ప్రపంచంలో 3వ యుద్ధం...

ప్రపంచంలో 3వ యుద్ధం...

ప్రపంచంలో ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ గురించి తెలియని వారు ఉండరు. ఎవరూ చేయని వినూత్న ప్రయోగాలు ఆయన చేస్తుంటారు. ఎవరికీ రాని ఆలోచనలు ఆయనకు వస్తుంటాయి. దక్షిణ కొరియాపై ఎప్పుడూ ఏదో ఒక విధంగా దాడులు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు కిమ్. ఈ క్రమంలోనే కిమ్ దక్షిణ కొరియాకు వందల కొద్ది బెలూన్లు పంపించాడు. అందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది. కిమ్ పంపించింది బెలూన్లే కదా అని ఈజీగా కొట్టిపడేయకండి.

ఇప్పుడు ఆ బెలూన్లే ఇంటర్నెట్ లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. అసలు ఈ తరహా ఆలోచనలు కిమ్ క ఎలా వస్తాయబ్బా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ ఆ బెలూన్లో ఏమున్నాయో తెలుసా? యుద్దం అంటే ఏంటీ? కత్తులు, గన్స్ తో తలపడతారు. లేదా జెట్స్ తో ఫైట్ చేస్తారు. అది కాదంటే మాటల యుద్ధానికి దిగుతారు. ఇదే కదా యుద్ధం అంటే.. కానీ అక్కడ అలా కాదు. చెత్తతో యుద్ధం చేసుకుంటారు. మరి అంతే కదా చెత్తతో యుద్ధమేంటీ చెప్పేవారు లేకగానీ అసలు వీరి మధ్య చెత్త యుద్ధం ఎలా స్టార్ట్ అయింది. అసలు అది ఎలా నడుస్తోంది చెప్తే.. నవ్వు.. బాధ రెండు కలుగుతాయి. గత కొంత కాలంగా ఉభయ కొరియా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అగ్ర రాజ్యం అయిన అమెరికాతో దక్షిణ కొరియా చేపట్టే సైనిక విన్యాసాలకు స్పందనగా ఉత్తర కొరియా తరుచూ క్షిపణులతో దాడులు చేస్తూనే ఉంటుంది.

Read More world heart day I ప్రపంచ హృదయ దినోత్సవం  

కిమ్ జోంగ్ ఉన్ పొరుగు రాజ్యమైన దక్షిణ కొరియాపై ఓ వింతైన ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈసారి క్షిపణులు, బాంబులతో కాదు. ఓ ‘చెత్త’ ఐడియాతో వచ్చాడు. కిమ్ తన పొరుగు దేశంలో బెలూన్ల ద్వారా చెత్త, విసర్జన పదార్థాలను జారవిడిచి ప్రతీకారం తీర్చుకున్నాడు. దీంతో దక్షిణ కొరియాలోని కొంతమంది బెలూన్ల ద్వారా ఉత్తర కొరియాలోకి లేఖలు పంపడం మొదలు పెట్టారు. దీనికి ప్రతీకార చర్యగా కీమ్ ఈ చెత్త దాడి చేసినట్లు తెలుస్తుంది. బుధవారం ఉదయం ఉత్తర కొరియా, బెలూన్లు ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. అవి సరిహద్దు దాటిన తర్వాత సియోల్కు ఉత్తరంగా ఎగిరాయని పేర్కొంది. బెలూన్ల నుంచి పడే వస్తువుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే ఈ చెత్త దాడిలో ఎలాంటి నష్టం జరగలేదని దక్షిణ కొరియా తెలిపింది నిజానికి మే నెల చివరి వారం నుంచి ఈ బెలూన్ల యుద్ధం సాగుతోంది.

Read More Isha Ambani : ఇషా అంబానీ ఇంటిని కొన్న హాలీవుడ్ న‌టి...

ఉత్తర కొరియా ఇలా బెలూన్లు పంపడం ఇది పదో సారి ఇప్పటి వరకు 2,000 కంటె ఎక్కువగానే బెలూన్లను ప్రయోగించారు. ఆ బెలూన్లలో ఎరువులు, సిగరెట్ పీకలు, చెత్త వస్తువులు, వ్యర్థాలు ఉంటున్నాయి. అయితే దక్షిణకొరియా పంపిన బెలూన్లకు ప్రతీకారంగానే మేము బెలూన్లను పంపుతున్నామని ఉత్తర కొరియా చెబుతోంది. కొత్త కొరియా చెత్త బెలూన్లకు గతంలో దక్షిణ కొరియా గట్టి జవాబునిచ్చింది. సరిహద్దుల్లో పెద్ద పెద్ద లౌడ్‌స్పీకర్లను ఏర్పాటు చేసి ఉత్తర కొరియా వ్యతిరేక ప్రచారాలను ప్రారంభించింది. సైనిక స్థావరాలు ఉన్న ఉత్తర కొరియా ప్రాంతాల్లో లౌడ్‌ స్పీకర్ల ద్వారా K-పాప్ సంగీతం, విదేశీ వార్తలతోపాటు, ప్యాంగ్యాంగ్ వ్యతిరేక ప్రసారాలను దక్షిణ కొరియా సైన్యం హోరెత్తిస్తోంది.అయితే ఉత్తర కొరియాలో విదేశీ వార్తలు, K-పాప్‌ పాటలు వినడం తీవ్ర నేరాలుగా పరిగణిస్తారు. అవి దేశంలోని ప్రజల పట్ల ప్రభుత్వ వ్యతిరేక భావాలను నాటుతుందని, తన అధికారాన్ని బలహీనపరుస్తుందని నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ భావిస్తారు.

Read More గ్రామమహిళలను పెళ్లి చేసుకుంటే 4140 డాలర్లు

అందుకే వాటిని అక్కడ నిషేధించారు. 2015లో ఇలాగే దక్షిణ కొరియా లౌడ్‌ స్పీకర్లతో ఉత్తర కొరియా వ్యతిరేక ప్రచారం చేయగా ప్రతిచర్యగా కిమ్‌ ప్రభుత్వం ఫిరంగులను పేల్చింది. అప్పట్లో అది ఉద్రిక్త పరిస్థితులకు తావిచ్చింది. మళ్లీ ఆ పరిస్థితులే ఎదురైతే ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని దక్షిణ కొరియా బలగాలను ఆదేశించింది. నిజానికి వీరి మధ్య ఇలా చెత్తతో యుద్ధం జరగడం మొదటిసారేం కాదు.. 1950లో కొరియన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దక్షిణ కొరియా, ఉత్తర కొరియా మధ్య బెలూన్లతో యుద్ధం జరుగుతోంది. ఒక దేశం పైకి మరొక దేశం ఈ రకమైన బెలూన్లను పంపుతున్నారు. ఈ చెత్త దాడి గురించి ఇటీవల సౌత్ కొరియా ఐక్యరాజ్య సమితి బృందానికి తెలియజేసింది. అనుమానాస్పద వస్తువులపై స్థానిక ప్రజలను అప్రమత్తం చేసింది.

Read More Slovakia : స్లోవేకియా ప్రధాని ఫిట్జోపై కాల్పులు, అసలేం జరిగిందంటే..

ఇలాంటి వస్తువులతో ఇళ్లకు, ఎయిర్ పోర్ట్, రోడ్లకు ప్రమాదం అని దక్షిణ కొరియా సైనికులు అంటున్నారు. వీటి వల్ల ఉత్పన్నమయ్యే పర్యవసనాలకు కిమ్ దే బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి చిల్లర పనులు, అమానవీయ పనులు కిమ్ వెంటనే ఆపాలని హెచ్చరించింది. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ బాంబులతో యుద్ధం చేస్తోంది. మరో పక్క ఇజ్రాయెల్-హమాస్ నెత్తురోడుతోంది. ఈ సమయంలో వీళ్ల చెత్తయుద్ధం చర్చగా మారింది. అసలే కిమ్ కి తిక్కెక్కువ అని అందరికీ తెలుసు.. మరి ఆయన దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారో.. తెలియదు. మరి ఈ చెత్త యుద్ధానికి ఎవరు ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి...

Read More జపాన్ లో లాఫ్ రూల్...

Latest News

ములుగు జిల్లా చల్పాక ఎన్ కౌంటర్ పై హైకోర్టులో నేడు విచారణ! ములుగు జిల్లా చల్పాక ఎన్ కౌంటర్ పై హైకోర్టులో నేడు విచారణ!
హైదరాబాద్, డిసెంబర్ 02 : ములుగు జిల్లా చల్పాక దగ్గర అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టు లకు మధ్య ఎదురు కాల్పులు...
రైతుబంధును బంజేసే కుట్ర: హరీశ్ రావు..!!
డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు
యువత ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చాక కాకుండా ముందు నుండే సిద్ధంగా ఉండాలి...
ప్రపంచం కమ్యూనిస్టుల వైపు చూస్తున్నది... 
రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు  కలెక్టర్