2025 ఫిబ్రవరి నెలలో భూమ్మీదకి రానున్న సునీత విలియమ్స్

2025 ఫిబ్రవరి నెలలో భూమ్మీదకి రానున్న సునీత విలియమ్స్

జయభేరి, హైదరాబాద్, సెప్టెంబర్ 30 : కొన్ని నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకు పోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నాలు సఫలం అవుతున్నాయి. 

నాసా, స్పేస్ఎక్స్ చేపట్టిన క్రూ-9 మిషన్ ను శనివారం రాత్రి ప్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి లాంచ్ చేశారు. కొన్ని గంటల తరువాత సోమవారం తెల్లవారుజామున స్పేస్ఎ క్స్ క్రూ-9 విజయవంతంగా అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. 

Read More 2040 నాటికి చంద్రుడిపైకి మనుషులు: సోమ్‌నాథ్

ఈ మిషన్ లో నాసా వ్యోమ గామి నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ వెళ్లారు. అంత రిక్ష కేంద్రానికి చేరుకోగానే వారికి సునీత విలియమ్స్, విల్మోర్ స్వాగతం పలికారు. 

Read More Four Astronauts.. Return To Earth I నలుగురు వ్యోమగాములు అంతరిక్షం నుంచి సురక్షితంగా తిరిగొచ్చారు

స్పేస్ఎక్స్ క్రూ-9 మిషన్ లో ప్రస్తుతం అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్ తో పాటు సునీత, విల్మోర్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో భూమికి తిరిగి చేరుకునే అవకాశం ఉంది.

Read More Top Hamas Commander Killed I టాప్ హమాస్ కమాండర్ హతం..

క్రూ-9 మిషన్‌ను ఈనెల 26నే ప్రయోగించాలని నాసా, స్పేస్‌ఎక్స్ భావిం చగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో, ఫ్లోరిడా పశ్చిమ తీరంలో ప్రతికూల వాతావ రణ పరిస్థితుల కారణంగా మిషన్ ప్రయోగం వాయిదా పడింది. తిరిగి శనివారం సాయంత్రం క్రూ-9 మిషన్ ను ప్రయోగించారు. 

Read More World water day I బొట్టు బొట్టును ఒడిసిపట్టు.. భవిష్యత్తు తరాలకు నీరు అందించండి

ఇదిలాఉంటే.. 2024 జూన్ నెలలో అంతరిక్ష కేంద్రానికి బోయింగ్‌ స్టార్‌లైనర్‌ ద్వారా వెళ్లిన సునీతా విలియమ్స్‌, బుచ్ విల్మోర్ అందులో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. 

Read More Election : ఎన్నికల అస్త్రంగా 'కచ్చతీవు'

అయితే, వారిని తీసుకొ చ్చేందుకు నాసా ప్రయ త్నాలు ప్రారంభించింది. వ్యోమగాములను స్టార్ లైనర్ పైకి తీసుకురావడం చాలా ప్రమాదకరమని నాసా నిర్ధారించింది. అంతరిక్ష నౌక సెప్టెంబర్ లో భూమికి తిరిగి చేరుకుంది. అంతరిక్ష కేంద్రంలో చిక్కు కున్న సునీత విలియమ్స్, విల్మోర్ ను భూమిపైకి తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ యొక్క క్రూ-9 మిషన్ ను నాసా ప్రయోగించింది...

Read More జపాన్ లో లాఫ్ రూల్...