PETROL AND DIESEL VEHICLES : 36 కోట్ల పెట్రోల్, డీజిల్ వాహనాలకు స్వస్తి
దశలవారీగా అమలు చేస్తాం: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
దేశంలో 36 కోట్ల పెట్రోల్, డీజిల్ కార్లు/భారీ వాహనాలను దశలవారీగా రద్దు చేయనున్నట్టు కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
దేశంలో 36 కోట్ల పెట్రోల్, డీజిల్ కార్లు/భారీ వాహనాలను దశలవారీగా రద్దు చేయనున్నట్టు కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వాహనదారులను ప్రోత్సహించేందుకు హైబ్రిడ్, ఫ్లెక్సీ వాహనాలపై జీఎస్టీని తగ్గించే ఆలోచన ఉంది. హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని 5 శాతానికి, ఫ్లెక్సీ వాహనాలపై 12 శాతానికి తగ్గించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాశామని వివరించారు. దీనిపై త్వరలోనే ఆర్థిక శాఖ సానుకూల నిర్ణయం తీసుకోనుందని విశ్వసనీయ సమాచారం.
మన దేశం రూ. 16 లక్షల కోట్లు పెట్రో ఉత్పత్తుల దిగుమతిపై. ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి సారిస్తే ఆ మొత్తాన్ని రైతులకు, వ్యవసాయానికి వెచ్చించవచ్చని చెప్పారు. గడ్కరీ నిర్ణయాన్ని పర్యావరణవేత్తలు స్వాగతిస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం స్వాగతించదగ్గ విషయమే కానీ.. విద్యుత్ ఉత్పత్తిలో శిలాజ ఇంధనాల వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని గ్రీన్ పీస్ ఇండియాకు చెందిన అవినాష్ చంచల్ విజ్ఞప్తి చేశారు.
Views: 0


