డ్రామా జూనియర్స్ సీజన్ 7..
విన్నర్ రాపోలు యోధిత రెడ్డి
- ఉత్కంఠ భరితంగా సాగిన జీ తెలుగు డ్రామా జూనియర్స్ సీజన్ సెవెన్
- యోధిత రెడ్డిని విన్నర్ గా ప్రకటించిన ప్రముఖ సినీ హీరో తరుణ్
- రూ. 10 లక్షల నగదు, షీల్డ్ కైవసం చేసుకున్న రాపోలు యోధిత రెడ్డి
- యోధిత రెడ్డిని అభినందించిన నిర్వాహకులు, కుటుంబ సభ్యులు
జయభేరి, మేడిపల్లి :
ఉత్కంఠ భరితంగా సాగిన జీ తెలుగు డ్రామా జూనియర్స్ సీజన్ సెవెన్ విన్నర్ గా రాపోలు యోధిత రెడ్డి నిలిచింది. జీ తెలుగులో 16 ఎపిసోడ్లతో సాగిన డ్రామా జూనియర్స్ సీజన్ సెవెన్ విన్నర్ ను ప్రముఖ సినీ హీరో తరుణ్ ప్రకటించారు. ఆడియన్స్ కరతాల ధ్వనుల మధ్యన విన్నర్ గా ప్రకటించిన రాపోలు యోధిత రెడ్డి డ్రామా జూనియర్స్ షీల్డ్ కైవసం చేసుకుంది.
సినీ హీరో తరుణ్ మాట్లాడుతూ.. చిన్నారుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. డ్రామా జూనియర్స్ సీజన్ సెవెన్ లో చిన్నారులు అద్భుతమైన ప్రతిభ ప్రదర్శించారని కొనియాడారు. డ్రామా జూనియర్స్ విన్నర్ యోధిత రెడ్డి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిందని అన్నారు. ఓటమి విజయానికి నాందిగా నిలుస్తుందని, మిగిలిన చిన్నారులు తమలోని ప్రతిభను మరో మారు ప్రదర్శించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జయప్రద, పూర్ణ, ప్రీతి శర్మ, సౌందర్య రెడ్డి, యోధిత రెడ్డి తల్లిదండ్రులు రాపోలు రాజా స్వప్న, ప్రవీణ్ రెడ్డి, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
Post Comment