Brs - Kcr : ఆ వాస్తుదోషమే కవితను జైలుపాలు చేసిందా..?
మరి కేసీఆర్ సమస్యలు తీరతాయా? బీఆర్‌ఎస్‌లో పరిస్థితులు మారతాయా?
తెలంగాణ రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం పతనాన్ని చవిచూస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పాటు, ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత జైలులో కూరుకుపోవడం, ఫోన్ ట్యాపింగ్ కేసులో గత ప్రభుత్వ పాత్ర ఉందని ప్రచారం చేయడం, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌ను టార్గెట్ చేయడం...
వాస్తు దోషమే కారణమా?
బీఆర్‌ఎస్ పార్టీ గట్టి దెబ్బ వెనుక వాస్తు దోషం ఉందని గులాబీ పార్టీ అధినేత గుర్తించినట్లు సమాచారం. మొదటి నుంచి యజ్ఞ యాగాలు, వాస్తుకు ప్రాధాన్యత ఇస్తున్న కేసీఆర్ తెలంగాణ భవన్ లో వాస్తు దోషమే పార్టీ పతనానికి కారణమని గుర్తించారు. దీంతో వాస్తు మార్పులు చేయాలని గులాబీ అధినేత ఆదేశించారు. తెలంగాణ భవన్ లో వాస్తు మార్పులు తెలంగాణ భవన్ ప్రవేశ, నిష్క్రమణలో వాస్తు దోషం ఉందని గుర్తించిన కేసీఆర్ వెంటనే తెలంగాణ భవన్ ప్రవేశ, నిష్క్రమణలను మార్చాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ లో వాస్తు మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తెలంగాణ భవన్‌కు వచ్చేవారు, వెళ్లేవారు వాయువ్య ద్వారంనే వినియోగిస్తున్నారు. అయితే వాయువ్య దిశలో నడవడం వల్ల ఈ తీవ్ర పరిణామాలు వస్తాయని వాస్తు నిపుణులు సూచించడంతో గేటును ఈశాన్య దిశకు మార్చాలని నిర్ణయించారు.
వాస్తు మార్పులతో కేసీఆర్ సమస్యలు తీరతాయా?
ఇక నుంచి ఈశాన్య ద్వారం నుంచి మాత్రమే రాకపోకలు సాగించాలన్న వాస్తు పండిట్ల సూచనలతో మార్పులు చేశారు. దీనితో పాటు, ఈశాన్య దిశ నుండి రాకపోకలను సులభతరం చేయడానికి గేటుతో పాటు కొత్త ర్యాంపును కూడా ఏర్పాటు చేశారు. మరి కేసీఆర్ సమస్యలు తీరతాయా? బీఆర్‌ఎస్‌లో పరిస్థితులు మారతాయా? అనేది తెలియాల్సి ఉంది.
Post Comment