మాదిగలకు 9 శాతం రిజర్వేషన్ పై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు
మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి
జయభేరి, మేడ్చల్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వళ్లనే మాదిగలకు 9 శాతం రిజర్వేషన్ వచ్చిందని మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఆదివారం మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గుండ్ల పోచంపల్లి మున్సిపల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకొని అనంతరం మాజీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవికి స్వీట్లు తినిపించు శుభాకాంక్షలు తెలిపారు.
Read More College I సాంకేతికతతో భోధన చేయాలి
మాదిగల చిరకాల స్వప్నం ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు కాంగ్రెస్ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండ్ల పోచంపల్లి మున్సిపల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్, కావలి చిన్నయ్య ముదిరాజ్, మీసాల మల్లేష్, కుండ ప్రవీణ్ కుమార్ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Views: 0


