KAVITA I ఈడి అక్కకు వేసింది బేడి

ఎట్టకేలకు కల్వకుంట్ల కవిత చట్టానికి సిక్కింది...

KAVITA I ఈడి అక్కకు  వేసింది బేడి

జయభేరి, హైదరాబాద్:

ఢిల్లీ లిక్కర్ కేసులో.. కవిత ఇంట్లో సుమారు 4 గంటలపాటు సోదాలు
ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన 10 మంది ఈడీ అధికారులు
కీలకమైన పత్రాలను స్వాధీనం
పలుమార్లు విచారణకు హాజరుకావాలని నోటీసులు
ఎట్టకేలకు కల్వకుంట్ల కవిత చట్టానికి సిక్కింది...
హైడ్రామాకు తెర పెట్టింది ఈడి.. అక్క దగ్గర ఉన్న 16 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది ఈడి..

Read More Modi I అక్టోబరు 2న రాష్ట్రానికి మోడీ


పార్లమెంటు ఎన్నికలవేళ బిఆర్ఎస్ కి పెద్ద బిగ్ షాక్ తగిలింది...
గత కొంతకాలంగా దాగుడుమూతల ఆటల సాగుతున్న లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత ఈడి చేతికి చిక్కింది. ఇవాళ ఉదయం హైదరాబాదులోని ఆమె ఇంట్లో దాదాపు నాలుగు గంటల వరకు ఎమ్మెల్సీ కవితను విచారించారు. విచారణ అనంతరం పూర్తిగా రుజువు కాబడి కోర్టు ఆదేశాల ప్రకారం ఈ డి ఐ టి అధికారులు కవితకు అరెస్టు నోటీసును అందజేసి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా కవిత భర్త దగ్గర నుంచి కూడా డ్రైవరు సన్నిహితుల దగ్గర నుంచి పూర్తిగా అన్ని సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

Read More Students I నైపుణ్య శిక్షణకు.. కేరాఫ్ తెలంగాణ....

ఒకవైపు తెలంగాణ శాసనసభలో చావుతప్పి కన్ను లొట్టబోయిన బిఆర్ఎస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికలు నేడో రేపు అనే నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పార్టీని వీడుతున్న నేతలు చూసి ఒకపక్క చెమటలు పడుతున్న కేసీఆర్ కి అటు పార్టీకి దిక్కుతోచని పరిస్థితి దాపురించింది. దీంతో ప్రస్తుతం కెసిఆర్ తో ఉన్న నాయకులు కూడా ఆ పార్టీని వీడెందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే బిఆర్ఎస్ శ్రేణులు కవిత అరెస్టును నిరసిస్తూ పార్లమెంటు ఎలక్షన్ లో బిజెపి ఓడిపోతుందని అందుకే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారని బిఆర్ఎస్ శ్రేణులు బగ్గుమంటున్నారు... ఎంతైనా నిప్పులేనిదే  పొగ రాదు కదా.... అవినీతి చెయ్యందే అక్క అరెస్టు కాదు..... మొత్తానికి పార్లమెంటు ఎన్నికలవేళ లిక్కర్ కేసు తెలంగాణ ప్రజలకు  మంచి కిక్కు నిచ్చే వార్తనందించింది సిబిఐ ఈడి...

Read More Telangana MP I టార్గెట్ @17

Views: 0