చట్టం మీ చుట్టం కాదు..!

ఎంపీ రఘునందన్ రావు

చట్టం మీ చుట్టం కాదు..!

జయభేరి, గజ్వేల్ కుకునూర్పల్లి, అక్టోబర్ 29 :
హైడ్రా పేరుతో ప్రభుత్వం అక్రమ కట్టడాలను కూలుస్తుంటే అక్రమ నిర్మాణం జరుగుతుందని మా కార్యకర్తలు అధికారులకు విన్నవిస్తే స్పందించక పోవడం తో హైడ్రా చేసే పనులు మా కార్యకర్తలు చేస్తే పోలీసులు అరాచకంగా మా కార్యకర్తలను అరెస్టు చేశారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డి పల్లి లో ఓ ప్రార్థన మందిరం నిర్మాణ విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొంది. 

నిర్మాణాన్ని అడ్డుకుని గోడ కూల్చారని ఓ వర్గానికి చెందిన వారిపై మరో వర్గం వారు కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా బిజెపి పార్టీ కి చెందిన 8 మందిని కుకునూర్ పల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేయడం జరిగింది. చట్టాలు ఎవరికీ చుట్టాలు కావు అని అందరికీ ఒకేలా న్యాయం ఉండాలంటూ ఘటన పై రఘునందన్ రావు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కునూరు పల్లి పోలీస్ స్టేషన్ వద్ద బిజెపి శ్రేణులతో కలిసి ఎంపీ రఘునందన్ రావు నిరసన చేపట్టారు.గ్రామంలోని ప్రభుత్వ భూమిలో ఎలాంటి పర్మిషన్ లేకుండా నిర్మాణం జరుగుతుంటే మా కార్యకర్తలు అక్రమ నిర్మాణాన్ని ఆపేందుకు అధికారులకు సంప్రదించగా అధికారులు స్పందించక పోవడం తో ప్రభుత్వం హైడ్రా పేరుతో చేస్తున్న పనులను మా కార్యకర్తలు చేస్తే పోలీసులు అరాచకంగా దేశ ద్రోహుల లాగ మా కార్యకర్తలను అరెస్టు చేయడం జరిగిందనీ ఈ నేపథ్యం లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందనీ అన్నారు.

Read More ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.

Views: 0