Dinner Plate : మీ భోజన పళ్ళెం, టీ కప్పులు, ట్రేలు, టేబుల్‌వేర్ కథలను చెప్పగలవు
ఆహారం తినడానికి లేదా అందించడానికి ఉపయోగించే కత్తులు, ఫోర్కులు, స్పూన్లు...
- ఒక జంట సహ-స్థాపన చేసిన సిటీ స్టార్టప్ ప్రత్యేకమైన టేబుల్‌వేర్‌లతో కూడిన ఓకే స్టోరు నగరంలో...
- క్రాకరీ, కట్లరి ప్రాచీన భారతీయ కథలను చెబుతున్నాయి. అంటే కాకుండా తెరమరుగైన ప్రాచీన కళలతో కూడిన టేబుల్వేర్ ఇప్పుడు అందరిని ఆకృషిస్తుంది. అవి భారతీయ వివాహ వ్యవస్థకు సంబందించిన చిత్రాలతో భారతదేశ గత వైభవం గురించి కథలు చెబుతున్నాయి.
జయభేరి, హైదరాబాద్, మే 25 :
క్రాకరీ, కట్లరి ప్రాచీన భారతీయ కథలను చెబుతున్నాయి. అంటే కాకుండా తెరమరుగైన ప్రాచీన కళలతో కూడిన టేబుల్వేర్ ఇప్పుడు అందరిని ఆకృషిస్తుంది. అవి భారతీయ వివాహ వ్యవస్థకు సంబందించిన చిత్రాలతో భారతదేశ గత వైభవం గురించి కథలు చెబుతున్నాయి.
ఇది మొత్తం భారతీయ బ్రాండ్ స్టోర్. దిగుమతి చేసుకున్న వస్తువులు లేవు. అవన్నీ భారతదేశంలోని కొద్ది సంఖ్యలో ఉన్న కళాకారులచే ప్రత్యేకమైన అద్దకం కళ, క్రాఫ్ట్ రూపాల నుండి క్యూరేట్ చేయబడ్డాయి. అమూల్య, అంటే అమూల్యమైనది, లగ్జరీ యుటిలిటీ వస్తువుల ద్వారా భారతీయ కళలు, చేతిపనులను ప్రోత్సహించడం, చేతివృత్తుల వారికి గౌరవాన్ని సంపాదించడం అనే పెద్ద ఉద్దేశ్యంతో ప్రారంభించబడినది. విలేఖరుల సమావేశంలో వివరాలను తెలియజేస్తూ భార్యాభర్తలు సుశాంత్ అగర్వాల్, త్రిషాలా అగర్వాల్, బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లో వస్తున్న తమ తొలి స్టోర్ అనేక విధాలుగా ప్రత్యేకమైనదని ప్రకటించారు.
అమూల్యం హైదరాబాద్, వివాహ కానుకలకు అంకితం చేయబడింది, మరచిపోయిన కళ, క్రాఫ్ట్ రూపాలను వెలుగులోకి తీసుకువస్తుంది-పిచ్వాయి, జోధ్‌పూర్, ఉదయపూర్ కట్లరీ, క్రాకరీతో సహా ప్రసిద్ధ కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాఖండాలు (ప్రస్తుతం అంబానీల హై-ప్రొఫైల్ వివాహానికి వారి ప్రత్యేకమైన వివాహ బహుమతుల కోసం వార్తల్లో ఉన్న కళాకారుల నుండి సేకరించబడ్డాయి) అని త్రిషాలా అగర్వాల్ తెలియజేశారు. భోజనం తినే పాత్రలు, తేనీటి కప్పులు మాట్లాడుతాయి. మొత్తం పెళ్లి కథను పెయింటిగ్ రూపకం లో చెబుతున్నాయి. మేము పురాతన భారతదేశం గురించి చెప్పే టేబుల్‌వేర్‌లను అందిస్తున్నాము, వివాహం ప్రత్యేకమైన భారతీయ వ్యవస్థ. భోజన పళ్ళెం, టీ కప్పులు, ట్రేలు, టేబుల్‌వేర్ పిచ్వాయ్, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, ఫిలిగిరి వంటి అద్దకం కళారూపాలకు జీవం పోస్తున్నాయని, సుశాంత్ తెలియ జేస్తున్నారు.
పిచ్‌వై టేబుల్‌వేర్ దానిలోని క్లిష్టమైన వివరాలు, రంగులు, శ్రీకృష్ణుని జీవితం, బోధనల వర్ణనల ద్వారా ఆకర్షణీయంగా ఉన్నాయి. జోధ్‌పూర్‌ను బ్లూ సిటీ అని పిలుస్తారు. టేబుల్‌వేర్ యొక్క కలెక్షన్ తగిన నిర్మాణ శైలిని కలిగి ఉంది - కోటలు, రాజభవనాలు, దేవాలయాలు, హవేలీలు, ఇళ్ళు కూడా నీలిరంగు షేడ్స్‌లో ఆ పాత్రలపై చిత్రీకరించబడ్డాయి. ఈ జంట COVID-19కి ముందు వారి అపార్ట్‌మెంట్‌లోని ఒక చిన్న గదిలో ఊరగాయ తయారీతో చిన్నగా ప్రారంభించారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు నాలుగు సంవత్సరాల కష్టతరమైన పోరాటం తర్వాత, వారు తమ ప్రత్యేకమైన స్టోర్‌తో ముందుకు వస్తున్నారు. మేము నిజంగా స్వదేశీ స్టార్టప్‌లమని వారు గర్వంగా ప్రకటించారు.
ఈ జంట తమ పరిధిని అలాగే అనేక ఇతర నగరాలకు తమ విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నగరంలో ఈ రకమైన స్టోర్ ఒక్కటే. వివాహాలు ప్రత్యేకమైనవి, జీవితకాలంలో ఒకసారి జరిగే సందర్భాలు. ప్రతి ఒక్కరూ సందర్భానికి మంచిని కోరుకుంటారు. హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం దాదాపు 3 లక్షలకు పైగా వివాహాలు జరుగుతుండగా, అందులో దాదాపు 10,000 వివాహాలు పెద్ద పెద్ద వివాహాలు. అందు కు రూ. 3 నుండి 5 కోట్ల వరకు ఖర్చు చేస్తారు. హైదరాబాద్ వెడ్డింగ్ మార్కెట్ పరిమాణం ఖచ్చితంగా తెలియనప్పటికీ చాలా ముఖ్యమైనది. అటువంటి క్లయింట్లు మా ఉత్పత్తులను అందించాలనుకుంటున్నాము అని సుశాంత్ చెప్పారు.
మన దేశంలో ఏటా కోటి వివాహాలు జరుగుతాయి. ఇప్పుడు పెళ్లిళ్లు ఒక పరిశ్రమ. పరిశ్రమ పరిమాణం 5 లక్షల కోట్లు. ఇది సంవత్సరానికి 25 నుండి 30% చొప్పున పెరుగుతోంది. కాబట్టి మేము భారతదేశంలోని ఇతర మార్కెట్‌లను కూడా పరిశీలిస్తున్నామని వారు చెప్పారు. ‘హైదరాబాద్ మైస్ (మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కన్వెన్షన్స్ అండ్ ఎగ్జిబిషన్స్) సిటీ. డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు ఇది నగరం. మా రకమైన ఉత్పత్తులకు గొప్ప అవకాశం ఉందని సుశాంత్ చెప్పారు.
Post Comment