A HMPV చైనా వైరస్ భారత్ లోకి ఎంట్రీ!

బెంగళూరులో 8 నెలల శిశువుకు పాజిటివ్ గా నిర్ధారణ?

A HMPV చైనా వైరస్ భారత్ లోకి ఎంట్రీ!

జయభేరి, హైదరాబాద్, జనవరి 05 : చైనాలో కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇంకా కరోనా దడ నుంచి ప్రపంచం పూర్తిగా తేరుకోకముందే ఇప్పుడు మరో కొత్త వైరస్‌.. కరోనాలాంటి లక్షణాలతో వేగంగా వ్యాప్తి చెందుతోం దంటున్నారు.

హెల్త్‌ ఎక్స్‌పర్ట్స్. ఇన్‌ఫ్ల్యూ యెంజా A, HMPV వైరస్‌లతో చైనా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా రు. రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నయి. హ్యుమ న్ మెటాప్ న్యూమోవైరస్ అనే ఈ కొత్త వైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెందుతోందంటు న్నారు. అయితే చైనా దీనిని అధికారికంగా ధృవీకరించలేదు.
ఈ హెచ్ఎంపీవీ (HMPV) వైరస్‌.. కరోనా వైరస్‌ లానే అంటువ్యాధి అని, ప్రాణాం తకం అని చెబుతున్నారు. హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారిలో దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉన్నట్టు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. 

Read More భారత్ మిత్రదేశాలలో అలజడి...

ఇన్‌ఫ్లుఎంజా A, HMPV, మైకోప్లాస్మా నిమోనియా, COVID-19 వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందుతు న్నాయి. ఈ కొత్త వైరస్‌ హెచ్ఎంపీవీ (HMPV) శరవేగంగా విస్తరిస్తోందం టున్నారు.
తాజాగా  చైనాలో విజృం భిస్తున్న “హెచ్‌ఎంపీవీ వైరస్ ఇండియాలోకి” ఎంటర్ అయింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో తొలి కేసు వెలుగు చూసిం ది. ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వచ్చిన నివేదిక ప్రకారం 8 నెలల శిశువుకు పాజిటివ్ గా నిర్ధారణ అయిందని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 

Read More Top Hamas Commander Killed I టాప్ హమాస్ కమాండర్ హతం..

బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్‌లో ఈ కేసు నమోదైంది. అయితే ఈ వైరస్ మన దేశంలో తొలి కేసు నమోదవడంతో అందరి గుండెల్లో దడ మొదలైంది. చైనాలో హెచ్ఎంపీవీ (HMPV) వైరస్ కేసులు పెరుగుతుం డటంపై భారత్ అలర్ట్ అయ్యింది. 
ఎలాంటి ఆందోళన అవస రం లేదని కేంద్ర వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసిన కొద్ది గంటల్లోనే భారత్‌లో తొలి కేసు నమోదైంది. నగరంలో ఇదే మొదటి కేసు కావడంతో వైద్య, ఆరోగ్య సిబ్బంది, అధికారులు అప్రమత్తం అయ్యారు.

Read More Highway in China border I డ్రాగన్ దూకుడును తనిఖీ చేయండి!

Social Links

Post Comment