Ramzan : రంజాన్‌లో స్టార్ హీరోయిన్ సూపర్ లుక్!

ఆమె ముస్లిం అని చాలా మందికి తెలియదు!

Ramzan : రంజాన్‌లో స్టార్ హీరోయిన్ సూపర్ లుక్!

సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ భామ బాలీవుడ్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతోంది. రావణ్, చెన్నై ఎక్స్‌ప్రెస్ (స్పెషల్ సాంగ్), ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్‌లు బాలీవుడ్ ప్రేక్షకులకు చేరుకున్నాయి. గతేడాది బాలీవుడ్ కింగ్ ఖాన్, అట్లీ కాంబో మూవీ జవాన్‌లో కీలక పాత్ర పోషించింది. వరుస హిట్లతో మంచి జోరుమీదుంది ఈ భామ. మలయాళంలో నెరు, తెలుగు OTT చిత్రం భామాకలాపం 2, హిందీ చిత్రం ఆర్టికల్ 370 ఆమెకు మరింత క్రేజ్‌ని తెచ్చిపెట్టాయి. తాజాగా అజయ్ దేవగన్ సరసన మైదాన్ సినిమాలో నటించింది. ఏప్రిల్ 10 నుంచి థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమాకు మంచి టాక్ వస్తోంది. ఇప్పుడు స్పెషల్ అవుట్ ఫిట్ తో మెస్మరైజ్ చేస్తుంది ఈ భామ. ఆమె ఎవరో తెలుసా? ఆ బ్యూటీ ప్రియమణి.

Priyamani-Birthday-Fashion

Read More సోషల్ మీడియాను ఊపేస్తోన్న అమ్మపాడే జోలపాట సాంగ్.. 

రంజాన్ పండుగ సందర్భంగా ఆమె అందమైన ముస్లిం మహిళగా రూపాంతరం చెందింది. ఆకుపచ్చ రంగు గాగ్రా చోళీ దుస్తులు ధరించి.. ముంతాజ్ ఆభరణాలతో ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలను షేర్ చేసిన ప్రియమణి ఈద్ ముబారక్ అన్నారు. నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్లు. అయితే కొందరు మాత్రం జై శ్రీరామ్ అని రాస్తున్నారు. నవరాత్రులలో కూడా తామేమీ పోస్ట్ చేయలేదని వ్యాఖ్యానిస్తున్నారు. అసలు నిజమెంతో తెలియక నెటిజన్లు ఆమెను ఇలా కఠినమైన ప్రశ్నలు వేస్తున్నారు. నిజానికి ఆమె అయ్యంగార్ కమ్యూనిటీకి చెందిన మహిళ. ఇది కేరళలోని బ్రాహ్మణ వర్గం క్రిందకు వస్తుంది. అయ్యర్ కేరళ తల్లిదండ్రులకు బెంగళూరులో జన్మించారు.

Read More కార్తి, పిఎస్ మిత్రన్, ప్రిన్స్ పిక్చర్స్ 'సర్దార్ 2'

priyamani-latest

Read More ‘మార్టిన్’ ట్రైలర్ గ్రాండ్ రిలీజ్

చదువు పూర్తయ్యాక తెలుగులో ఎవరే అతగాడు సినిమాతో అరంగేట్రం చేసి పెళ్లనాయ కొత్తలో సినిమాతో హిట్ అందుకుంది. ఆమె తమిళంలో కూడా అడుగుపెట్టింది మరియు పరుత్తి వీరన్ చిత్రంతో జాతీయ అవార్డును గెలుచుకుంది. టాలీవుడ్, కోలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తోంది. యమదొంగ, నవ వసంతం, హరే రామ్, ద్రోణ, మిత్రుడు, ప్రవరాఖ్యుడు, విషమ, గోలీమార్, రక్త చరిత, రగడ, రాజ్, క్షేత్రం, చండీ, నారప్ప, భామ కలాపం వంటి సినిమాలు చేసింది. కానీ ఆమె 2017లో ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని పెళ్లాడింది.అతను ముస్లిం. అప్పటి నుంచి భర్తకు ధీటుగా భార్యగా ఆయన అడుగుజాడల్లో నడుస్తోంది. మతాన్ని అంగీకరించనప్పటికీ.. ఆ మతానికి గౌరవం ఇస్తూ.. రంజాన్ పండుగను జరుపుకుంటారు. ఆ మతానికి కూడా సమాన గౌరవం ఇస్తూ.. వారి పండుగల్లో పాల్గొంటారు.

Read More వారెవ్వా... అందానికి ఆధార్ కార్డు ఈ చిన్నారి.. వయ్యారి ఎవరో కనిపెట్టండి

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి 

Social Links

Related Posts

Post Comment