పెన్షనర్స్ భవన నిర్మాణ నిధికి రు. 10,000 విరాళం

పెన్షనర్స్ భవన నిర్మాణ నిధికి రు. 10,000 విరాళం

జయభేరి, దేవరకొండ :
దేవరకొండ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ సేవాసదనం నిర్మాణ నిధికి  మైలాపురం లచ్చిరెడ్డి -విజయలక్ష్మి రిటైర్డ్  దంపతులు  సమావేశంలో రు. 10,000 అందజేసినారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మా పెన్షనర్స్ సంఘం సేవలు వెలకట్టలేనివి అన్నారు. ప్రధాన కార్యదర్శి, సహా అధ్యక్షులు అంకం చంద్రమౌళి, గంగిడి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ  పెన్షనర్స్ దాతలకు కృతజ్ఞతలు తెలియజేసినారు. కోశాధికారి పంగునూరు లింగయ్య మాట్లాడుతూ దాతల సహకారంతో భవనం మొదటి అంతస్తూ పూర్తి చేయుచున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తాటిశెట్టి నరసింహ, కార్యనిర్వాహాక కార్యదర్శి మహమ్మద్ యూసుఫ్ షరీఫ్, ప్రచార కార్యదర్శి పగిడిమర్రి సత్యమూర్తి,అలంపల్లి శ్రీనివాసులు, ప్రభాకర్, లక్ష్మీనారాయణ, లక్ష్మయ్య తదితరులు పాలుగోని దాతకు ధన్యవాదములు తెలియజేసినారు.

Views: 0