Telangana KTR I రాజకీయాల్లో మగతనం అవసరమా!?
తొక్కి నార తీస్తా అని ఒకరు నువ్వు మగాడివైతే మగతనం ఉంటే అని మరొకరు తెలంగాణ రాష్ట్రంలో నీచ సంస్కృతికి శ్రీకారం చుడుతున్నారు. అసలు ఇలాంటి నీచ సంస్కృతి ఎప్పుడు మొదలైంది?
జయభేరి, హైదరాబాద్ :
తెలంగాణలో ఎవరు మొదలుపెట్టారు? ఇది ఎక్కడికి దారితీస్తుంది? అనే విషయాలని 'జయభేరి' సమగ్రంగా నిర్విరామంగా అందిస్తున్న కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ రాజకీయ సమగ్ర విశ్లేషణ...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రత్యేక రాష్ట్రంగా రూపాంతరం చెందిన ఆ తొలినాళ్లలోనే తెలంగాణ రాష్ట్ర సమితిగా రాజకీయ పార్టీగా మారి అధికారం చేజిక్కించుకుంది ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా పరుష సంభాషణ పరుష పదజాలం సన్నాసి... వెధవ అనే మాటలు రాజకీయాల్లోకి ప్రవేశపెట్టింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇలా పేరు గల ముఖ్యమంత్రులు వాళ్ళల్లో కూడా ఆగ్రహ జ్వాలలు ఉవ్వెత్తున ఎగసిన మాటలను కంట్రోల్ చేసుకొని రాజకీయాన్ని మహిల అంటకుండా ఆనాడు రాజకీయాన్ని నడిపించారు. కానీ నేడు జరుగుతున్న వాస్తవ రాజకీయ పరిణామాలను చూస్తే ఛి ఛి రాజకీయం కంటే వ్యభిచారమే మిన్న అనే విధంగా ఉంటుంది.
రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ పాలమూరు జిల్లాలో పర్యటిస్తూ మమ్మల్ని టచ్ చేస్తే మానవ బాంబులుగా మారుతామని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు... అది ఆయన ఆవేశానికి దారితీసింది. నిజానికి అంతలా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అని ఆలోచిస్తే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంకా తాను అధికారంలో ఉన్నట్టు తానే మంత్రిగా వ్యవహరిస్తున్నట్టు కలలు కంటూ రాబోయే అధికారం మాదే మేమే అధికారంలోకి వస్తాం అని పగటి కలలు కంటున్నాడు!
నిజానికి ప్రజలు 10 ఏళ్ల పరిపాలనను చీదరించుకొని ప్రతిపక్ష పాత్రలో కూర్చోబెట్టిన ఈ బీఆర్ఎస్ నేతలకి సిగ్గు రావట్లేదు. మాటిమాటికి కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది త్వరలోనే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అంటూ ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలల నుంచి ఈ పాట పాడుతున్నారు. పది సంవత్సరాలు పరిపాలన చేసినా ఇంకా దాహం తీరని బీఆర్ఎస్ నాయకులకు కాస్త ఇంగిత జ్ఞానం వాస్తవ పరిస్థితులు అర్థమైనట్టు కనిపించడం లేదు.. ఎందుకంటే రాష్ట్రం లో తాము అధికారంలో లేకుంటే ధర్నాలు రాస్తారోకాలు చేయడం మళ్ళీ మొదలుపెట్టింది బీ ఆర్ఎస్ పార్టీ.. గతంలో పదేళ్ల సంవత్సర కాలంలో ధర్నా చౌక్ లేకుండా ఎత్తివేసి ఎందుకు ధర్నాలు చేస్తారు మీకేం పని లేదా అని చెప్పిన కేసీఆర్ ఇవ్వాలా తాను ఫామ్ హౌస్ లో కూర్చొని మిగతా నాయకులకు పని చెబుతూ కేటీఆర్ ను ముందు నడుపుతూ హరీష్ రావుకు హుకుం జారీ చేసి నోటికి పదును పెట్టేలా చేసిన కేసీఆర్ ఎంతైనా ఆపర రాజకీయ చాణుక్యుడే అని చెప్పక తప్పదు...
పాలమూరు సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలకి కౌంటర్ ఇస్తూ కేటీఆర్ మళ్లీ పాతపాటే పాడుతున్నాడు. మీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే నీ సీఎం పదవికి రాజీనామా చేసి పార్లమెంటు ఎలక్షన్లో ఎంపీగా పోటీ చెయ్ నేను సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచే నువ్వు నేను పోటీ పడదాం అంటూ సవాలు విసురుతుంటే పక్కన కూర్చున్న భజన జనం చప్పట్లు కొడుతూ నవ్వుతుంటే నాకు ఒళ్ళు మండుతుంది. ఎందుకంటే ఒక రాజకీయ విశ్లేషకుడిగా గత ప్రభుత్వ పాలనను చూసా, ఇప్పుడు మూడు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను చూస్తున్న. ఈ రెండు ప్రభుత్వాల పనితీరు చూస్తే దొరపాలన అనే ఒక నానుడి కేసీఆర్ కు వస్తే ప్రజా పాలన అనే ఒక జనం నాడి సీఎం రేవంత్ రెడ్డికి వచ్చింది.
ప్రగతి భవన్ తన సొంత ఇలాగ మార్చుకున్న కేసీఆర్ అధికారం కోల్పోయాక పూర్తిగా అక్కడ లేకుండా వెళ్లిపోవడం జరిగింది. పది సంవత్సరాల రాజకీయానికి చరమగీతం పాడుతూ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించని కేసీఆర్ను ఏమనాలి? 10 సంవత్సర కాలంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన ప్రోటోకాల్ ప్రకారంగా కనీసం భారత ప్రధానికి మర్యాద ఇవ్వని తీరును చూస్తే కేసీఆర్ కి పొగరు తో పాటు రాజకీయ దురహంకారిగా పేరు సంపాదించుకున్నాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారంగా హాజరై పెద్దన్న పాత్ర వహిస్తున్న నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి మాకు కావలసిన నిధులను మాకు అందివ్వండి అంటూ చాకచక్యంగా మాట్లాడడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే మనం ఉన్నామా లేక వేరే దేశంలో ఉన్నామా అనే విధంగా అంచనాలకు మించి సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ చతురతను చూపించుకుంటున్నాడు. ఈ విషయం తెలవని కేటీఆర్ నువ్వు మగాడివైతే నీకు మగతనం ఉంటే అనే మాటలు ఆయనకు అచ్చిరావు.
ఎందుకంటే కేటీఆర్ ఎంత రసికుడు మనందరికీ తెలిసిందే... అలాంటి కేటీఆర్ వయసులో పెద్దయిన రేవంత్ రెడ్డిని పట్టుకొని నువ్వు మగాడివైతే అందులోను సీఎంగా కూర్చుంటే చూడలేని ఆ మనస్తత్వానికి నిదర్శనంగా సీఎం పదవికి రాజీనామా చేయి అని చెప్పడానికి నోరెలా వస్తుందో అర్థం కావట్లేదు... అదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతిపక్షంలో కాంగ్రెస్ గనక ఉంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి కెసిఆర్ అని ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి సవాల్ విసరలేదు? అయినా సీఎంగా కేసీఆర్ ఏనాడైనా రాజీనామా చేశాడా? మరి ఇప్పుడు కాలం తిరగబడి కాలనాగుల కాటేసిన కనీసం సిగ్గు రాని కెసిఆర్ భజన బృందాన్ని చూస్తే నవ్వురాక మానదు. అంటే ప్రభుత్వం వచ్చి పరిపాలన చేస్తూ మూడు నెలల కాలం గడుస్తున్న అప్పుడే ప్రభుత్వాన్ని కూలదోస్తాం ఈ ప్రభుత్వం ఉండదు తిరిగి మేమే ప్రభుత్వంలోకి వస్తాం అని వెకిలి వేషాలు వెకిలి మాటలు మాట్లాడే వాళ్లకు మరి ఎలాంటి కౌంటర్ ఇవ్వాలో మీరే చెప్పండి..
మగాడు మగతనం మీసం తిప్పరా పెద్దపులి అని ఇలాంటి పదాలు సినిమా డైలాగులు మాత్రమే పనికొస్తాయి కానీ రాజకీయంలో పనికిరావు అని అందరికీ తెలుసు. కానీ తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రతిపక్ష పాత్రలో కూర్చున్న బిఆర్ఎస్ నేతలకి వంట పట్టడం లేదు. మాటిమాటికి ప్రభుత్వాన్ని కూలదోస్తాం ఈ ప్రభుత్వం స్థిమితంగా ఉండదు సీఎంగా రేవంత్ రెడ్డి పనికిరాడు ఆయన గతంలో జైలుకు వెళ్ళాడు అని ఇలాంటి చేతగాని మాటలను బట్టి చూస్తే భవిష్యత్తులో టిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేదు... ఇక పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి దిగిన నేతలు ఒకపక్క మనసు ఒప్పుకోకపోయినా మరొకపక్క కేసీఆర్ మీద ఉన్న భయం భక్తితో పోటీలోకి దిగడం తప్పడం లేదు.. అంటే గెలుస్తారన్న నమ్మకం లేదు. ఇంకోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కెసిఆర్ తో పొత్తులు కుదుర్చుకోవడం రాష్ట్ర మొత్తం బహుజనులు దళితులు మేధావులు జీర్ణించుకోవడం లేదు. ఏది ఏమైనా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ కి ఎదురుదెబ్బ తాకక మానదు. మొత్తానికి నువ్వు మగాడివైతే నీకు మగతనం ఉంటే అనే మాటలు రాజకీయ దుమారాన్ని రేపే విష సంస్కృతికి ప్రాణం పోసింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలినాలలో కెసిఆర్ ఇలాంటి పరుష పదజాలానికి పదును పెట్టాడు. ఒకసారా రెండుసార్ల 10 సంవత్సరాలుగా ఆయన డిక్షనరీలో లేని మాటలను కూడా అలాంటి తిట్లను కూడా తిట్టి రాజకీయాన్ని పూర్తిగా వ్యభిచారంగా మార్చాడు.
ఇప్పుడు అదే సంస్కృతి అలవాటైతుంది.. తన వారసత్వాన్ని రాజకీయంలోకి గుంజుకొచ్చిన కేసీఆర్ కేటీఆర్ ని పవర్ఫుల్ లీడర్ గా చూడాలనుకున్నాడు అలా చూసి ముఖ్యమంత్రిగా చేయాలనుకున్నాడు కానీ తెలంగాణ ప్రజలు ఒప్పుకోలేదు. అందుకే ఎలక్షన్స్ వచ్చేవరకు ఓపిక పట్టి మూడవసారి ఎలక్షన్లో గెలిస్తే ఖచ్చితంగా కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసేవాడే.... కానీ తెలంగాణ ప్రజలు అంత ఈజీగా అధికారాన్ని కట్టబెట్టరు. ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే నాయకుడు స్వార్థం కోసం పనిచేసే నాయకులు ఎవరో తెలంగాణ ప్రజలకి బాగా తెలుసు. ఎందుకంటే నిత్యం పోరాట పటిమతో ఆత్మ గౌరవంతో బతికే బతుకును తెలంగాణ ప్రజలు ఏనాటినుండో అలవాటు చేసుకున్నారు.. అసలు తెలంగాణ వాస్తవ పరిస్థితులు కేటీఆర్ కంటే సీఎం రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. అయినా రేవంత్ రెడ్డికి తెలంగాణ చరిత్ర తెలవదు అని చెప్తున్నా కేటీఆర్ ని చూస్తే ఆయన అమాయకత్వానికి పరాకాష్టగా నిలుస్తున్నాయి ఆయన మాట్లాడిన మాటలు.
తెలంగాణ చరిత్రను తెలుసుకోవాలంటే ఎంతోమంది త్యాగదనులు పోరాట యోధులు ప్రాణాలర్పించిన ధీరులు ఈ నేలతల్లి కాల గర్భంలో కలిసిపోయారు. అలాంటి ఆత్మ బలిదనాల మీద అధికారాన్ని 10 సంవత్సరాలుగా ఈరన్న కేసీఆర్ పాలన నచ్చకనే ప్రజలు తిరగబడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయినా ప్రజలనే ఉద్దేశించి నల్లగొండ సభలో కేటీఆర్ సన్నాసులను దద్దమ్మలను చేతకాని వాళ్లను మీరే ఎన్నుకున్నారు అని చెప్పి ప్రజలను తిట్టిన ప్రజలకు కనువిప్పు కలగలేదు. మరి ఇప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డిని మాటిమాటికి కూర్చున్న దగ్గర నుంచి పడుకునే వరకు సీఎం గా తాను అధికారం లోకి వచ్చినప్పటి నుంచి అనని మాటలు లేవు తిట్టని తిట్లు లేవు... అసలు నువ్వు సీఎంగా పనికిరావు అని చెప్పే గుంట నక్కలకు వాతలు పెట్టాల్సింది తెలంగాణ ప్రజలే…
చూద్దాం పార్లమెంటు ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి కట్టబెడతారు మగాడు మగతనం ఎవరికి ఉందో ప్రజలు ఎవరికి ఓటు వేసి గెలిపిస్తారో కాలమే నిర్ణయిస్తుంది. ప్రజలే నిర్ణయిస్తారు. అంతేకానీ నువ్వు మగాడివైతే నీకు మగతనం ఉంటే ఒరే సన్నాసి వెధవ ఏం పీకనీకి వస్తారు అనే మాటలు చిన్నదొర మీ అయ్య కేసీఆర్ ఏ తెలంగాణ సంస్కృతిని మొత్తం పాడుచేసింది. అది మరిచిపోయి మళ్లీ ప్రతిపక్షంలో కూర్చుని బుద్ధి తెచ్చుకోవడం మానేసి ఎందుకు ఈ మాటలు అంటూ జనాలు దుమ్మెత్తి పోస్తున్నారు...
...కడారి శ్రీనివాస్
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత
Post Comment