Kcr-RS Pravin I బహుజనులకు మరొక్క దొర వచ్చిండు...

మమతా వద్దంటా.. కేసీఆర్ ముద్దంటా... ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసలు స్వరూపం ఇదేనా..!?

Kcr-RS Pravin I బహుజనులకు మరొక్క  దొర వచ్చిండు...

జయభేరి, హైదరాబాద్ :

రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ ప్రజలు కేసిఆర్ ను నమ్మి రెండుసార్లు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన అన్ని శాఖల్లో అన్ని రంగాల్లో అన్ని వ్యవస్థల్లో విధ్వంసం చేసి ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారని తెలంగాణ ప్రజలు కేసీఆర్ పరిపాలనను తూర్పారబట్టి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇది గడిచి వంద రోజులు కాకముందే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బహుజనులను ఉద్ధరిస్తాను నేను కాన్షీరామ్ జ్యోతిబాపూలే అంబేద్కర్ మాయావతి ఆ తర్వాత బహుజన వాదాన్ని మోసుకొచ్చేది నాకు ఇంత పెద్ద బాధ్యతను ఇచ్చింది మేడం అంటూ తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ అధ్యక్ష బాధ్యతను మోసుకొచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ రాజకీయంలోకి వచ్చిన తర్వాత తన ఇమేజ్ ని తానే బొంద పెట్టుకుంటున్నాడు. అని ప్రజల్లోంచి అనేక ఆరోపణలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో 'జయభేరి' సగర్వంగా కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ రాజకీయ సమగ్ర విశ్లేషణను అందిస్తున్నాను.

Read More ముడుచింతలపల్లిలో గురువారం సాయిల్ హెల్త్ డే

వందేళ్ల బహుజనుల చరిత్రలో బహుజనులను ఉద్ధరించిన వాళ్లను వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి రాజకీయ పార్టీ ఆ మహానుభావులను కచ్చితంగా వారి ఫోటోలను వాడుకుంటూ రాజకీయ పబ్భం గడుపుకుంటూ ఉంటారు. ఇదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బహుజనులను ఉద్ధరిస్తా అంటూ బీఎస్పీ పార్టీ అధినేతగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి చేపట్టిన దగ్గర నుంచి రాజకీయంగా పెను సంచలనాన్నే సృష్టిస్తున్నాడు.

Read More పైడిపెల్లిలో  చెక్ డ్యాం నిర్మాణానికి స్థల పరిశీలన

చదువుకుంది ఐపీఎస్ పెరిగింది దళిత జాతిలో అయినా మంచి మర్యాదలు తెలివితేటలు అన్ని పొందుకున్నాడు కాబట్టి ఐపీఎస్ గా తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వంలో గురుకులాల ఇన్చార్జిగా పదవీ బాధ్యతలు తీసుకొని బహుజనల పిల్లలను హిమాలయ పర్వత అంచుల దాకా చేపట్టిన రాజకీయంగా ఎదగాలని చట్టసభల్లో కూర్చోవాలని ఆ అధికారం కోసం తహతహలాడుతూ ఏదోరకంగా పార్లమెంటులో కూర్చోవాలనే ఆశను నెరవేర్చుకోవాలని ఉద్దేశంతో ఇవ్వాలా రాజకీయ జీవితాన్ని అందించిన బీఎస్పీ పార్టీని వీడుతున్నాను అని చెబుతూ తెలంగాణ బహుజనలంతా నాతో కలిసి రావాలని పిలుపునిచ్చారు బాగానే ఉంది. అయ్యా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయంగా నువ్వు ఎవరితోనైనా పొత్తు పెట్టుకో దాన్ని తెలంగాణ ప్రజలకు ఎందుకు అండగడతావు.

Read More ప్రజా సంక్షేమమే కాంగ్రేస్ ప్రభుత్వ లక్ష్యం...  ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి

అదీ గాక తెలంగాణ ప్రజలు ఛీ అని తరిమి కొట్టి తిట్టిన తిట్టు తిట్టకుండా దొర బానిస పరిపాలనను తరిమికొట్టి ప్రజా పాలనకు నాంది పలికితే ఆ ప్రక్రియ ఆ రాజకీయ ప్రక్రియ నీ కంటికి కనబడలేదా!? అభివృద్ధి మాటున అరాచకాల నీచ రాజకీయాలను చేసిన ఘనత కేసిఆర్ కు ఉండనే ఉంది కదా.. దాన్ని జీర్ణించుకోలేని ప్రజలు మొన్ననే ఆయనను ముఖ్యమంత్రి స్థానం నుంచి ప్రతిపక్ష నేతగా ఒక సాదాసీదా ఎమ్మెల్యేగా కూర్చోబెట్టారు. అదిగాక కేసీఆర్ గుణగణాలు నీకు తెలియని కావు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రమాణస్వీకారం చేయకుండా కాలు నొప్పి అంటూ తప్పించుకొని ఎలాగూ చేయక తప్పదు అన్న ఆలోచనకు వచ్చి చివరికి ఒక దళితుడు స్పీకర్ గా ఉన్న ఆయన చేతిలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాడంటే కాలం ఎవరిని వదిలిపెట్టదు అన్న అర్థం ఐపీఎస్ చదువుకున్న మీకు అర్థం కాకపోతే ఎట్లా!?

Read More రామాలయంలో సీసీ కెమెరాలు ప్రారంభించిన పేట్ బషీరాబాద్ ఏసిపి

 నేను రాజకీయ నాయకున్ని పూర్తిగా నేను రాజకీయం చేస్తే తప్పు బయటి వాళ్లు చేస్తే సంసారం నేను చేస్తే వేబిచారం అని సమర్ధించుకుంటున్నావు అది బాగానే ఉంది. మొన్నటి వరకు బిఎస్పి అధినేత ఒత్తిడి వల్లనే కేసీఆర్తో సంబంధాలు పెట్టుకున్నాడని అనుకున్నారు తెలంగాణ బహుజనలంతా. కానీ ఇప్పుడే అర్థమైంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసలు స్వరూపం అంటూ ని అభిమానులే నిన్ను ప్రేమించే వారే కెసిఆర్ తో పొత్తును కొనసాగిస్తున్నాను అని చెప్పడంతో చి చి అంటూ చీదరించుకుంటూ నీ రూపాన్ని చూడలేకపోతున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకులు తెల్లచొకాలు వేసుకుంటారు కానీ వాళ్ళ జీవితాలు అంతా కంపు కొడుతున్నాయి అని అర్థంతో వాళ్ళ జీవితాలు మలిన పడి మైలపడి స్వార్థంగా ఆస్తులు సంపాదించుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్యాయాలకు అవినీతికి తెగబడుతున్న ప్రజలు చూస్తూ మౌనంగా ఎందుకు ఉన్నారో తెలుసా? మీలాంటి చదువుకున్న వాళ్ళు రాజకీయంలోకి వచ్చి అదేదో పొడుస్తారని!? బహుజనులను ఉద్ధరిస్తారని!? అంతేకానీ నీ ఐపీఎస్ అధికారం ప్రజలకు అవసరం లేదు నీవు చేసిన మంచి చెడులే ప్రజలు తమ జ్ఞాపకాల్లో పెట్టుకొని నిన్ను దేవుడులా పూజిస్తారు అనే సత్యాన్ని ఏదోలాగా గ్రహించుకున్నారు. కానీ బిఎస్పీ పార్టీని వీడి కేసీఆర్ తో కొనసాగుతా అన్న మీ ఆలోచన విధానాన్ని చూస్తే నిజంగా నువ్వు బహుజనులకు మల్లోక దొరలాగా తయారవుతావు అని వాదన బహుజనుల్లో నుంచి బలంగా వినిపిస్తోంది.

Read More జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో విఙ్ఞాన భారతి పాఠశాల విద్యార్థుల ప్రతిభ

గతంలో ఇదే కేసీఆర్ను తిట్టిన తిట్టు తిట్టకుండా ఆయనను చెడుగుడు ఆడుకున్న ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్లో నాగర్ కర్నూల్ నుంచి ఎంపీ సీటు నీకు కేటాయించగానే బిజెపి మీద అక్కస్ను వెళ్ళదీస్తూ మోడీ మీడియా కాన్ఫరెన్స్ పెట్టి నాపై ఒత్తిడి తెచ్చారంటూ మైకు ముందర నీ అసలు స్వరూపాన్ని చూపిస్తూ బిఎస్పీ పార్టీని తెలంగాణలోనే బొందపెట్టినావు కదా!? అయినా బీఎస్పీ పార్టీ అంటే బహుజన్ సమాజ్ పార్టీ బహుజనలను ఆదుకుంటది అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి ఏనుగు బొమ్మను ఎంతో వర్ణించి ఇవ్వాలా మల్ల నువ్వు దొరకాడికి పోయి దొరతో పొత్తు పెట్టుకుని మళ్ళ నువ్వు తెలంగాణకు బహుజనులకు దొరలాగా తయారవుతావా!? దానికి ఎందుకు బహుజనుల దేవుళ్లను మహానుభావులను నీ నాలుక మీద వాళ్ల చరిత్రను వివరిస్తూ బహుజనుల ఓట్లను కొల్లగొట్టడానికి నువ్వు మారుస్తున్న రంగులను చూస్తే నీ అసలు స్వరూపం ఇదేనా అంటూ తెలంగాణ బహుజనలో ముక్కున వేలేసుకుంటున్నారు... బహుజనులను ఉద్ధరించింది మహాత్ముడు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తర్వాత ఎవరైనా ఆయనలాంటి వాళ్ళు బహుజనుల్లో పుట్టుకొచ్చారా!? పుట్టుకొచ్చిన చివరకు నీలాగా దొర పాదాల దగ్గరికి వెళ్లి దొరతో పొత్తు పెట్టుకున్నా వారు ఈ చరిత్రలో బతుకును చివరిదాకా కొనసాగించారా!? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో!? మాటిమాటికి రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత మీలో ఎన్నో ఏళ్ల రాజకీయ చతురత బాగానే కనిపిస్తుంది.

Read More ప్రజా ప్రభుత్వంలో విద్యా రంగానికే పెద్ద పీఠ 

కానీ ఒక్కసారి కెసిఆర్ జీవిత చరిత్ర అని ఆయన పుస్తకాన్ని చదివేసి చూడు నీ ఐపీఎస్ కూడా పనికి రాకుండా పోతుంది... అందుకేనేమో ఐపీఎస్ కి రాజీనామా చేసి ఏకంగా రాజకీయాల్లోకి వచ్చి పొత్తుల పేరుతో ప్రజాస్వామ్య బద్ధంగా నేను పొత్తు పెట్టుకుంటే తప్ప అంటూ మైకుల ముందు నీ వాదనను వినిపించడం రాజ్యాంగం కల్పించిన హక్కు బాగానే ఉంది కానీ నిన్ను అభిమానించే కార్యకర్తలు అభిమానులు అందులో బాగా చదువుకున్న వారు పోయి తెలంగాణ ప్రజలు చీకొట్టిన వారితో పొత్తు పెట్టుకుంటే కనీసం నీకు డిపాజిట్ కూడా రాదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. మీ అభిమానిగా నేను కూడా మిమ్మల్ని ఫాలో అయ్యాను స్వేరోలో మంచి ఉద్దేశాన్ని తీసుకొచ్చి బహుజనుల పిల్లలను హిమాలయ పర్వత అంచుల దాకా తీసుకెళ్లి కాలం నీతో నడవదు నిన్ను అడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధం అని నీ రాజకీయ సమయాన్ని ఆయుధంలా మలుసుకొని తెలంగాణ బహుజనుల మెడల మీద కత్తిని పెడుతున్నావు కదా... ఇదెక్కడి నీచ రాజకీయం ఇదెక్కడి కంపు బాగోతం... మాన్య కాన్షీరామ్ గారు చెప్పినట్టు ఎలాగో అలాగా నువ్వు చట్టసభల్లోకి వెళ్లాలి మనవాళ్లు అధికారాన్ని చేసి ఎక్కించుకోవాలి అన్న ఆయన మాటలను నేటి కాలానికి పోరాటం ద్వారా చేయడానికి సంకల్ప బలం లేదా!? దొరతో పొత్తు పెట్టుకుంటే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతును కూడగట్టుకుని పార్లమెంటులో కూర్చొని అప్పుడు బహుజనుల వాదాన్ని వినిపిస్తారా!? డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్న మాటలు ఒక్కసారి గుర్తుకు తెస్తున్నాను సార్ బహుజనులకు నాయకుడు అవసరం లేదు బహుజనులను నడిపించేవాడు ఉంటే చాలు అన్న ఆయన మాటలను ఎట్లా మరిచిపోయారు?

Read More పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రావీణ్యం సంపాదించాలి

అధికారం కోసం రోజుకో పార్టీని పూటకు జెండాను మెడలో వేసుకుంటున్న ఇలాంటి నీచమైన రాజకీయాలలో మీరు వచ్చి మీరు మైలబడిపోతున్నారు.. మీరెవరితో పొత్తు పెట్టుకున్నా బాగానే ఉండు కానీ తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల రాక్షస పాలనలో విముక్తి కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు ద్వారా కేసీఆర్ని ప్రతిపక్షంలో కూర్చోబెడితే అలాంటి నాయకుడి దగ్గరికి వెళ్లి మీరు పొత్తు పెట్టుకోవడం నీ విజ్ఞత కే వదిలేస్తున్నాం.... పైగా డిఎస్పి కి రాజీనామా చేసి కెసిఆర్ తో పొత్తు కొనసాగిస్తాను నన్ను బహుజనులంతా ఆదరించాలి అభిమానించాలి అని చెబుతున్న మీరు బహుజనుల వాంఛ ఏంటో బహుజనుల కోరిక ఏంటో బహుజనుల వాదం ఏంటో పూర్తిగా మరిచిపోయి పార్లమెంటులో ఎలాగైనా ఎంపీగా కూర్చోవాలన్నా అధికార వ్యామోహం మీ కళ్ళను కప్పివేస్తుంది... ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువగా అన్నట్టు పార్లమెంటు ఎన్నికల తరువాత కారు పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయే ఈ నేపథ్యంలో కేసీఆర్ తో పొత్తు పెట్టుకుని సంక నాకి పోతావు అంటూ జనాలు దుమ్మెత్తి పోస్తున్నారు... ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు అయినా మీరు మారరు ఎందుకంటే ఉన్నతమైన చదువులు చదువుకొని ఐపీఎస్ గా సేవలందించి ఒక మంచి పేరు తెచ్చుకున్న మీరు రాజకీయ అధికార దాహం పెరిగిపోతే మీరు మాత్రం ఏం చేస్తారు అసలు మీ స్వరూపం ఇది కాదు అని బహుజనులు బాధాతప్త హృదయంతో హెచ్చరిస్తున్నారు... బహుజనులారా ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని అనుకోవద్దు మనమే నాయకులగా ఎదగాలి ఇలాంటి రంగులు మార్చే ఊసరవెల్లుల భరతం పట్టాలి... సరికొత్త రాజకీయానికి తెరలేపాలి నవభారత నిర్మాతలు మనమే కావాలి..

Read More కాంగ్రెస్ గెలుపుపై గజ్వేల్ లో సంబరాలు

...కడారి శ్రీనివాస్ 
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత

Read More శ్రీ విష్ణు శివాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు

Latest News

ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి  ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
జయభేరి, దేవరకొండ :రాష్ట్రములో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2(హెచ్) ప్రకారం అధికార యంత్రంగం సూచిక బోర్డులను తప్పనిసరిగా...
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పీఏ పల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక స్థానిక ఆదర్శ పాఠశాల ముందు ధర్నా
వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా మొద్దునిద్ర వీడని రేవంత్ సర్కార్ 
ప్రజా ప్రభుత్వంలో విద్యా రంగానికే పెద్ద పీఠ 
విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి