Slovakia : స్లోవేకియా ప్రధాని ఫిట్జోపై కాల్పులు, అసలేం జరిగిందంటే..

ఓ ప్రభుత్వ కార్యక్రమానికి ప్రధాని హాజరై, తిరిగి వెళుతుండగా సెంట్రల్ స్లోవేకియా పట్టణం హాండ్లోవాలో ఈ ఘటన జరిగింది. కాల్పులు జరిపినట్టు అనుమానిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ప్రధానిపై జరిగిన హత్యాయత్నమేనని అధికారులు చెబుతున్నారు.

Slovakia : స్లోవేకియా ప్రధాని ఫిట్జోపై కాల్పులు, అసలేం జరిగిందంటే..

స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫిట్జో స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫిట్జోపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపారు. హాండ్లోవాలోని సాంస్కృతిక కేంద్రం ముందు ప్రధాని ఫిట్జో ప్రజలకు అభివాదం చేస్తుండగా, అక్కడి గుంపులోంచి ఒకరు పలుమార్లు కాల్పులు జరిపారు. ఓ ప్రభుత్వ కార్యక్రమానికి ప్రధాని హాజరై, తిరిగి వెళుతుండగా సెంట్రల్ స్లోవేకియా పట్టణం హాండ్లోవాలో ఈ ఘటన జరిగింది. కాల్పులు జరిపినట్టు అనుమానిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ప్రధానిపై జరిగిన హత్యాయత్నమేనని అధికారులు చెబుతున్నారు.

కాల్పులు జరిగిన వెంటనే ప్రధాని ఫిట్జోను సెక్యూరిటీ సిబ్బంది కారులో తరలించారు. తాము అనేకసార్లు కాల్పుల శబ్దాలు విన్నామని ప్రధాని కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టులు వివరించారు. ఫిట్జోను ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆయన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ప్రకటించారు. ప్రధాని ఫిట్జో కడుపు, కాళ్ళు చేతులపై గాయాలైనట్టు నిర్ధరణ కాని వార్తలు చెబుతున్నాయి. ఈ వార్తలను బీబీసీ ధృవీకరించలేకపోతోంది. కాల్పులు జరిపిన వెంటనే ప్రధానిని ఆయన అంగరక్షకులు కారులోకి ఎక్కిస్తూ కనిపించారు. ప్రధానిని హెలికాప్టర్‌లో సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు ఫిట్జో సిబ్బంది చెప్పారు.

Read More హెచ్‌ఐవీకి ఇంజెక్షన్‌ వచ్చేసింది

04293165182346a35879b83735e79703e5e21193dd65624cec31262d88bd8f2e

Read More Top Hamas Commander Killed I టాప్ హమాస్ కమాండర్ హతం..

ఎలా జరిగింది?
హాండ్లోవాలోని సాంస్కృతిక కేంద్రం ముందు ప్రధాని ఫిట్జో ప్రజలకు అభివాదం చేస్తుండగా, అక్కడి గుంపులోంచి ఒకరు పలుమార్లు కాల్పులు జరిపారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాకు ఈశాన్యంగా 180 కిలోమీటర్ల దూరంలో హాండ్లోవా నగరం ఉంది. ఫిట్జోను ముందుగా హెలికాఫ్టర్ ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత హండ్లోవాకు తూర్పున ఉన్న బాన్స్కా బైస్ట్రికాలోని మరో ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ప్రధాని ఆరోగ్యంపై ఆయన ఫేస్‌బుక్ పేజీలో వివరించారు. ''స్లోవేకియా ప్రధానిపై పలుమార్లు కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. హెలికాప్టర్ ద్వారా సమీపంలోని బన్స్కా బైస్ట్రికా పట్టణానికి తరలిస్తున్నాం''అని తెలిపారు. 

Read More ఉక్రెయిన్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

GettyImages-1701706317

Read More అంతర్జాతీయ విద్యార్థుల అడ్మిషన్ల పెంపునకు కత్తెర

రాబర్ట్ ఫిట్జో ఎవరు?
స్లోవాక్ ప్రధానమంత్రి రాబర్ట్ ఫిట్జో గత సెప్టెంబరులో ఎన్నికల తరువాత జాతీయవాద సంకీర్ణానికి నాయకత్వం వహించి తిరిగి అధికారంలోకి వచ్చారు. ఆయన స్మెర్ - ఎస్ఎస్‌డి పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. యుక్రెయిన్‌కు సైనిక సాయం ఆపేస్తాననే వాగ్దానంతో కిందటి అక్టోబరులో ఆయన అధిరంలోకి వచ్చారు. కానీ తాను రష్యా అనుకూలుడిని కానని ఖండించారు. 2018లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ జాన్ కుసియాక్ హత్య తర్వాత ఫిట్టో ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. "స్మెర్ అధికారంలోకి వస్తే , మేం ఉక్రెయిన్‌కు ఒక్క రౌండ్ మందుగుండు సామగ్రిని కూడా పంపం" అని ఫిట్జో తన ప్రచార సమయంలో మద్దతుదారులకు చెప్పారు. అలాగే రష్యాపై పాశ్చాత్య ఆంక్షలను ప్రతిఘటిస్తామని ఆయన చేసిన ప్రతిజ్ఞ కొంతమందికి ఆయనను హంగేరి జనాకర్షక మితవాద ప్రధాని విక్టర్ ఓర్బాన్ తో పోల్చడానికి కారణమైంది.

Read More 2040 నాటికి చంద్రుడిపైకి మనుషులు: సోమ్‌నాథ్

34db94fb895b23c5f555c5c614357aeafb829dd828bc7995a62997436e0c8f7a

Read More world heart day I ప్రపంచ హృదయ దినోత్సవం  

పలువురి దిగ్భ్రాంతి
స్లోవేకియా ప్రధానిపై కాల్పులు జరిగిన ఘటనను అంతర్జాతీయ సమాజం ఖండించింది. స్లోవేకియా ప్రధానిపై కాల్పులు తనను దిగ్భ్రమకు గురిచేసిందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ అన్నారు. ఫిట్జో త్వరగా కోలుకోవాలని ఎస్తోనియా ప్రధాని కాజా కల్లాస్ ఆకాంక్షించారు. ప్రజలు ఎన్నుకున్న నేతపై దాడి అంటే ప్రజాస్వామ్యంపైనే దాడి అని చెప్పారు.

Read More చిన్నారుల ఆసుపత్రిపై దాడి.. 41 మంది మృతి

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఈ దాడిని "భయంకరమైనది" గా అభివర్ణించారు. "ఏ రూపంలోనైనా హింస ప్రామాణికంగా మారకుండా చూడటానికి ప్రయత్నాలు జరగాలన్నారు" ఐర్లాండ్ విదేశాంగ మంత్రి మైఖేల్ మార్టిన్ మాట్లాడుతూ.. ఈ కాల్పులు ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి అని అన్నారు. నాటో చీఫ్ జెన్స్ స్టోెలెన్‌బర్గ్ ''మా ఆలోచలనలన్నీ ప్రధాని ఫిట్జో, స్లోవేకియా ప్రజలతోనే ఉన్నాయి'' అన్నారు. ఇక స్లోవేకియా అధ్యక్షుడు జుజానా కాపుటోవా ప్రధానిపై జరిగిన దాడి వార్త విని దిగ్భ్రమకు గురయ్యానని చెప్పారు. ''నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ క్లిష్ట పరిస్థితినుంచి రాబర్ట్ ఫిట్జో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను'' అని తెలిపారు.

Read More Kerala : కేరళీయుల పెద్ద మనసు..

Views: 0

Related Posts