Ambedkar : "అందరి వాడు అంబేద్కర్"

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133 జయంతి సందర్భంగా తుంగతుర్తి బొడ్రాయి సమీపంలో ఉన్న వారి విగ్రహాం వద్ద ఘనమైన నివాళులర్పించిన.

Ambedkar :

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133 జయంతి సందర్భంగా తుంగతుర్తి బొడ్రాయి సమీపంలో ఉన్న వారి విగ్రహాం వద్ద ఘనమైన నివాళులర్పించిన. మాల మహానాడు కేతపల్లి మండల అధ్యక్షుడు మెరుగుమళ్ళ బిక్షం.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలు, మహిళల సాధికారతకు పాటుపడిన మహానీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచాడని   ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కట్టుబడి ఉండాలని అన్నారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమే తెలంగాణ రాష్ట్రానికి జవజీవం పోసిందని గుర్తు చేసుకున్నారు. ఆయన స్ఫూర్తితోనే ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పాటు పడుతుందని అన్నారు. దళితుల అభ్యున్నతిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో అడుగులు వేస్తుందనఅని అన్నారు.

Read More కురుమల పోరాటానికి ఎమ్మార్పీఎస్ మద్దతు కావాలి...

ఈ కార్యక్రమంలో ఎంపిటిసి బొజ్జ సుందర్ తుంగతుర్తి ఎంపిటిసి సూది రెడ్డి వెంకట్ రెడ్డి మాజీ ఎంపీటీసీ కీర్తి వెంకన్న గౌడ్ మాజీ ఎంపిటిసి మట్టి సాల్మన్ సర్పంచ్ ఎడ్ల రమేష్. గ్రామ శాఖ అధ్యక్షుడు ముదిరెడ్డి సుమన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కీర్తి సత్యనారాయణ గౌడ్ మాజీ సర్పంచ్ పాల్వాయి వెంకటయ్య గాదరి సతీష్ ఉపేందర్ లకపాక శేఖర్ రాములు బిక్షం రాజు గాదరి జంపన్న, లకపాక రాజయ్య శేషు బొప్పని కిషోర్ ఏ డాకుల అశోక్ కోటయ్య వీరయ్య చౌడయ్య నాగయ్య శౌరి జార్జి వెంకటేశం నాయకులు, గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Read More హరీష్ రావు పై అక్రమ కేసులు తగవు