MLC : కవితకు జ్యుడీషియల్ కస్టడీ జులై 3 వరకూ పొడిగింపు
కవితకు ముట్టినవి రూ. 292 కోట్లు
జయభేరి, న్యూ డిల్లీ, జూన్ 3 :
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది.
Read More IPL Betting : 23 ఏళ్ల వివాహిత ఆత్మహత్య
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం ఈడీ ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ కేసులో కవితపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది. మొత్తం లిక్కర్ స్కాం విలువ రూ.1100 కోట్లు అని.. అందులో కవితకు ముట్టినవి రూ. 292 కోట్లు అని.. ఆప్ నేతలకు రూ. 100 కోట్లు అని ఈడీ ఛార్జిషీట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కవిత తన ఫోన్‌లో సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఈడీ తెలిపింది. మరోవైపు ఇవాళే కవిత రిమాండ్ జులై 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
Read More HOUSE PRICES : ఇళ్ల ధరలు పడిపోతున్నాయి
Views: 0


