Samantha - Naga Chaitanya : ఎందుకు మోసం చేసావ్ నాగ చైతన్యను...
ఓ నెటిజన్ ప్రశ్నకు సమంత అద్భుతమైన సమాధానం
ఏమాయ కలవే సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత.. మహేష్ బాబు సరసన దూకుడు సినిమాతో స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో టాప్ హీరోయిన్ అయిన సమంత.. హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయిన కొన్నేళ్ల తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.

సమంత గత కొంతకాలంగా మయాసిటిస్‌తో బాధపడుతోంది. ఆర్యోగం సహకరించకపోవడంతో సమంత తన సినిమాలను తగ్గించుకుంది. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' తర్వాత ఆమె మళ్లీ వెండితెరపై కనిపించలేదు. ఖుషీ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సమంత తన కొత్త సినిమా గురించి ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది.
బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సమంత తాజాగా ఆ సిరీస్ టైటిల్‌ను ప్రకటించింది. ఈ వెబ్ సిరీస్ టైటిల్ ``హనీ, బన్నీ` అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాతో పాటు తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించే సినిమాలో సమంత హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత తాజాగా యోగాకు సంబంధించిన వీడియోను తన ఖాతాలో షేర్ చేసింది.
ఈ వీడియోపై అందరూ సానుకూలంగా స్పందించగా.. సమంత వ్యక్తిగత జీవితంపై ఓ నెటిజన్ ప్రశ్నించాడు. చైతన్యతో విడాకుల గురించి సమంతను నాగ సూటిగా ప్రశ్నించాడు, నీ అమాయకపు భర్తను ఎందుకు మోసం చేశావు. ఈ ప్రశ్న మీకు మంచిది కాకపోవచ్చు అని సమంత బదులిచ్చారు. మీకు ఇంకా బలమైన పద్ధతులు అవసరం. ఐ విష్ యు వెల్ అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Post Comment