Political : సిగ్గులేని రాజకీయాలు బుద్ధి లేని పాలకులు..!?
తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో ఎన్ని రోజులు కేసీఆర్ పాలనలో కీలక పదవులు అనుభవించిన ఆ వయసు మళ్ళీ నా మెదడుకుళ్ళిన పక్షులే మళ్ళీ నవ యవ్వనంతో కొత్త రెక్కలు తొడుక్కుందామని అధికార పార్టీలోకి మారుతున్నారు అంటే ఏమనాలి!?
జయభేరి, హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్రంలో తాజాగా కాంగ్రెస్ పార్టీలోకి కడియం శ్రీహరి కేకే ఆయన కూతురు ఇలా అగ్రనేతలందరూ తెరాస పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వలసలు వస్తున్నారు. ఏమన్నా అంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ నేతలకు ఇది మామూలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సిగ్గు లేదారా నీకు అంటే సిగ్గు ఎందుకు చిన్నప్పుడే పోయింది. నలుగురు నవ్విపోయిన నాకేటి సిగ్గు అన్న రీతిన రాజకీయ నేతలు వ్యభిచార రాజకీయ నేతలుగా మారుతున్నారు. ఈ తతంగం అంతా చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు మింగుడు పడడం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ పంచిన చేరి అధికారాన్ని అప్పనంగా అనుభవించి కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో భూస్థాపితం చేయాలనుకున్న ఆ నాయకులే నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అవకాశవాదుల పెడ సిగ్గు లేకుండా కండువాలు మారుస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎంత మలిన పడి వ్యభిచారంగా మారాయో మనం అర్థం చేసుకోవచ్చు...
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని అగ్గితోటి కడుగు ఈ జీవచ్ఛవాల్ని అన్న దివంగత సీతారామశాస్త్రి అక్షరాన్ని నిజం చేస్తున్న నేటి ఈ సమాజాన్ని అగ్గితోని కడిగిన బుద్ధి రాధేమో అనిపిస్తుంది. ఒకవైపు బహిర్గతంగానే అధికార పార్టీలో కేసీఆర్ పంచన చేరి నాడు కాంగ్రెస్ పార్టీని ఎడాపెడా తిట్టిన నాయకులే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కండువాలు మారుస్తున్నారంటే ఇంతకంటే నీచమైన బతుకు ఇంకొకటి ఉంటుందా!? ఏమైనా అంటే అభివృద్ధి సంక్షేమం కోసం అధికారం పార్టీలోకి రావాలి అధికారం ఉన్న పార్టీలోకి వస్తే పనులు సంక్షేమం ప్రజలకు అందుబాటులో ఉంటాయని నక్క వినయాలు ప్రదర్శిస్తున్న నేతలకు వాతలు ఈ సమాజం పెట్టలేకపోవడం గమనార్హం!
ఒకవైపు నేతలు జంపు జిలానిలు ఇలా కండువాలు పార్టీలు మారుస్తుంటే జనానికి మాత్రం సమాజానికి మాత్రం ఇవేమీ పట్టుండవు ..వంద నోట్ ఇచ్చాడా? కోటర్ మందు ఇచ్చాడా? బిర్యాని పెట్టాడా ?ఓటేద్దామా...! నా కులపోడా? నా పక్కోడ మావోడ కాదా? అనే స్వార్ధ పూరిత సమాజం ఆలోచనలు ఉన్నంతకాలం ఇలాంటి సిగ్గులేని నేతలు బుద్ధిలేని రాజకీయాలు చేస్తూనే ఉంటారు... తాజాగా టిఆర్ఎస్ పార్టీలో కీలకమైన పదవులు అనుభవించిన కాక ఆయన కుమార్తె మేయర్గా పనిచేసిన అనుభవం అధికార దాహం సరిపోలేదు అన్నట్టు తండ్రి బిడ్డ ఇద్దరు కాంగ్రెస్ పార్టీలోకి రావడం దేనికి సంకేతం!? ఇంకోవైపు కడియం శ్రీహరి రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర్నుంచి టిడిపి పార్టీని నమ్ముకుని టిడిపి పార్టీ అయిపోయిన తర్వాత టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చి కేసీఆర్ పంచన చేరి నేడు కాంగ్రెస్ పార్టీకి కండువా కప్పుకుంటున్నాడు అంటే ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా. గతంలో బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన నేతలందరూ కీలక పదవులు ఎమ్మెల్యేలు గా పదవిని అనుభవించి అప్పనంగా ఆస్తులు వెనకేసుకున్నవారే!? కాదంటారా? ఒక్కరన్న ఆత్మ పరిశీలన చేసుకోండి? వ్యభిచారం కంటే హీనంగా ఉంటున్న ఇలాంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాన్ని భ్రష్టు పట్టించింది ఎవరు? ప్రతిపక్షమే లేకుండా 15లు రాజ్యాధికారం చేపట్టిన కేసీఆర్ కాదా? తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం సాధించుకున్న తొలినాళ్లలో ఆంధ్ర అహంకార పూరిత పాలకుల పీడ వదిలింది అని అనుకున్న తెలంగాణ ప్రజలకు మరొక దొర వచ్చి మళ్లీ ఇలాంటి అసాంఘిక అసంఘటిత వ్యభిచార రాజకీయాలకు పునాదివేసింది....
ఈ నేతలే కాదా? ఒకసారి తెలంగాణ ప్రజలే ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ ప్రజలు మౌనం వహిస్తూ ఉంటే బానిసత్వం ఇంకా అనుభవించక తప్పదు మరి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బాగుపడతాం అనుకున్న ప్రజలకు బాగుపడ్డారో లేదో తెలియదు కానీ రాజకీయ నేతలుగా ఎదిగిన వాళ్ళు మస్తు మస్తుగా ధనాన్ని ఆస్తులను ఫామ్ హౌస్ లను బాగానే కూడగట్టుకున్నారు... ఒక్కో ఎమ్మెల్యే మెడలు తిరగకుండా బలిసి బ్యాంకు బాలన్సులు పెంచుకొని ఆస్తులు భూములు కూడగట్టుకొని మళ్లీ అధికారం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో మళ్లీ అధికారం చేసికిచ్చుకోవడానికి వచ్చి అధికారం పొందుకొని ఆస్తులను అప్పనంగా సంపాదించిన అవినీతి సొమ్మును కాపాడుకోవడం లేదా!? చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. సమాజంలో ఓటర్లుగా ఉన్న జనం మరణం వరకు ఇలాంటి సిగ్గులేని రాజకీయ నేతలను పెంచి పోషిస్తున్న బాధ్యత మనమే తీసుకోవాల్సి వస్తుంది. రాజకీయమంటే ర** అన్న వరవడిలో మునిగిపోయి నిజంగానే ర** రాజకీయానికి తెరలేపుతుంది ఇలాంటి రాజకీయ నేతలే... నేతలు మారకపోతే వాళ్ల తలరాతలు మార్చేది మనమే.... ఓటు అనే ఆయుధం ద్వారా నిజమైన ప్రజాస్వామ్యాన్ని స్థాపించే బాధ్యత కూడా మనదే. ఎలాగూ రాజకీయ నాయకులకు ప్రజా పాలకులకు సిగ్గు ఎగ్గు లేకున్నా కనీసం ఓట్లు వేసి గెలిపించిన బాధ్యత తీసుకున్న ప్రజలు ఓటర్లు మార్పు చెంది విజ్ఞత కలిగి రాబోయే ప్రతి ఎన్నికల్లో మంచి నిర్ణయాన్ని తీసుకొని ఓటు హక్కును వినియోగించుకుందాం....
- కడారి శ్రీనివాస్
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత
గాయకులు, సామాజిక ఉద్యమకారులు
Post Comment