డివిజన్లో నెలకొన్న సమస్యలను డిప్యూటీ మేయర్ అధికారుల దృష్టికి
పెండింగ్లో ఉన్న ఎస్ ఎన్ డిపి పనులను, పీర్జాదిగూడ రోడ్డు విస్తరణ పనులపై చర్చకు రాగా త్వరలోనే ఈ సమస్యను పూర్తిచేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు.
జయభేరి, మేడిపల్లి :
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మున్సిపల్ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు కార్పొరేటర్లతో కలిసి పలు సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
అంతేకాకుండా పెండింగ్లో ఉన్న ఎస్ ఎన్ డిపి పనులను, పీర్జాదిగూడ రోడ్డు విస్తరణ పనులపై చర్చకు రాగా త్వరలోనే ఈ సమస్యను పూర్తిచేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు. పలువురు కార్పొరేటర్లు మాట్లాడుతూ... డివిజన్లో నెలకొన్న సమస్యలను డిప్యూటీ మేయర్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. డిప్యూటీ మేయర్ స్పందిస్తూ అధికారులు కార్పొరేటర్లు కలిసి డివిజన్లో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో పలువురు కార్పొరేటర్లు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post Comment