మల్కాజ్గిరి నియోజకవర్గం అభివృద్ధికి కృషి

  • పెండింగ్ లో ఉన్న పీర్జాదిగూడ 4 లైన్ రోడ్డు,SNDP పనులు త్వరగా పూర్తి చేయాలి
  • ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులతో పాటు 6లైన్ల రోడ్డు విస్తరణ చేపట్టాలి
  • ప్రజల అవసరాలకు అనుగుణంగా మంచి నీటి సరఫరాకు సూచనలు
  • కక్ష పూరిత రాజకీయాలు తగవు.. ఎంపి ఈటెల రాజేందర్
  • పీర్జాదిగూడ కౌన్సిల్ సమావేశనికి హాజరు కావలసిందిగా ఆహ్వానించిన మేయర్

మల్కాజ్గిరి నియోజకవర్గం అభివృద్ధికి కృషి

జయభేరి, మేడిపల్లి :
మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, నాయకులు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని పూలమొక్కను అందజేసి సన్మాణించారు. ఈ సందర్బంగా నగర పరిధిలో పెండింగ్లో ఉన్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పురోగతిని వారికి వివరించారు.

పీర్జాదిగూడ నుండి పర్వతాపూర్ వరకు సుమారు రూ.26కోట్ల HMDA నిధులతో నిర్మిస్తున్న 4 లైన్ రోడ్డు విస్తరణ పనులను గత ప్రభుత్వంలో ప్రారంభమై కొంత వరకు పనులు జరిగినప్పటికి ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో నిధులు విడుదల చేయక పోవడం, పనుల్లో జాప్యం జరుగుతుండటంతో ప్రజలు, వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గతంలో భారీ వర్షాల కారణంగా నగరాన్ని వరదలు ముంచేత్తడంతో శాశ్వత పరిష్కారంలో భాగంగా SNDP నిధులు సుమారు రూ.110 కోట్లను పీర్జాదిగూడ, బోడుప్పల్ జంట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్ట్రాం వాటర్ డ్రైన్ కొరకు నిధులు మంజూరు చేసినప్పటికీ నిధులు కొరత, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పనులు మధ్యలోనే నిలిచిపోయాయని గుర్తుచేశారు.

Read More tsrtc I ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్

నగర ప్రజలకు దాహర్తిని తీర్చాలనే లక్ష్యంతో గత కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం మిషన్ భగీరథ ఫేస్-2 లో భాగంగా గతంలో ఉన్న 40 లక్షల లీటర్ల నీటి నిల్వకు అదనంగా 90 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, ఓవర్ హెడ్ ట్యాంక్ లు నిర్మించి ప్రారంభించినప్పటికి ఇప్పటికి వాటిని వినియోగంలోకి తీసుకురాలేక పోవడంతో ప్రజలు తీవ్ర నీటి ఇబ్బందులకు ఎదురుకోవలసి వస్తుందని వివరిచడంతో HMWS&SB సంబంధిత ఉన్నతాధికారులకు ఫోన్ లో మాట్లాడి సమస్యలను త్వరగా పరిష్కరించి పెండింగ్ పనులు ప్రారంభించవలసిందిగా సూచించారు.

Read More telangana I రాజ్యాంగ స్పూర్తికి తిలోధకాలు...!?

పార్లమెంట్ నియోజకవర్గం వర్గ పరిధిలో ఉప్పల్- నారాపల్లి ఎలివెటెడ్ కారిడార్ పనులు నత్తనడకన సాగుతుండటంతో ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ తో సంప్రదించి పనుల పురోగతిని వివరించడం జరిగిందన్నారు. ఫ్లైఓవర్ పనులతో పాటు జాతీయ రహదారిపై 6లైన్ల రోడ్ల విస్తరణ పనులను యుద్ధప్రతిపదికన చేపట్టాలని ఈ.ఐ.సి (R&B) గణపతి రెడ్డికి సూచించారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో పెండింగ్ పనులు, అభివృద్ధి కార్యక్రమాలపై త్వరలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ కు తెలిపారు.

Read More Telangana I క్యాబినెట్ భేటీతో.. బీఅర్ స్ లో పెరిగిన దడ.!?

పర్వాతపూర్ సలార్జాంగ్ కంచెలో ప్రభుత్వ స్థలంలో (సీలింగ్ ల్యాండ్) జాగా కొని మోసపోయిన పేద, మధ్యతరగతి ప్రజలు అభ్యర్థన, పోరాటం మేరకు గత ప్రభుత్వం GO నెం.118 విడుదల చేసి వారి స్థలాలను రెగ్యుల్రైజ్ చేసుకోవడానికి వీలు కల్పించింది. ప్రభుత్వం మారడంతో ప్రభుత్వ జీవో పై నీలి నీడలు కమ్ముకోవడం, కాంగ్రెస్ నాయకుల కక్షపూరిత రాజకీయాలకు అధికారలపై ఒత్తిడి మేరకు ఎమ్మార్వో ఆధ్వర్యంలో అనేక నిర్మాణాలను కూల్చివేయడంతో ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురయ్యారని, తాజాగా సర్వే నెం. 1, 10 లలో మున్సిపల్ నుండి పూర్తి అనుమతులు పొంది, గత ఎమ్మార్వో సీలింగ్ ల్యాండ్ కాదని NOC జారిచేసిన స్థలంలో కూడ నిర్మాణాలను రాజకీయ కక్షలో భాగంగా కూల్చివేతలకు పాల్పడుతూ, భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వారి దృష్టికి తీసుకు రావడంతో తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

Read More Telangan I ఏదీ రాజ్యాంగ స్ఫూర్తి.. సందేహమా? సవాళ్ల?

రాజకీయ వేధింపులు, వ్యక్తిగత కక్షలతో కాకుండా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేయడం ద్వారానే ప్రజల మన్నలను పొందుతారని హితవు పలికారు. అనంతరం పీర్జాదిగూడ నగర పాలక సంస్థ సాధారణ సర్వ సభ్య సమావేశానికి రావలసిందిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాగారం చైర్మన్ చంద్రారెడ్డి, కార్పొరేటర్లు బచ్చ రాజు, మద్ది యుగేందర్ రెడ్డి, కౌడే పోచయ్య, మధుసూధన్ రెడ్డి, ఏంపల్ల అనంత రెడ్డి, నాయకులు బండారి రవీందర్, లేతాకుల రఘుపతి రెడ్డి, అలవాల దేవేందర్ గౌడ్, జావీద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Read More Telangana I పదవి అమ్మది.. పెత్తనం కొడుకుది...

Views: 0