రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి:- ఎమ్మెల్యే మల్లారెడ్డి

గుండ్లపోచంపల్లిలో రూ.7 కోట్ల 73 లక్షలతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం..
అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి..

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి:- ఎమ్మెల్యే మల్లారెడ్డి

జయభేరి, మేడ్చల్ : రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తామని మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు.

శనివారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ.7 కోట్ల 73 లక్షలతో పలు అభివృద్ధి పనులను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తో కలిసి ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ... గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో దాదాపు రూ.7 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకోవడం ఆనందంగా ఉందని, మేడ్చల్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీలను, గ్రామాలను అద్దంలా తీర్చిదిద్దామని మల్లారెడ్డి అన్నారు.

Read More Election Bonds I సుప్రీం ఆదేశం.. ఎన్నికల బాండ్లు బయట పెట్టాల్సిందే..

గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని 15 వార్డులో ప్రతి వార్డు అభివృద్ధికి ఇప్పటి వరకు రూ.4 కోట్ల పైగా నిధులు ఖర్చు చేశామని, కౌన్సిలర్లు ఏపార్టీలో ఉన్న రాజకీయాలకు అతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా పాలకవర్గం పనిచేసిందన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని గెలిచక ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యమని మల్లారెడ్డి తెలిపారు. స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ మంచి నాయకుడని ఆయన మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు.

Read More Telangana I లగ్గం ఎట్లా జేయ్యాలే!?

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్వామి నాయక్, చైర్ పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్లు అమరం సరస్వతీ, సాయిపేట శ్రీనివాస్, అమరం జైపాల్ రెడ్డి, దొడ్ల  మల్లికార్జున్, అమరం హేమంత్ రెడ్డి, భేరి బాలరాజు, చింత పెంటయ్య, వీణ సురేందర్ గౌడ్, రజిత వెంకటేష్, కో అప్షన్ సభ్యులు దేవేందర్, మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి, భాజపా మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read More Telangan I ఏదీ రాజ్యాంగ స్ఫూర్తి.. సందేహమా? సవాళ్ల?

IMG-20241005-WA2618

Read More Telangana I పరీక్షకే..పరీక్ష...

కొత్తగా అభివృద్ధి చెందుతున్న నగరం మల్కాజిగిరి:- ఎంపీ ఈటల
కొత్తగా అభివృద్ధి చెందుతున్న నగరం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం అని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

Read More Modi I అక్టోబరు 2న రాష్ట్రానికి మోడీ

మల్కాజిగిరి పార్లమెంట్ దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం అని ఇక్కడ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించిన తక్కువే అన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం నుండి సీఎస్ఆర్ నిధుల మంజూరుకు కృషి చేస్తామని ఈటల హామీ ఇచ్చారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి అందరితో కలిసి కట్టుగా మని చేసి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

Read More Telangana I కాంగ్రెస్ పార్టీ ఓకే ఆశాదీపంలా కనిపిస్తోంది

Views: 0