ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా డివిజన్లో పాదయాత్ర.

మేయర్ జక్క వెంకట్ రెడ్డి

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా డివిజన్లో పాదయాత్ర.

జయభేరి, మేడిపల్లి :

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్లో మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కార్పొరేటర్ బచ్చరాజు కలిసి మల్లికార్జున నగర్, రాఘవేంద్ర కాలనీలో తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.
నగరంలోని అన్ని డివిజన్ల అభివృద్ధికి కృషిచేస్తూ, ఆదర్శంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజల కోసం నిత్యం అందుబాటులో ఉంటూ… వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. 

Read More నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి 

కాలనీల్లో నెలకొన్న సిసిరోడ్డు నిర్మాణం, మంచి నీటి సరఫరా కొరకు పాత పైప్ లైన్ ఉండటంవల్ల తరచూ లీకులతో నీటి వృధా, సరిపడా నీరు అందడం లేదని కాలనీ వాసులు తెలపడంతో నూతన పైప్ లైన్ నిర్మాణం కొరకు జలమండలి అధికారులకు విజ్ఞప్తి చేయడంతో పాటు భవిష్యత్ అవసరాల దృశ్యా గతంలో ఉన్న 40 లక్షల లీటర్ల సామర్ధ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంక్, రిజర్వాయర్లకు అదనంగా మరో 90 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు నిర్మాణం చేయడం జరిగిందని వీటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడంతో నగర ప్రజలకు మంచి నీటి సమస్య ఉండదని పేర్కొన్నారు.

Read More గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి 

IMG-20240608-WA1479

Read More హరీష్ రావు పై అక్రమ కేసులు తగవు

విద్యుత్ స్తంబాలు పక్కకు ఒరగడంతో విద్యుత్ తీగలు క్రిందకు వేలాడుతూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో వాటికి తక్షణమే సరిచేయాలనీ అధికారులకు సూచించారు. సమస్యలు తెలుసుకోవడం, ప్రజల బాధలు వింటూ, తక్షణ పరిష్కార చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

Read More తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి

IMG-20240608-WA1475

Read More ఎర్రవల్లి కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్

ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ కౌడే పోచయ్య, పార్టీ అధ్యక్షులు బండారి రవీందర్, ఏనుగు మనోరంజన్ రెడ్డి,చిర్ర సంతోష్, సత్యం,సంజీవ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Read More బదిలీపై వెళ్తున్న మహిళ ఎస్.ఐ ను సన్మానించిన పోలీసులు..

Views: 1