ఘనంగా ఏసిరెడ్డి నరసింహ్మారెడ్డి 33వ వర్ధంతి
ఏ.సి.రెడ్డి నర్సింహ్మరెడ్డి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రత్యేక్షంగా పాల్గొని నైజాం సర్కారుకు దొరలకు ఎదురొడ్డి పోరాటం చేసిన మహోన్నత వ్యక్తని తెలిపారు. రైతాంగ సాయుధ పోరాట సమయంలో రజాకార్లు జరిపిన దాడిలో ఏ.సి.రెడ్డి కుడి కాలు తొడలో బుల్లెట్ దిగినప్పటికీ నైజాం సైన్యాలకు ఎదురొడ్డి పోరాటం చేసిన ఉద్యమ సూర్యుడని అన్నారు.
జయభేరి జనగామ జులై 28 : దోపిడీ అణిచివేతకు వ్యతిరేఖంగా తెలంగాణ ప్రాంతంలో భూమికోసం భుక్తికోసం వెట్టిచాకిరి విముక్తికోసం పీడిత ప్రజల పక్షాన జరిపిన పోరాటమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని చరిత్రలో సువర్ణాక్షరములతో వ్రాయబడిందని జనగామ గడ్డపై సాయుధపోరాటంకు ముందుండి నడిపించిన ప్రజానేత ఉద్యమ సూర్యుడు త్యాగశీలి అమరజీవి కామ్రేడ్ ఏ.సి.రెడ్డి నర్సింహ్మరెడ్డి అని ఆయన 33 వ వర్ధంతి సభలో ముఖ్యఅతిథిగా హాజరైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగువెల్లి నర్సిరెడ్డి పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్సీ నర్సిరెడ్డిమాట్లాడుతూ... ఏ.సి.రెడ్డి నర్సింహ్మరెడ్డి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రత్యేక్షంగా పాల్గొని నైజాం సర్కారుకు దొరలకు ఎదురొడ్డి పోరాటం చేసిన మహోన్నత వ్యక్తని తెలిపారు. రైతాంగ సాయుధ పోరాట సమయంలో రజాకార్లు జరిపిన దాడిలో ఏ.సి.రెడ్డి కుడి కాలు తొడలో బుల్లెట్ దిగినప్పటికీ నైజాం సైన్యాలకు ఎదురొడ్డి పోరాటం చేసిన ఉద్యమ సూర్యుడని అన్నారు. సాయుధ పోరాటం సందర్బంగా తెలంగాణ ప్రాంతంలో 10 లక్షల భూములు పంచబడ్డాయని, 4వేల మంది అమరులైనారని తెలిపారు. సాయుధ పోరాటం ఫలితంగా ప్రభుత్వం భూసంస్కరణల చట్టం తేవడం జరిగిందని అంతేకాదు దున్నేవానికి భూమి అనే నినాదం ఆచరణలోకి వచ్చిందన్నారు. ఏ.సి.రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా పనిచేసిన సందర్బంగా స్వంత ఆస్తులుగాని, భూములు సంపాదించుకోలేదన్నారు. అలాగే పెళ్లి చేసుకుంటే పార్టీకి ఉద్యమాలకు ఆటంకమని భావించి పెళ్లి చేసుకోకుండా బ్రతికిన నిస్వార్ధ నిరాడంబర వ్యక్తని తెలిపారు.
ఏ.సి.రెడ్డి మరణించే నాటికి వారి ఒంటిపై డ్రెస్సుతోపాటు అధనంగా మరొక డ్రెస్సు మాత్రమే కల్గిన త్యాగశీలి అన్నారు. ఏ.సి.రెడ్డి మరణించి 32సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా మనమధ్యే ఉన్నట్లుఉండని తెలిపారు. జనగామ జిల్లాలో ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న పేదలకు ఇండ్ల పట్టాలివ్వాలని. మౌలిక సదుపాయాలు మంచినీరు కరెంటు రోడ్లు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గుడిసె వాసులపై నిర్బంధాన్ని ఆపాలని అన్నారు దేశంలో బీజేపీ ప్రభుత్వం మతం మత్తు రుద్ది ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగోట్టి పాలన దాగిస్తుందని విమర్శించారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను తొలగిస్తూ పెద్ద ఎత్తున నిరుద్యోగాన్ని పెంచుతున్నారని అన్నారు. బీజేపీ కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు రగిలిస్తూ ప్రజా హక్కులను రాజ్యాంగం విలువలను కాలరాస్తూ భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుధర్మశాస్త్రాన్ని అమలు చేయాలని ప్రయత్నం చేస్తుందని తెలిపారు.
దేశ జిడిపి గణనీయంగా పడిపోవడంతో దేశం ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టబడుతుందని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందన్నారు ఇళ్ల స్థలాలు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని తెలిపారు. సిపిఎం ప్రజా సమస్యల పరిష్కారంకై రానున్న రోజుల్లో ఏ.సి.రెడ్డి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని జిల్లాలలో ప్రజా పోరాటాలు ఉద్యమాలు నిర్వహించడమే ఏ.సి.రెడ్డికి ఘనమైన నివాళులు అర్పించినట్టవుతుందని ఈ సందర్బంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు. సింగారపు రమేష్.రాపర్తి సోమయ్య సీనియర్ నాయకులు బొట్ల శ్రీనివాస్ జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి. జోగు ప్రకాష్. సుంచు విజేందర్.పోత్కనూరి ఉపేందర్, బోడ నరేందర్, పొదల నాగరాజు, బెల్లంకొండ వెంకటేష్, మునిగేల రమేష్, కొడెపాక యాకయ్య, సీనియర్ నాయకులు గురిజాల లక్ష్మీ నరసింహ రెడ్డి, ఎండి దస్తగిరి, సిపిఎం మండల కార్యదర్శులు మాచర్ల సారయ్య ప్రజ్ఞపు నర్సింహులు నాయకులు తుటి దేవదానం వెంకటమల్లయ్య, కళ్యాణం లింగం, బొడ్డు కరుణాకర్, పర్వతం నర్సింలు, మైలార వెంకటేశ్వర్లు, కాసాని పుల్లయ్య, సోమ సత్యం, మినులాపురం ఎల్లయ్య, రామగల్ల అశోక్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సందీప్, ధర్మబిక్షం, వివిధ మండలాల నుండి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Post Comment