వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా మొద్దునిద్ర వీడని రేవంత్ సర్కార్ 

ప్రభుత్వ విద్యను సంక్షోభంలోకి నెట్టిన ప్రభుత్వం
రాష్ట్రంలో 950 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురి అయ్యారు
రాష్ట్రంలో విద్యావ్యవస్థ కుప్పకూలింది
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్య వ్యవస్థను నీరు గారుస్తున్నారు
బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ 

వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా మొద్దునిద్ర వీడని రేవంత్ సర్కార్ 

జయభేరి, దేవరకొండ :
వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా రేవంత్ సర్కార్  మొద్దునిద్ర వీడడం లేదు అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్  అన్నారు. పీఏపల్లి మోడల్ స్కూల్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులను దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లతో అడిగి తెలుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై ఏమాత్రం శ్రద్ధ లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారింది అని అన్నారు. ప్రభుత్వ విద్యను సంక్షోభంలోకి నెట్టిన ప్రభుత్వం అని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 950 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురి అయ్యారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ కుప్పకూలింది అని ఆయన అన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్య వ్యవస్థను నీరు గారుస్తున్నారు అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో 52 మంది విద్యార్థుల మరణించడం జరిగింది అని తెలిపారు.

Read More telangana politics I రాజకీయ ప్రకటనల మాయాజాలం ఓటర్ల అయోమయం

WhatsApp Image 2024-12-04 at 19.33.33

Read More Students I నైపుణ్య శిక్షణకు.. కేరాఫ్ తెలంగాణ....

పాలన గాలికొదిలేసి నేరపూరిత నిర్లక్ష్యంతో విద్యార్థులను పొట్టన బెట్టుకుంటున్న ముఖ్యమంత్రి అని అన్నారు.విద్యార్థులు చనిపోతున్నా ఒక్క సమీక్ష కూడా నిర్వహించని ప్రభుత్వానికి ఉసురు తప్పదు అని అన్నారు.సంవత్సరం నుండి తెలంగాణలో విద్యా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు లేరు అని అన్నారు.రాష్ట్రంలో  విద్యావ్యవస్థ కుప్పకూలింది అని అన్నారు.కేసీఆర్ హయాంలో విద్యావ్యవస్థ ఆదర్శంగా నిలిచింది అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, బిఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు బోడ్డుపల్లి కృష్ణ, మాజీ జడ్పీటీసీ బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు పొట్ట మధు, యువజన విభాగం కొండమల్లెపల్లి మండల అధ్యక్షుడు రమావత్ తులిసిరామ్, ఇలియస్ పటేల్, వాడిత్య బాలు, జమిర్ బాబా, పగిడిమర్రి నాగరాజు, మైనంపల్లి ప్రవీణ్, జానీ, గుండాల వెంకట్, జగన్, తదితరులు ఉన్నారు.

Read More Telangana I జంప్ జిలానీల తో ఎల్బీనగర్ తికమక

WhatsApp Image 2024-12-04 at 19.35.45

Read More Media I అమ్ముడుపోతున్న అక్షరం విలువలు కోల్పోతున్న జర్నలిజం...

Views: 0