యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సూచన మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం... తెలంగాణ ఉద్యమకారుడు లింగాల కనకయ్య

యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు

జయభేరి, కీసర, డిసెంబర్ 10: తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారుల పైకి తుపాకులను గురిపెట్టిన నాయకులు నేడు తెలంగాణ ప్రజల అస్తిత్వం, తెలంగాణ బహుజనుల గురించి మాట్లాడడం వారికే చెల్లిందని  లింగాల కనకయ్య అన్నారు.యాద్గారపల్లి  చౌరస్తా లో  ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం మాట్లాడారు.

తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా, సీమాంధ్ర నాయకులతో చేతులు కలిపి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగారిచేందుకు ప్రయత్నించిన నాయకులు నేడు తెలంగాణ సంస్కృతి గురించి, ఉద్యమకారుల గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుందని  విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహాని చూస్తే ఎవరికైనా ఏ భావన వస్తుందో అందరికీ తెలుసని, అభయాస్తమంటే  ఏ పార్టీ గుర్తుతో మనము చర్చించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

Read More భారత్ ఖాదీ క్యాలండర్ ఆవిష్కరించిన ఎన్ సీ సంతోష్

నాడు మాజీ సీఎం కెసిఆర్ ఎంతోమంది మేధావులు, కళాకారులు, రచయితలు, సీనియర్ నాయకులు, ఉద్యమకారుల అభిప్రాయాలను, క్షుణ్ణంగా చర్చలు జరిపి, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, సంపద వంటి అంశాలు ప్రపంచానికి తెలిసే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించి ఆవిష్కరిస్తే, నేటి నాయకులు తమ వ్యక్తిగత ప్రచారాల కోసం, తెలంగాణ ప్రజలకు ఇష్టం లేకున్నా, నియంత పోకడలను అవలంబిస్తూ, తెలంగాణ ప్రజలు బాధపడుతున్న, ప్రజలకు ఇష్టం లేకున్నా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని పేద మహిళగా తెలంగాణ తల్లిని ఆవిష్కరించాలని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.  

Read More మెడిసిటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాజీ సీఎం కేసీఆర్ దీక్షతో అప్పటి కేంద్ర ప్రభుత్వం  డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేస్తే, సీమాంధ్రలు, తెలంగాణ ద్రోహులు  కుమ్మక్కై  ఆ ప్రకటన వెనుకకు తీసుకునే విధంగా  కుట్ర చేసింది నిజం కాదని ప్రశ్నించారు. డిసెంబర్ 9న ప్రకటన చేసిన అప్పటి ప్రభుత్వం ఆరోజున తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్లా? అని విమర్శించారు. డిసెంబర్ 9న  రాష్ట్రo ఆవిర్భవించినట్లు హడావుడి చేస్తూ ఇదే రోజున సంబరాలు చేసుకోవాలని పాలకులు పిలుపునివ్వడం దేనికి నిదర్శనమని దుయ్యబట్టారు.

Read More పైడిపెల్లిలో  చెక్ డ్యాం నిర్మాణానికి స్థల పరిశీలన

ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ ప్రజల గమనిస్తున్నారని, ఈ ప్రభుత్వం ఆవిష్కరించిన  తెలంగాణ తల్లిని ఇక్కడి ప్రజలు కోరుకుంటలేరనే విషయాన్ని  కాంగ్రెస్ సర్కారు గుర్తించాలని సూచించారు. మునుపటి తెలంగాణ తల్లిని ఇక్కడి ప్రజలు ఆరాధిస్తూ పూజలు చేస్తారని  స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపల్ బిఆర్ఎస్ ఉపాధ్యక్షుడు గండి నగేష్ గౌడ్, దమ్మాయిగూడ మున్సిపల్ సోషల్ మీడియా ఇంచార్జ్ శ్రీరామ్, 5 వ వార్డ్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాహుల్ బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సాయి గౌడ్

IMG-20241210-WA3544

Read More పరకాల ఏజీపీగా లక్కం శంకర్