Modi : మోదీ పక్కా లోకల్…. బండి సంజయ్
మరి సోనియా ఎక్కడి నుండి వచ్చిందో కాంగ్రెస్ చెప్పాలే
- మోదీ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే కుట్రను కాంగ్రెస్ చేస్తోంది. మోదీకి ఆస్తిపాస్తులు... బ్యాంకు బ్యాలెన్స్ లేవు. ప్రధాని పదవి వద్దనుకుంటే జబ్చకు సంచి వేసుకుని పోయే మహనీయుడు మోదీ. నా మోదీని కించపరుస్తున్న కాంగ్రెస్ నేతలారా... ఖబడ్దార్. నా మోదీ మొండిమొలోడు కాదు... ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ ను మెడలు పట్టి బయటకు గెంటేసిన జగమొండి.
జయభేరి, వేములవాడ :
ప్రధాని నరేంద్ర మోడీ పాల్గోన్న వేములవాడ జనసభలో ఎంపి బండి సంజయ్ ప్రసంగానికి ప్రజలనుంచి మంచి స్పందన వచ్చింది. ప్రధాని సాక్షిగా కాంగ్రెస్ పై పంచ్ ల వర్షం కురిపించారు బండి సంజయ్. బండి సంజయ్ పంచ్ లకు ఈలలు, చప్పట్లతో వేములవాడ జనసభ మారుమోగింది. మోదీ పేరును ప్రస్తావించినప్పుడల్లా జనాలు ఈలలతో హర్షధ్వానాలు పలికారు. బండి సంజయ్ మాట్లాడుతూ కాశీ విశ్వేశ్వరుడి ప్రతిరూపమే నరేంద్రమోదీ. దేశ చరిత్రలో తొలిసారి దక్షిణకాశీకి విచ్చేసిన నాయకుడు మోదీ మాత్రమే. మోదీ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే కుట్రను కాంగ్రెస్ చేస్తోంది. మోదీకి ఆస్తిపాస్తులు... బ్యాంకు బ్యాలెన్స్ లేవు. ప్రధాని పదవి వద్దనుకుంటే జబ్చకు సంచి వేసుకుని పోయే మహనీయుడు మోదీ. నా మోదీని కించపరుస్తున్న కాంగ్రెస్ నేతలారా... ఖబడ్దార్. నా మోదీ మొండిమొలోడు కాదు... ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ ను మెడలు పట్టి బయటకు గెంటేసిన జగమొండి. 370 ఆర్టికల్ ను రద్దు చేసి ఏక్ దేశ్ మే దో విధాన్... దో ప్రధాన్... దో నిషాన్ నహీ చలేగా అంటూ నినదించిన నా శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాలను అమలు చేసి వేలాది మంది బలిదానాలకు సార్ధకత చేకూర్చిన జగమొండి నా మోదీ.
విద్యార్థులకు రూ.5లక్షల కార్డు అడిగితే ఇచ్చింది గాడిద గుడ్డు. వ్రుద్దులకు, నిరుద్యోగ భ్రుతి రూ.4 వేల పెన్షన్ అడిగితే ఇఛ్చింది గాడిద గుడ్డు. మహిళలకు 2,500లు అడిగితే ఇచ్చింది గాడిద గుడ్డు. అసలు కాంగ్రెస్ మ్యానిఫెస్టోనే పెద్ద గాడిద గుడ్డు. ఆ పార్టీ గుర్తు హస్తం కాదు... గాడిద గుడ్డు మాత్రమే. అరడుగుల బుల్లెట్ మన నరేంద్ర మోడీ. ఆరు గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్ చోర్ బ్యాచ్. అరడుగుల బుల్లెట్ మోదీ కావాలా?? లేక చొర్ బ్యాచ్ కాంగ్రెస్ కావాలా? మోదీ ఏ పని చేపట్టినా వాళ్ల అమ్మ ఆశీస్సులు తీసుకుని బయటకువస్తారు. ఇప్పుడు వారికి అమ్మ లేరు. మనమంతా మోదీ పక్షాన ఉంటూ ముచ్చటగా మూడోసారి ప్రధానిని చేసుకుందామని అన్నారు.
Post Comment