ధ్యానం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయండి
- కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సదుపాయాలు కల్పించాలి
- ఘట్ కేసర్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి
జయభేరి, మే 23:
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మిగిలిపోయిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి సూచించారు.
అకాల వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తరలింపులో జాప్యానికి తావు లేకుండా చూడాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా తార్పాలిన్ ,గన్ని బ్యాగులు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాల వల్ల ధాన్యం తడిసిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకొని అధికారులు వరకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థ వంతంగా నిర్వహిస్తూ తుది దశకు చేర్చాలని అన్నారు. ఇదే స్ఫూర్తితో పని చేస్తూ పూర్తిస్థాయి లక్ష్యానికి అనుగుణంగా దాన్యం సేకరణ జరపాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని తద్వారా రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ రాజేందర్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Post Comment