ఛత్రపతి సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా ?

  • ఈ సినిమా మ్యూజిక్ పరంగా ఆల్ టైమ్ సూపర్ హిట్. అయితే ఇందులో సూరీడు అనే చిన్న కుర్రాడి పాత్ర గురించి చెప్పనక్కర్లేదు. సినిమాలో కనిపించింది తక్కువే అయినా... ప్రభాస్ ను ఛత్రపతిగా మార్చింది ఆ కుర్రాడే. బాలుడిపై రౌడీలు దాడి చేయడంతో అప్పటి వరకు ప్రశాంతంగా కనిపించిన ప్రభాస్ ఒక్కసారిగా తన దూకుడు సింహావతారం ఎత్తేసి రౌడీలను షేక్ చేశాడు. ఈ ఒక్క సీన్ సినిమాకే హైలెట్.

ఛత్రపతి సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో వచ్చిన సినిమా ఛత్రపతి. ఈ సినిమాతో మాస్ హీరోగా ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. అమ్మ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. శ్రియ శరణ్ కథానాయికగా నటిస్తుండగా, భానుప్రియ, అజయ్, షఫీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. ఛత్రపతి సినిమా వస్తే టీవీలకు అతుక్కుపోతారు. ఇందులో యాక్షన్ సన్నివేశాలు. మ్యూజిక్ పరంగా ఈ సినిమా ఆల్ టైమ్ సూపర్ హిట్. అయితే ఇందులో సూరీడు అనే చిన్న కుర్రాడి పాత్ర గురించి చెప్పనక్కర్లేదు. సినిమాలో కనిపించింది తక్కువే అయినా... ప్రభాస్ ని ఛత్రపతిగా మార్చింది ఆ కుర్రాడే. బాలుడిపై రౌడీలు దాడి చేయడంతో అప్పటి వరకు ప్రశాంతంగా కనిపించిన ప్రభాస్ ఒక్కసారిగా తన దూకుడు సింహావతారం ఎత్తేసి రౌడీలను షేక్ చేశాడు. ఈ ఒక్క సీన్ సినిమాకే హైలెట్.

3-31

Read More Actress I తల్లైనా తగ్గేదే లే అంటున్న తెలుగు హీరోయిన్.. ఎవరో తెలుసా?

ఇక సూరీడు పాత్రలో నటించిన కుర్రాడు తన అద్వితీయమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సూరీడు పాత్రలో కనిపించిన కుర్రాడి పేరు భాస్వంత్ వంశీ. ఇన్నోసెంట్ లుక్స్.. సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఛత్రపతి సినిమా ఆడిషన్స్‌కి వెళ్లి మొదటి రౌండ్‌లోనే ఎంపికయ్యాడు. జక్కన్న తన అమాయకపు చూపులకు ఫిదా అయిపోయి సూరీడు పాత్రకు సెలెక్ట్ చేసుకున్నాడు. భాస్వంత్ వంశీ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. సూరీడు తన తల్లితో కలిసి కనిపించిన సన్నివేశం ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర చాలా ఎలివేట్ అయింది.

Read More Supritha - Ram Gopal Varma : రాంగోపాల్ వర్మతో సుప్రీత నైట్ పార్టీ..

chatrapati-fame-suridu-role-bhaswanath-vamsi-photo-goes-viral-in-social-medias

Read More Priyamani : ప్రియమణి తొలి రెమ్యూనరేషన్ అంతకన్నా తక్కువే.. తొలి రెమ్యూనరేషన్ ఇంకా దాచుకున్న హీరోయిన్..

అయితే ఈ సినిమా తర్వాత సూరీడు పాత్రలో కనిపించిన కుర్రాడు మరో సినిమాలో కనిపించలేదు. అయితే ఇప్పుడు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పెద్దవాడయ్యాడు. ప్రస్తుతం భాస్వంత్ వంశీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఛత్రపతి సినిమాలో తన తల్లిగా కనిపించిన అనితా చౌదరితో సూరీడు దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటో ఎప్పుడు తీశారు అనే విషయంపై క్లారిటీ లేదు. సూరీడు పెద్దయ్యాక గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. గడ్డం, మీసాలతో ఊహకందని లుక్.

Read More samantha black kills : సామ్ కిల్లర్ లుక్..

Views: 0

Related Posts