు. ఒకవేళ ఇక్కడ బిజెపి గనుక గెలిస్తే ఇది ఒక చరిత్ర సృష్టించే అవకాశం లేకపోలేదు.  రాజకీయంలో ఎన్నికల రణరంగల్లో గెలుపు ఓటములు సహజం వీటిని అంత పట్టింపుగా తీసుకోకూడదు. కానీ అధికారమే లక్ష్యంగా సాగుతున్న రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల విధి విధానాలనే తప్పుపడుతూ విరుద్ధంగా షరతులు ఉన్నప్పటికీ అది మంచిది కాదు ఇది మంచిది అని తెలిసినప్పటికీ దానికి వ్యతిరేకంగా ప్రచారాలు కొనసాగించడం అంత మంచిది కాదు. ఎన్నికలు పటిష్టంగా జరపాలని ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ అనేక చోట్ల కేసులు నమోదవుతూ కోట్ల డబ్బులు పట్టుబడుతూనే ఉన్నాయి.

Read More తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి

తెలంగాణ రాష్ట్రంలోని పార్లమెంటు 17 స్థానాలను పూర్తిగా బిజెపి కైవసం చేసుకోవాలని ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడికి ప్రచారానికి రావడం జాతీయం నాయకులు బిజెపిని సపోర్ట్ చేస్తూ ప్రచారం చేయడం నిజంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా కమలం పార్టీకి అంకితం చేయాలనే ఏకైక లక్ష్యంతో దాడికి దిగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో వన్ నేషన్ వన్ భారత్ అని తీసుకొచ్చిన బిజెపి ప్రభుత్వం దాని వెనక పక్క వ్యూహం లేకపోలేదు. ఎందుకంటే వన్ నేషన్ వన్ భారత్ వన్ ఎలక్షన్ ఇది ఒక జాతీయ పార్టీ అది అధికారంలో ఉన్న పార్టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం నియంతృత్వ పోకడకు నిదర్శనం. ప్రజాస్వామ్యంలో ఒక నిర్వచనం మనందరికీ తెలుసు ప్రజల కోసం ప్రజలు ఎన్నుకొని ప్రజల నుంచి వచ్చిన వారిని నాయకులుగా నియమించడం ప్రజాస్వామ్యం యొక్క నిజమైన రూపం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి!? రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడేలే తప్ప ప్రజాస్వామ్యం మనబడిన దెబ్బతీసే విధంగా ఆయా రాజకీయ పార్టీలు కులాలకు మతాలకు ప్రాంతాలకు మధ్య విద్వేషాలను రగిలిస్తూ ప్రజల్ని ఒకవైపు దృష్టి సారించేలా అనేక విధంగా చర్యలను చేపడుతూ దేవుళ్లను గు డులను గోపురాలను మధ్యలో తీసుకొస్తూ కులమత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు.

Read More మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను పరామర్శించిన చల్లా ధర్మా రెడ్డి 

పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆశ అన్ని పార్టీల అభ్యర్థులకు ఉంటుంది. కానీ ప్రజలను మధ్యలో పావులుగా వాడుకుంటూ, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసేలా మతాలపై పంతాన్ని పెంచేలా కులాలపై వర్గాన్ని విభజించేలా ఎన్నికల సమరంలో సాగుతున్న ఈ చర్య మంచిది కాదు... రాను రాను దేశంలో మనుషులు ఉండరేమో... హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అని వేరువేరుగా మరో రూపం ధరిస్తారేమో.... రాజకీయాలు మారుతున్న నేటి తరంలో ఓటర్లు ఆలోచించి ఓటు వేసి ప్రజాస్వామ్యం మనుగడను పరిరక్షించాల్సిన బాధ్యతను తమ భుజస్కంధాలపై పెట్టుకోవాలి.... రాష్ట్రాన్ని సాధించుకున్న 10 సంవత్సరాల తర్వాత మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్న తెలంగాణ ప్రజలు ఈసారి జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ అభివృద్ధి సంక్షేమం దిశగా పయనించాలి అంటే ఏ పార్టీకి ఓటు వేయాలో ప్రజలే నిర్ణయించి ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈనెల 13న జరగబోయే పార్లమెంటు ఎంపీ అభ్యర్థుల ఎన్నికల్లో కచ్చితంగా ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఇది సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రతి ఒక్కరు విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. నోటుకు మందు సీసాకు బిర్యాని ఇంకో ఓటు అమ్ముకుంటే ఈ ప్రజలు ప్రజాస్వామ్యం బానిస బతుకుల కింద బలి కావాల్సిందే.... ఏకచిత్రాధిపత్యం సాధించాలనుకునే అన్ని పార్టీలకి తగిన బుద్ధి చెప్పే విధంగా పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు నిర్మొహమాటంగా ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది... కనీస సామాజిక బాధ్యతతో ప్రతి పౌరుడు ఓటు వేయాలి...

Read More క్యాన్సర్ నిర్మూలన ధ్యేయంగా సత్యసాయి సేవా సమితి...

ప్రజాస్వామ్యంలో కులమతాలకు అతీతంగా ప్రవర్తించే నాయకులకే పట్టం కట్టాలి. యువత తీరు మారకుంటే ఈ దేశ భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతుంది... జైశ్రీరామ్ అంటూ వందేమాతరం అంటూ జై భారత మాత అంటూ సాగే పార్టీ ప్రచారాల్లో యువత పాల్గొంటుంది.... ఇది ఈ దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారే సూచికల మారుతుంది.... ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రజల వద్దకు వెళ్లి ప్రజాసమస్యలు తెలుసుకొని ప్రజలకు అండదండగా ఉండాల్సింది పోయి జైశ్రీరామ్ అంటూ సాగే ప్రచార పర్వంలో ప్రజలకు సంక్షేమం అభివృద్ధి ఎవరిస్తారు.... ఇలాంటి ఎన్నో సున్నితమైన విషయాలను ఆయా పార్టీలు ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రణాళికలు రచిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ పార్లమెంటు ఎన్నికల్లో తగిన రీతిగా ఆలోచించి ఓటు వేసి నచ్చిన నాయకున్ని ఎందుకంటే ప్రజాస్వామ్యం లౌకికవాదం అనే అర్ధాలు మారకుండా ఉంటాయి...

Read More మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు

- కడారి శ్రీనివాస్ 
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత
గాయకులు, సామాజిక ఉద్యమకారులు

Read More తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు