ఆర్ డిఓ కు వినతి పత్రం అందజేసిన...
కేతావత్ బాబురామ్ నాయక్
పాటించని యెడల పర్మిషన్ రద్దు చేయాలి అదే విధంగా పెనాల్టీ విధించాలి అని విద్యార్థుల రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షులు కేతావత్ బాబురామ్ నాయక్ సేవ రత్న జాతీయ అవార్డు గ్రహీత FWO RTI రాష్ట్ర అధ్యక్షులు కొర్ర కిషన్ నాయక్ తెలంగాణ లంబాడి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మూడవత్ బాలాజీ నాయక్, TNSF నియోజవర్గ ఇన్చార్జ్ జె. జగన్ నాయక్ అన్నారు.
జయభేరి, దేవరకొండ :
విద్యా హక్కు చట్టం 2009 లోని జీవో నెంబర్లు 1,42,246,91 మరియు జి.వో నెం 91లోని సెక్షన్ 1(C), C&DSE Proc RC. No 780 లోని సెక్షన్ 8(1) ప్రకారం 25% శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలి. కేటాయించని ప్రభుత్వము చే గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూల్స్ గాని కార్పొరేటు స్కూల్ గాని ఇంటర్నేషనల్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి.
ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ..
1) G.O.Ms.No.1 తేది :-01-01-1994 ప్రకారం ఐదు శాతానికి తగ్గకుండా లాభాలను మాత్రమే ఆశించాలి. వసూలు చేసిన ఫీజుల నుండి 50% మొత్తాన్ని ఉపాధ్యాయులకు వేతనాలుగా చెల్లించాలి. ప్రతి ఏడాది వార్షిక నివేదికలు, ఆడిట్ రిపోర్ట్ ను ప్రభుత్వానికి సమర్పించాలి.
2) G.O.Ms.No. 42 తేది:- 30-07-2010 ప్రకారం ఫీజులు పెంచాలంటే డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీ (DFRC) అనుమతి తీసుకోవాలి. DFRC గా వ్యవహరిస్తారు.
3) G.O.Ms.No. 246 ప్రకారం పాఠశాలలా నిర్వహణలో సమాజాన్ని భాగస్వామ్యం చేయాలి. సిబియస్ఈ చట్ట ప్రకారం ప్రతి పాఠశాలలో "పేరెంట్ టీచర్ అసోసియేషన్" ఏర్పాటు చేసుకోవాలి. ఈ అసోసియేషన్ లో ఇద్దరు తల్లిదండ్రులకు భాగస్వామ్యం కల్పించాలి. వీరిని సంప్రదించిన తరువాతనే ఫిజులను పెంచాలి.
4) G.O.Mc.No.91 తేది:-06-08-2009 ప్రకారం వన్ టైం ఫిజుగా అప్లికేషన్ రూ. 100,రిజిస్ట్రేషన్ ఫిజుగా రూ. 500, రిఫన్దబుల్ కాషన్ డిపాజిట్ రూ. 5000 లకు మిచకుండా తీసుకోవాలి. జీవో లోని సెక్షన్ 1(c) ప్రకారం పాఠ్య పుస్తకాలు, స్టేషనరి, యూనిఫాంలను స్కూల్ యాజమాన్యం సూచించే చోటే కొనాలన్న కచ్చితమైన నిబంధనలేమి పెట్టరాదు. వీటి అమ్మకాలను పాఠశాలలలో కౌంటర్లు ఏర్పాటు చేయరాదు. విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చిన షాపులో కొనుగోలు చేయవచ్చు.
5) C&DSE Proc Rc.No. 780 తేది:-16-08-2013 సెక్షన్ 8(1) ప్రకారం పాఠశాలల బోర్డులపై ఇంటర్నేషనల్, ఐఐటీ, ఒలంపియాడ్, కాన్స్ ప్ట్, ఈటెక్నో, ఈ శాస్త్ర అన్న తోకలేవి తగించరాదు. కేవలం పాఠశాల అని మాత్రమే బోర్డుపై ఉంచాలి.
6) విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం ప్రతి ప్రెవేట్ పాఠశాలలో 25% సీట్లు కేటాయించ బడింది. పిల్లల వయస్సు 6 సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పొందిన ప్రైవెట్ విద్యా సంస్థలలో నివాసం ప్రాంతం నుండి 1కిలోమీటర్ పరిధిలోని పాఠశాలలు 10 పాఠశాల వరకు నమోదు చేసుకోవచ్చు. లాటరీ పద్దతిలో ఆయా పాఠశాలల లో సీట్లు కేటాయించబడుతుంది. 1వ. తరగతి చేరికతో ప్రారంభమై పిల్లలు చదువు 8వ తరగతి వరకు అదే పాఠశాలలో కొనసాగుతుంది. పాఠ పుస్తకాలు పాఠశాల యూనిఫాం తదితరులు ఉచితంగా పాఠశాల వారే ఇవ్వాలి.. ఇందు ఖర్చు మొత్తం ప్రభుత్వం ప్రైవెట్ పాఠశాల వారికీ ఇస్తారు.
Post Comment