Boduppal : ముడుపులు ఇచ్చుకో.. అంతస్థు పెంచుకో…

  • ముడుపులు ఇచ్చుకో.. అంతస్థు పెంచుకో…
  • టీపీఎస్ కావ్య కనుసైగల్లో అక్రమ నిర్మాణాలు
  • మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తున్న టీపీవో వీరాస్వామి
  • సెల్లార్ కొ రేటు.. అంతస్తులకు మరో రేటు…
  • రెసిడెన్షియల్ అనుమతి.. కమర్షియల్ నిర్మాణాలు.. నో పార్కింగ్
  • కార్పొరేషన్ ఆదాయానికి రూ. కోట్లల్లో గండి
  • నోటీసులకే పరిమితమా..!
  • పత్తాలేని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు...

Boduppal : ముడుపులు ఇచ్చుకో..  అంతస్థు పెంచుకో…

లంచం.. లంచం.. లంచం..!

కార్పోరేషన్ లోని టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలోని లంచం లేనిదే పని జరుగదు. పేరుకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తుల స్వీకరణ, అనుమతుల జారీ అని చెబుతున్నప్పటికీ పైసలు లేనిదే ఫైలు కదలడం లేదు. తెలంగాణ రాష్ట్రములో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో అవినీతిని నిరోధించి త్వరగా అనుమతులు ఇవ్వాలని టీఎస్ బిపాస్ ఆన్‌లైన్ వ్యవస్థను తీసుకొచ్చారు. బిల్డింగ్ అప్రూవల్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే అన్ని కరెక్ట్‌గా ఉంటే అక్కడికక్కడే ఆన్‌లైన్ వేదికగా అప్రూవల్ ఇచ్చేయాలి. కానీ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అందుకు భిన్నమైన వ్యవహారం నడుస్తున్నది. అన్ని కరెక్ట్ గా ఉన్నప్పటికీ కచ్చితంగా నిర్మాణదారుడు మున్సిపల్ కార్యాలయానికి రావలసిందేనని లేకపోతే టౌన్ ప్లానింగ్ అధికారులు ఫైల్ ను ఏదో ఒక కొర్రీ వేసి రిజెక్ట్ చేస్తుంటారని వినికిడి. దీంతో ఆన్ లైన్‌లో అప్లై చేసిన వెంటనే నిర్మాణదారుడు వచ్చి ఎంతో కొంత ముట్టచెప్పి బిల్డింగ్ అప్రూవల్ తీసుకొని వెళ్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆప్రూవల్ ఇచ్చిన తరువాత ఆ బిల్డింగ్ ఏ విధంగా కడుతున్నారు. ఎన్ని అంతస్తులు వేస్తున్నారు.

Read More Telangan Sand I తెలంగాణ చరిత్ర, జాతి, ఎన్నటికీ క్షమించదు... ప్రకృతి సంపదను కొల్లగొట్టిన గత ప్రభుత్వపు పాలన...

రెసిడెన్సియల్ పేరుతో కమర్షియల్‌ నిర్మాణం చేస్తున్నారోనని ఏ మాత్రం పర్యవేక్షణ ఉండదు. పెద్ద  పెద్ద బిల్డింగ్‌లు, అపార్టమెంట్లు అయితే నిబంధనలకు విరుద్దంగా నిర్మిస్తున్నప్పటికీ తమ ముడుపులు తమకు ముడితే చాలు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక టౌన్ ప్లానింగ్ అధికారిణి హస్తం ఉందని ప్రజలు బాహాటంగానే విమర్శలు గుపిస్తున్నారు. వివిధ పత్రికలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని కథనాలు వస్తే మేము చర్యలు తీసుకోమని నిర్మొహమాటంగా టీపీఎస్ చెప్పుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఎందుకంటే మాకు రావలసినవి వస్తున్నాయి. దీంతో కార్పొరేషన్ రావలసిన ఆదాయం గండి పడుతుందన్నారు. దీనిపై టీపీఎస్ అక్రమదారులకు వత్తాసు పలుకుతూ ఫీర్యాదు చేసిన వారిపైకి అక్రమదారులను ఉడిగొల్పి భయబ్రాంతులకు గురి చేయిస్తుందని వినికిడి... వీటిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు వాటాలు అందటంతో ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి బోడుప్పల్ మున్సిపాలిటీలో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ నిర్మాణలపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Read More Telangana I పేట ఎవరి సొంతం..!?

జయభేరి, మేడిపల్లి, జూన్ 09 : 
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది.. రెసిడెన్షియల్ అనుమతులు తీసుకోని కమర్షియల్ కోసం షెడ్లు, విచ్చల విడిగా షెటర్ల నిర్మాణాలు యదేచ్చగా సాగిసున్నారు.

Read More Students I నైపుణ్య శిక్షణకు.. కేరాఫ్ తెలంగాణ....

కమర్షియల్ నిర్మాణలను అడ్డుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి కావ్య అక్రమ సంపాదనకు అలవాటు పడి నిర్మాణదారులతో అంటకాగుతోందని బహిరంగ ఆరోపణలువినిపిస్తున్నాయి. టీపీవో వీరాస్వామి జనగాం, నర్సంపేట రెండేసి రోజులు, మిగిలిన రెండు రోజులు బోడుప్పల్ ఇంచార్జి భాద్యతలు నిర్వహించాల్సి వస్తోంది. దీంతో బోడుప్పల్ తో పాటు నాగారం మున్సిపాలిటీలలో విధులు నిర్వర్తిస్తున్న టీపీఎస్ కావ్య ఇచ్చిందే పర్మిషన్.. కట్టిందే నిర్మాణం అన్న చందంగా గుట్టు చప్పుడు కాకుండా ఒక్కొక్క బిల్డింగ్ దగ్గర.. 4 నుండి 5 లక్షల వరకు డిమాండ్ చేసి మరీ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఈ ప్రాంతంలో చర్చ జోరుగా జరుగుతోంది. ఆమే సెల్లార్ కో రేటు.. అదనపు అంతస్తులు పెంట్ హౌస్ కు మరో రేటు వెలకట్టి టీపీఎస్ కావ్య అక్రమ వసూళ్లకు తెగబడుతోందని.. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముడుపులు ముడితే చాలు నిర్మాణం చేసే స్థలం సక్రమమా.. అక్రమమా.. అవసరం లేదు.. పర్మీషన్ ఇచ్చుడే.. బోడుప్పల్ లో లేఅవుటుపై ఉన్న ఫ్లాట్లకు ముడుపులు తీసుకొని బాహటంగా నిర్మాణ అనుమతులను జారీ చేసింది.

Read More Telangana MP I టార్గెట్ @17

4aa0caa1-67d2-48d5-8e0a-6828c9877da2

Read More Election I పార్టీల మేనిఫెస్టోల మతలబు ఏమిటి?

గత నెలలో నాగారం మున్సిపాలిటీలో ఒకే ప్లాట్ నెంబర్, ఒకటే సర్వే నంబర్లో గల 300 గజాలకు నాలుగు నెలలు కాలంలో రెండు సార్లు వేరు వేరు వ్యక్తులకు నిర్మాణ అనుమతులు జారీచేసింది. ఈ విషయంలో భారీ మొత్తంలో ముడుపులు తీసుకొని దొడ్డిదారిన అనుమతులు మంజూరు చేయటంతో బాధితులు న్యాయస్థానం బాటపట్టారు.అక్రమార్కుల భరతం పట్టాల్సిన అధికారులు అక్రమ నిర్మాణ దారులకు కొమ్ము కాస్తున్నరని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చిలకానగర్ నుండి బోడుప్పల్ కు వెళ్ళే ప్రధాన రహదారిలో ఇరు వైపుల షెడ్లు, కమర్షియల్ శేటర్లు, బోడుప్పల్ నుండి మల్లాపూర్ కు వెళ్ళే దారిలో కమర్షియల్ నిర్మాణాలతో పాటు అనధికారిక సెల్లార్ అడ్డగోలుగా నిర్మాణాలు జరుగుతుంటే వాటిని ఎందుకు కూల్చటం లేదంటూ స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి బోడుప్పల్ మున్సిపాలిటీలో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ నిర్మాణలపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Read More Telangan I ఏదీ రాజ్యాంగ స్ఫూర్తి.. సందేహమా? సవాళ్ల?

d5c825e6-b1f1-4037-b79e-10512fcde4c3

Read More GHMC I శివ శివ.. హర హర...

నకిలీ పర్మీషన్లతో నిర్మాణాలకు పచ్చజెండా.. 
గతంలో కమీషనర్ అక్రమ నిర్మాణాలను గుర్తించి నిర్మొహమాటంగా కూల్చివేస్తే.. కమీషనర్ బదిలీ కాగానే నేటి కమీషనర్ హయాంలో అక్రమాలన్ని సక్రమమై బహిరంగంగానే నిర్మాణం పూర్తి చెయిస్తున్నారు. గతంలో కార్పొరేషన్ ఏర్పడగానే నకిలీ గ్రామ పంచాయతీ పర్మీషన్ లతో నిర్మాణాలు జరుగుతున్నాయని అప్పటి కమీషనర్ వాటిని గుర్తించి పూర్తయిన నిర్మాణాలకు ఫైన్ విదించి, మిగతా కట్టడాలను కూల్చివేసారు. కానీ నేటికి టీపీఓ, టీపీఎస్ లు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ నకిలీ గ్రామ పంచాయతీ పర్మీషన్ లకు అనుమతులు ఇస్తూ ఏదో పర్మీషన్ చూపిస్తే చాలా నిర్మాణాలకు పచ్చజెండా ఊపుతూ నిర్మాణదారులకు ప్రోత్సహిస్తున్నారు. కార్పోరేషన్ కు రావలసిన ఆదాయాన్ని గండికొడుతున్నారు.

Read More Telangana I లగ్గం ఎట్లా జేయ్యాలే!?

41743bde-4589-42cc-8afc-13c8b987434d

Read More Health I ప్రజా ఆరోగ్యం మెరుగుపడేదెలా!?

అక్రమాలపై పర్యవేక్షణ కరువు...!
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక డివిజన్ల పరిధిలో చేపట్టిన అనుమతి లేని నిర్మాణాలపై పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకోవాల్సిన టీపీవో వేరే చోట ఇంచార్జ్ గా విధులు నిర్వహిస్తుండటంతో అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. టీఎస్ బీపాస్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతు ఇచ్చి ఎక్కడ అక్రమాలు జరుగకుండా కార్పొరేషన్ కు ఆదాయ వనరులను సమకూర్చేందుకు నిత్యం పర్యవేక్షణ చేయాల్సిన టీపీఎస్ ముడుపులు తీసుకొని అటువైపు కనీసం తొంగిచూడక పోవడం వారి వ్యవహరంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Read More Congress I లెక్కలు తేల్చాల్సిందే...

Kavya boduppal tsp

ఆమేదే టౌన్ ఫ్లానింగ్ లో ఏకచత్రాధిపత్యం...?
కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాల విషయంలో టీపీఎస్ కావ్య దే ఏకచత్రాధిపత్యంగా నడుస్తుంది. కమీషన్ ఆదేశించిన సరే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదు. ముడుపులు ముడితే చాలు ఎన్ని అంతస్తులైనా అనుమతి లేకుండా కట్టుకోవచ్చు. ఎవరైనా వీటిపై  కొందరూ ప్రజాప్రతినిధులు విచారిస్తే తను వేరే కార్యాలయంలో విధుల్లో ఉన్నానని ఎవ్వరికి ఎలాంటి సమాధానం ఇవ్వాలసిన అవసరం లేదని తాఫీగా చెప్పడం వారికే చెల్లింది. కనీసం మీడియా ప్రతినిధులు వివరణ అడిగితే కూడా సమాధానం చెప్పడానికి తీరిక లేకుండా ఉన్న ఆమె చేసే అసలు పనేంటో అక్రమ నిర్మాణాలను చూస్తే ఇట్టే అర్థం అవుతుంది.

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం: రామలింగం, మున్సిపల్ కమిషనర్ బోడుప్పల్ 
కార్పొరేషన్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా చేసే నిర్మాణాలను కూల్చివేస్తాం. అక్రమదారులపై చర్యలు తీసుకుంటాం. వీటి వెనక ఎంతటి వారు ఉన్నా సహించేది లేదని అన్నారు.

Views: 17

Related Posts