దేశవ్యాప్తంగా గవర్నర్ల మార్పుకు రంగం సిద్ధం

తెలంగాణకు అశ్వినీ కుమార్ చౌబే, కర్నాటకకు కిరణ్ కుమార్ రెడ్డి?!


దేశవ్యాప్తంగా గవర్నర్ల మార్పుకు రంగం సిద్ధం

జయభేరి, న్యూఢిల్లీ :
జాతీయ రాజకీయాల్లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల గవర్నర్లను మార్చడానికి రంగం సిద్ధమయింది. కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రాల గవర్నర్ల మార్పులు చేర్పులు చేయబోతోంది. ప్రస్తుతం తెలంగాణకు ఉన్న ఇన్ ఛార్జీ గవర్నర్ సిపి. రాధాకృష్ణన్ పాండిచ్చేరి, జార్ఖండ్  గవర్నర్ గా కొనసాగుతున్నారు. 

ఈ నేపథ్యంలో తెలంగాణకు (Telangana) మాజీ కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే గవర్నర్ కాబోతున్నట్లు సమాచారం. ఇదిలావుండగా తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బిజెపి పావులు కదుపుతోందని తెలుస్తోంది. మోడీకి అత్యంత నమ్మకస్తుడైన అశ్వినీ కుమార్ చౌబేను తెలంగాణ గవర్నర్ గా నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసివున్నప్పుడు (ఉమ్మడి ఏపి) ముఖ్యమంత్రిగా పనిచేసిన బిజెపి నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డిని కర్నాటక రాష్ట్రానికి గవర్నర్ గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read More కురుమల పోరాటానికి ఎమ్మార్పీఎస్ మద్దతు కావాలి...