అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం
తుర్కపల్లి పట్టు వస్త్రాలను సమర్పిస్తున్న ప్రభుత్వ విప్
జయభేరి, తుర్కపల్లి, మే 12 :
తుర్కపల్లి మండలం వెంకటాపురం గ్రామంలోని స్వయంభు వెంకటగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సోమవారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం కళ్యాణోత్సవంలో భాగంగా అమ్మవారిని, స్వామి వారిని ఎదురుకోలు కార్యక్రమాన్ని నిర్వహించి కళ్యాణ మండపానికి తీసుకొని వచ్చి వేద బ్రాహ్మణులు వేదమంత్రోచరణాలతో కళ్యాణ తంతును కమనీయంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి భక్తులు ఓడిబియ్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం శ్రీ రామ భక్త భజన మండలి మల్లాపురం, శ్రీ శివరామకృష్ణ భజన మండలి వేల్పు పల్లి వారిచే భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రథోత్సవం, స్వామి వారి సేవ, ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వంశ పారంపర్య పూజారి రమాకాంత్ శర్మ, దేవాలయ కమిటీ సభ్యులు కల్లూరి వాసుదేవ రెడ్డి, గుంటి మహేష్ యాదవ్, కల్లూరి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ కల్లూరి ప్రభాకర్ రెడ్డి, వెంకట నరసింహారెడ్డి, వేముల దశరథ, పల్లెపాటి కరుణాకర్, చంద్రహాస్, కొండపాక మహేష్, కర్రే రాజ్ కుమార్, ఉపేందర్, కరుణాకర్, చిలువేరు రవి ,చిన్న నరసింహారెడ్డి, ఆరుట్ల ఉదయ్ రెడ్డి, అన్నదాతలు కల్లూరి జగన్మోహన్ రెడ్డి, కల్లూరి సతీష్ రెడ్డి ,గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కల్యాణోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ.....
శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవంలో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఐలయ్య దంపతులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ముఖ్యమంత్రి చీప్ పి ఆర్ ఓ బోరెడ్డి అయోధ్య రెడ్డి లు పాల్గొని స్వామివారికి శ్రీ లక్ష్మీనరసింహస్వామి యాదగిరిగుట్ట దేవస్థానం వారు సమర్పించిన తలంబ్రాలు, పట్టు వస్త్రాలు, పూలదండలను అందజేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సుధ గాని హరి శంకర్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, ఎంపీడీవో ఝాన్సీ లక్ష్మీబాయి, మాజీ ఎంపీపీలు బోరెడ్డి రామ్ రెడ్డి, బబ్బురి రవీంద్రనాథ్ గౌడ్, నాయకులు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి ,ఏశ బోయిన రాజయ్య, డాక్టర్ అంబటి చెన్న కిష్టయ్య, పాల్గొన్నారు
Post Comment