Russia Mall Terror Attack I రష్యాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు
60 మంది మృతి.. పుతిన్ కీలక ప్రకటన..
రష్యాలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. మాస్కోలోని కాన్సర్ట్ హాల్‌పై ముష్కరులు దాడి చేశారు. ఈ ఘటనలో 60 మంది చనిపోయారు. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మాస్కోలోని కాన్సర్ట్ హాల్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
కాల్పులతో దద్దరిల్లిన మాస్కో..క్రాకస్ నగరంలోని కాన్సర్ట్ హాల్ లోకి వచ్చిన ముష్కరులు మెషిన్ గన్ లతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. బాంబులు విసిరి భయాందోళనలు సృష్టించారు. ఈ ఘటనలో 60 మందికి పైగా మరణించారు. వంద మందికి పైగా గాయపడ్డారు. ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ ఈ కాన్సర్ట్ హాల్‌లో కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉగ్రదాడితో రష్యాలో కలకలం రేగింది. మాస్కో దాడిపై పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పుతిన్ హెచ్చరించారు.. మాస్కోలో జరిగిన దాడిని అమెరికా, ఐక్యరాజ్యసమితి, ఈయూ ఖండించాయి. గత రెండు దశాబ్దాల్లో రష్యాలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదేనని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ విజయం సాధించారు.అతను అధ్యక్షుడిగా ఎన్నికైన కొద్ది రోజులకే రష్యా రాజధానిలో జరిగిన ఉగ్రదాడి చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటన రష్యాను కుదిపేసింది. బాధితుల అరుపులతో ఘటనా స్థలంలో భీకర వాతావరణం నెలకొంది. క్షతగాత్రులను అధికారులు హెలికాప్టర్‌లో తరలించారు. వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం మాస్కోలోని కాన్సర్ట్ హాల్‌పై తామే దాడి చేశామని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ తెలిపింది. దాడి చేసినవారు సురక్షితంగా తమ స్థావరాలకు వెళ్లినట్లు ఐఎస్ ప్రకటించడంతో రష్యా సైన్యం (రష్యన్ నేషనల్ గార్డ్) అప్రమత్తమైంది.
Post Comment