Patanjali : సుప్రీంకోర్టులో పతంజలి రాందేవ్ బాబాకు ఎదురుదెబ్బ
కోర్టు ఆదేశాల మేరకు రామ్‌దేవ్ బాబా, బాలకృష్ణ క్షమాపణలు చెప్పారు.
జయభేరి, న్యూఢిల్లీ:
పతంజలి రామ్‌దేవ్ బాబాకు బుధవారం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కరోనిల్ ప్రచారంపై రామ్‌దేవ్ బాబా రెండోసారి క్షమాపణలు చెప్పడంపై సుప్రీంకోర్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కార చర్యలకు సిద్ధంగా ఉండాలని రామ్‌దేవ్ బాబాను కోర్టు హెచ్చరించింది.

పతంజలి ఆయుర్వేదిక్ కంపెనీ తయారు చేస్తున్న కరోనిల్‌పై రామ్‌దేవ్ బాబా తప్పుడు ప్రకటనలు ఇచ్చారు. పతంజలి ఆయుర్వేద ఔషధాలపై తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో రామ్‌దేవ్ బాబాకు, కంపెనీ ఎండీ ఆచార్య బాలకృష్ణకు సుప్రీంకోర్టు గతంలో నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు రామ్‌దేవ్ బాబా, బాలకృష్ణ క్షమాపణలు చెప్పారు.
గతంలో ఇచ్చిన హామీలను ఉల్లంఘించి మళ్లీ తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారంటూ రామ్‌దేవ్ బాబా, బాలకృష్ణలపై సుప్రీం బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా వైరస్‌కు విరుగుడుగా కరోనిల్‌ను ప్రచారం చేయడంపై పతంజలి కంపెనీని గతంలో హెచ్చరించినట్లు కేంద్రం బుధవారం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రామ్ దేవ్ బాబా, బాలకృష్ణ రెండు సార్లు క్షమాపణలు చెప్పినా బెంచ్ సంతృప్తి చెందలేదు. కోర్టు ధిక్కార చర్యలకు సిద్ధంగా ఉండాలని సుప్రీం బెంచ్ బుధవారం హెచ్చరించింది.
Post Comment