ఆస్ట్రేలియాలో తెలుగు యువకుల దుర్మరణo

ఆస్ట్రేలియా దేశంలో క్వీన్స్ ల్యాండ్ ప్రాంతంలో జరిగిన ఘోర విషాద  సంఘటన ఇద్దరు తెలుగు యువకుల్ని బలిగొంది.  అందమైన జలపాతాల్ని ఆస్వాదిస్తూనే ముగ్గురు యువకులు జలపాతం లో దిగారు. ఒకరిని రక్షించబోయి ఒకరు ఇద్దరు మృత్యువాత పడ్డారు.

ఆస్ట్రేలియాలో తెలుగు యువకుల దుర్మరణo

అందమైన అనుభూతిని పంచే అరుదైన జలపాత ప్రదేశాలు ఆస్ట్రేలియాలో పర్యాటక జనాన్ని కనువిందు చేస్తుంటాయి. ఈ అందమైన ప్రదేశాలను తనివి తీర తిలకించటమే గానీ మునగాలనే ప్రయత్నం చేయకూడదు. కొండల పైనుంచి జాలువారే జలపాతాలు ఆస్వాదిస్తుంటే ఒక తీయటి మధురానుభూతి కలుగుతుంది. ఎంతసేపు గడిపిన ఆ జలపాతాల అందం విడదీయరాని బంధంగా ఉంటుంది. ఆస్ట్రేలియా దేశంలో క్వీన్స్ ల్యాండ్ ప్రాంతంలో జరిగిన ఘోర విషాద  సంఘటన ఇద్దరు తెలుగు యువకుల్ని బలిగొంది.  అందమైన జలపాతాల్ని ఆస్వాదిస్తూనే ముగ్గురు యువకులు జలపాతం లో దిగారు. ఒకరిని రక్షించబోయి ఒకరు ఇద్దరు మృత్యువాత పడ్డారు.

వీళ్ళతో పాటు ఉన్న స్నేహితుడు కొన ఊపిరితో బయటపడ్డాడు. అక్కడ జరిగిన విషాద సంఘటన నుండి బయటపడి దిగ్బ్రాంతి గురైన తోటి స్నేహితుడు కోలుకునే సరికి రెండు గంటలు పట్టింది. ప్రమాదవశాత్తు జరిగిందా, లేక ఈత సరదా కోసం దిగిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందా అనే విషయాలు స్పష్టం కాలేదు. ఇద్దరూ తెలుగు యువకులు మృత్యువాత పడిన సంఘటన నాలుగు గంటల తర్వాత పోలీసులకు సమాచారం అందింది. మృత్యువాత పడిన ఇద్దరు యువకులు ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగు వాళ్లు గా  ఆస్ట్రేలియా ఎంబసీ గుర్తించింది.

Read More గూగుల్ తో తెలంగాణ సర్కార్ ఒప్పందం

ఆస్ట్రేలియాలోని క్విన్స్ ల్యాండ్ వద్ద ఉన్న జలపాతాలను తిలకించేందుకు సెలవు దినాల్లో  పర్యాటక జనం పెద్ద ఎత్తున విచ్చేస్తుంటారు. అయితే యువకులు మృత్యువాత పడిన సమయంలో ఆ ప్రాంతంలో పర్యాటకులు ఎవరూ లేరు. రక్షించే వారి కోసం చేతులు పైకెత్తి కేకలు వేస్తూనే ఆ ఇరువురు యువకులు జలపాతాల్లో  కనుమరుగైపోయారు. ప్రాణాలతో బయటపడిన తోటి స్నేహితుడు చెప్పిన వివరాలను టెన్ మార్స్ లోని నిక్ ఆటమ్ వెల్లడించారు. 

Read More Time : టైమ్ లిస్ట్‌లో సత్య నాదెళ్ల.. అలియా భట్‌లకు స్థానం...

కైన్స్ పోలీసులు రెండు మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్  ప్రాంతంలోని మిల్లా మిల్లా జలపాతం అత్యంత అద్భుతంగా ఉంటుంది. మళ్ళా మళ్ళా చూడాలనే కనువిందు చేసే రమణీయ ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని పేర్కొంటారు. ఆ ప్రాంతంలో ఉన్న జలపాతాల్లో మునగటం అంత శ్రేయస్కరం కాదు. అందుకే సరదాగా మునగాలనుకునే వారికి వాటి పక్కనే ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. అవి కూడా పరిమిత స్థాయిలోనే మునిగే విధంగా సరిహద్దులు ఉంటాయి. కచ్చితంగా ఈత వచ్చిన వాళ్లకు మాత్రమే అక్కడ  అవకాశాలు ఉంటాయి. వాటర్ ఫాల్స్ ను ఎంజాయ్ చేసేవారు అతి కొద్ది మంది మాత్రమే ఆ ప్రాంతాల్లో మునగటానికి ఇష్టపడతారు. వాటర్ సేఫ్టీ మేనేజ్మెంట్ మాత్రం ఇక్కడ పూర్తిస్థాయిలో అమలు చేస్తారు. ఈత నేర్చుకోవడానికి అనేక శిక్షణ కేంద్రాలు కూడా ఉన్నాయి.

Read More Helicopters : గాలిలో ఢీకొన్న హెలికాప్టర్లు..

ఈత రాని వాళ్లకు అక్కడ  ప్రవేశం కల్పించరు. ఆస్ట్రేలియాలోని అనేక ప్రాంతాల్లో జలపాతాలు అతి తక్కువ లోతు ఉండటం విశేషం. అయితే పైనుండి వచ్చే నీళ్ల ఉధృతికి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండటంతో జలపాతాల్లో దాదాపుగా పర్యాటకులు మునగటానికి అవకాశం ఇవ్వరు. మృత్యువాత పడిన ఇరువురు తెలుగు యువకులకు ఈత రాకపోవటం, ఇదే సందర్భంలో సమీపంలో వారిని కాపాడేవారు లేకపోవటం వల్ల లిప్త పాటులో జలపాతాల్లో  కెరటాల్లో కొట్టుకుపోయారు. గత ఆరు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎక్కడా ఎటువంటి ప్రమాదం జరగలేదని అక్కడి అధికారులు నిర్ధారించారు.

Read More Election : ఎన్నికల అస్త్రంగా 'కచ్చతీవు'

కందుకూరుకు చెందిన ముప్పరాజు చైతన్య గుంటూరులో  బీటెక్ పూర్తి చేసి ఎమ్మెస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. చదువు పూర్తయిన తర్వాత వృత్తి రీత్యా అక్కడే స్థిరపడ్డారు. గుంటూరు కు చెందిన యువతని వివాహమాడిన చైతన్య ఆస్ట్రేలియాలోనే స్థిరపడ్డారు.

Read More అంతర్జాతీయ విద్యార్థుల అడ్మిషన్ల పెంపునకు కత్తెర

చైతన్యతో పాటు బాపట్ల ప్రాంతానికి చెందిన బొబ్బ సూర్యతేజ, మరో స్నేహితుడు ముగ్గురు కలిసి ఉత్తర క్వీన్ ల్యాండ్ లోని  మిల్లా మిల్లా జలపాతం వద్దకు విహారయాత్రకు వెళ్లారు. బాపట్ల జిల్లాకు చెందిన సూర్యతేజ జలపాతంలో దిగారు. ఆయన్ను కాపాడే యత్నంలో చైతన్య చేసిన ప్రయత్నంలో ఇద్దరూ  మునిగి.. నీళ్లలో కొట్టుకుపోయారు. పోలీసులు హెలికాప్టర్  గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. బాపట్ల జిల్లాకు చెందిన సూర్య తేజ ఏ ప్రాంతానికి చెందినవారో నిర్ధారణ కాలేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఇరువురు తెలుగు యువకులు మృత్యువాత పడిన విషాద సంఘటన కలచి వేస్తుంది.

Read More UAE : దుబాయిలో 30 ఎంఎం వర్షపాతం

Latest News

ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి  ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
జయభేరి, దేవరకొండ :రాష్ట్రములో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2(హెచ్) ప్రకారం అధికార యంత్రంగం సూచిక బోర్డులను తప్పనిసరిగా...
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పీఏ పల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక స్థానిక ఆదర్శ పాఠశాల ముందు ధర్నా
వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా మొద్దునిద్ర వీడని రేవంత్ సర్కార్ 
ప్రజా ప్రభుత్వంలో విద్యా రంగానికే పెద్ద పీఠ 
విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి