Vote : సగానికి తగ్గిన ఓటు బ్యాంకు

సామాజికవర్గాలు బలమైన మద్దతుదారుగా ఉండటం వల్లే 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. రాష్ట్రవిభజన తర్వాత 2014, 2019 ఎన్నికల్లో పై సామాజికవర్గాలు బీఆర్ఎస్ కు మద్దతుగా ఉండటంతో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. 2023 ఎన్నికల్లో కేసీయార్ స్వయంకృతం వల్ల మెజారిటి సామాజికవర్గాలు దూరమవ్వటంతో ఫలితం రివర్స్ అయింది.

Vote : సగానికి తగ్గిన ఓటు బ్యాంకు

జయభేరి, హైదరాబాద్, జూన్ 7 :
గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 37.35 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు 16.68 శాతం ఓట్లు మాత్రమ వచ్చాయి. అంటే ఐదు నెలల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓట్లు 21 శాతం పక్క పార్టీలకు వెళ్లిపోయాయి.

అందులో కొంత కాంగ్రెస్.. అత్యధికంగా  బీజేపీ పొందాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ శరవేగంగా  కరిగిపోతోంది. ఆ బలాన్ని బీజేపీ అందుకుంటోంది. దీనికి కారణం  బీఆర్ఎస్‌కు బలమైన ఓటు బ్యాంక్ లేకపోవమే అనుకోవచ్చు.  రాజకీయ పార్టీ బలంగా ఉంది అని చెప్పుకోవాలంటే అందరూ చూసే ఒకే ఒక్క పాయింట్  ఆ పార్టీకి ఎంత ఓటు షేర్ ఉంది అనే. ఈ ఓటు షేర్ అనేది రాజకీయ వ్యవహారిక భాషలో ఓటు బ్యాంక్ అని చెప్పుకోవచ్చు.పార్టీకి నిజాయితీగా ఓట్లు వేసే ఓటర్లు ఎంత ఎక్కువ మంది ఉంటే వారందర్నీ ఓటు బ్యాంక్ అనుకోవచ్చు.  ఓటు బ్యాంక్ ఉన్న పార్టీకే విలువ ఉంటుంది.

Read More కేసీఆర్ గారు మిరెక్కడా...? 

ఈ ఓటు బ్యాంక్ ను రాజకీయ పార్టీలు వివిధ పద్దతుల్లో క్రియేట్ చేసుకుంటూ ఉంాయి. కులం, మతం, ప్రాంతం , భావోద్వేగ అంసాల ఆధారంగా సృష్టించుకుంటాయి.  ప్రస్తుతం అత్యధిక పార్టీల ఓటు బ్యాంక్ కులమే.   ప్రస్తుతం దేశంలో అయినా రాష్ట్రాల్లో అయినా రాజకీయ పార్టీలు బలంగా ఉన్నాయంటే.. కులాల సపోర్టుతోనే. తెలుగుదేశం పార్టీకి  కమ్మ, బీసీ వర్గాలు అండగా ఉంటూ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ముస్లిం, దళితులు, రెడ్డి వర్గం వారు సపోర్టు చేస్తున్నారు.

Read More మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన లక్ష్మాపూర్ గ్రామస్తుడు

ఏపీలో వైసీపీకి రెడ్డి, ముస్లిం, దళిత వర్గాల మద్దతు ఉంది. ఏపీలో జనసేన పార్టీ కీలకంగా మారిందంటే దానికి కారణం కాపు వర్గం మద్దతు ఉండబట్టే. కేసీఆర్ కు ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల సంగతి తెలియనిదేం కాదు. అందుకే ఆయన రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కుల బలం చూసుకుంటే పరిమితంగా ఉంటామని..అయితే  ప్రాంత భావనతో అయితే ఏకపక్ష విజయాలు వస్తాయి.. ప్రజలంతా ఓటు బ్యాంక్ అవుతారని అనుకున్నారు. అందుకే ప్రజల్లో నిగూఢంగా ఉన్నా తెలంగాణ వాదాన్ని అందుకున్నారు. ఒడిదుడుకులు అయినా ఆయన ముందుకు సాగారు. విజయంతం అయ్యారు. ఎన్నికల్లో ఆయన గెలిచిన  ప్రతీ సారి తెలంగాణ సెంటిమెంటే విజయాస్త్రం. తెలంగాణ అంటే బీఆర్ఎస్ అన్నట్లుగా  రాజకీయం సాగింది.

Read More వర్గల్ క్షేత్రాన్ని... తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామి గా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యం

అభ్యర్థి ఎవరన్నది చూసుకోలేదు.. కారు గుర్తు ఉంటే చాలు ఓటేశారు. అంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ .. తెలంగాణ సెంటిమెంట్ గుండె నిండా నింపుకున్నవారే. వారిలో సెంటిమెంట్ పెంచేందుకు కేసీఆర్ చేయగలిగినదంతా చేశారు. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ఉన్న ప్రజలను ఓటు బ్యాంక్‌గా మార్చుకుని అనుకున్న విజయాలు సాధించారు. కానీ కులం, మతం లాగా.. ఈ తెలంగాణ సెంటిమెంట్ శాశ్వతం కాదు. అక్కడే కేసీఆర్ రాజకీయంగా తప్పటడుగు వేశారు. తెలంగాణ సాధనే లక్ష్యం అనుకున్న తర్వాత.. లక్ష్యం చేధించిన తర్వాత ఇక సెంటిమెంట్ ఉంటుందనుకోవడం అత్యాశే. అయితే కేసీఆర్ తనదైన రాజకీయంతో పదేళ్ల  పాటు నెట్టుకు రాగలిగారు.

Read More విద్యాధరి ఆలయంలో మాజీ మంత్రి 

ఈ పదేళ్లలో ఆయన తెలంగాణ సెంటిమెంట్ కు అతీతమైన ఓటు బ్యాంక్‌ను సృష్టించుకోవడంలో విఫలమయ్యారు. ఏ సామాజికవర్గాన్ని దగ్గర చేసుకోలేకపోయారు. కేసీఆర్ సొంత సామాజికవర్గం చాలా స్వల్పంగా ఉంటుంది.  తెలంగాణ సెంటిమెంట్ లేకపోవడంతో బీఆర్ఎస్ ఘోర పరాజయాల్ని చవి చూసింది. రెడ్డి వర్గానికి కేసీఆర్ చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయన కేబినెట్‌లో ఆరుగురు రెడ్డి మంత్రులు ఉండేవారు. కానీ వారంతా సంప్రదాయకంగా కాంగ్రెస్ మద్దతుదారులు. సెంటిమెంట్ కారణంగా బీఆర్ఎస్‌కు మద్దతిచ్చారు. మళ్లీ కాంగ్రెస్ వైపు వెళ్లిపోయారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచిందేమీ లేదంటే.. వారు ఎంత  దూరమయ్యారో అర్థం చేసుకోవచ్చు. చివరికి  బీసీల్లోని ప్రధాన సామాజికవర్గాలను కూడా కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలతో  దూరం చేసుకున్నారు.  

Read More వానాకాలం రైతు భరోసా ను ఎగగొట్టటం రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయటమే...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతం తెలుగుదేశం పార్టీ బలంగా ఉండటానికి కారణం బీసీల మద్దతే. విప్లవాత్మక నిర్ణయాలు, బీసీ నేతలకు అవకాశాలు కల్పించడం ద్వారా ఆ పార్టీకి మద్దతుగా ఉండేలా చూసుకున్నారు. ఇప్పుడు ఆ పార్టీ ఉనికి లేకపోవడంతో బీసీ వర్గాలు ఇతర పార్టీల వైపు మళ్లాయి. వీరిని ఆకట్టుకోవడంలో కేసీఆర్ నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ అనుకూలంగా మల్చుకుంది.  పై సామాజికవర్గాలు బలమైన మద్దతుదారుగా ఉండటం వల్లే 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. రాష్ట్రవిభజన తర్వాత 2014, 2019 ఎన్నికల్లో పై సామాజికవర్గాలు బీఆర్ఎస్ కు మద్దతుగా ఉండటంతో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. 2023 ఎన్నికల్లో కేసీయార్ స్వయంకృతం వల్ల మెజారిటి సామాజికవర్గాలు దూరమవ్వటంతో ఫలితం రివర్స్ అయింది.  

Read More గాంధీభవన్ లో సోషల్ మీడియా మీటింగ్

కేసీఆర్ మళ్లీ  బీసీలను ఆకట్టుకుని బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ గా మార్చుకునే ప్రయత్నాలు చేసి విపలమయ్యారు.  17 పార్లమెంటు సీట్లలో ఆరుసీట్లను బీసీలకే కేటాయించారు. అయినా ఓట్లు వేయలేదు.  అయితే తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ పెంచుకుంటే.. ఓటు బ్యాంక్ పెరుగుతుంది. లేకపోతే మాత్రం.. మొదటికే మోసం వస్తుంది.  ఉన్న ఓటు బ్యాంక్ మరింత కరిగిపోతుంది. అది  బీఆర్ఎస్ పార్టీకి ఉనికి సమస్యను తీసుకు వస్తుంది.

Read More ఆర్థిక సాయం అందజేతా....