PDSU రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకట్ రెడ్డి తదితర విద్యార్థి నాయకుల పై పెట్టిన పూసపెళ్లి కుట్ర కేసును ఎత్తివేయాలి

ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU )
ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గం
రాచకొండ రంజిత్ కుమార్, PDSU జిల్లా ఉపాధ్యక్షుడు,
ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గం కార్యవర్గం

PDSU రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకట్ రెడ్డి తదితర విద్యార్థి నాయకుల పై పెట్టిన పూసపెళ్లి కుట్ర కేసును ఎత్తివేయాలి

జయభేరి, బ్యూరో చీఫ్ వరంగల్ మే 26:

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU)రాష్ట్ర అధ్యక్షులు మొగిలి వెంకటరెడ్డి, వరంగల్ జిల్లా నాయకులు బి.శివ అనే విద్యార్థి నాయకుల పై పూసపల్లి పల్లి కుట్ర కేసు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా పి డి ఎస్ యు ఉపాధ్యక్షు డు రాచకొండ రంజిత్ కుమార్ అధ్యక్షతన AISF జిల్లా కార్యాలయంలో విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది.

Read More దేవరకొండ పట్టణ  పద్మశాలి సంఘం నూతన కమిటీ ఎన్నిక 

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు తీగల జీవన్ మాట్లాడుతూ కుట్రపూరితంగా గత ఫిబ్రవరి నెలలో ప్రజా సంఘాల నాయకులపై బనాయించిన అక్రమ కేసులో ఈనెల మే 18వ తేదీన విద్యార్థి నాయ కుల పేర్లను పూస పెళ్లి కుట్ర కేసు లో అక్రమంగా చేర్చి ప్రభుత్వాన్ని కూలదోయాలానే కుట్ర చేస్తున్నట్టుగా అభియోగాలు మోపడం వెనుక విద్యార్థి ఉద్యమా లను అణిచేయాలనే ఉద్దేశంతో విద్యార్థుల సమస్యల పై ప్రశ్నించే గొంతుకలను నొక్కే ప్రయత్నంలో భాగమే నని వరంగల్ జిల్లా బార అసోసియేషన్ అధ్యక్షుడు తీగల జీవన్ అన్నారు.

Read More నర్సారెడ్డి ఉన్నన్ని రోజులు గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీ బాగుపడదు..!

తెలంగాణ సాధన ఉద్యమంలో క్రియాశీలక పాత్రను పోషించిన PDSU విద్యార్థి సం ఘం నేడు ప్రజాస్వామ్య బద్దంగా బహిరంగంగా దళిత, గిరిజన వెనుకబడిన, పేద మైనారిటీ విద్యార్థుల పక్షా న నిస్వార్ధంగా గత 50 ఏళ్లుగా పోరాడుతున్న PDSU విద్యార్థి సంఘ నాయకులపై ప్రభుత్వాన్ని కూలదో యాలని కుట్రలు చేస్తున్నట్లు అభియోగాలు మోపడం దుర్మార్గమైన విషయమని అన్నారు. గత పాలకుల మాదిరిగానే తెలంగాణ విద్యార్థి వేదిక, డెమొక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ వంటి విద్యార్థి సంఘాలపై క్రూర నిర్బంధాన్ని మోపినట్లుగానే పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ప్రజా స్వామ్యం స్వేచ్ఛ మా ప్రజా పాలనలో భాగంగా అంది స్తామని హామీ ఇచ్చి నేడు నిరంకుశ, నియంతృత్వ పాలనను కొనసాగిస్తున్నది దీనిని ప్రజలు ప్రజాస్వామి క వాదులు, సంస్థలు మేధావులు, విద్యార్థి సంఘాలు ఖండించాలని పిలుపునిచ్చారు.

Read More ఫెయిల్ అయిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి

మానవ హక్కుల వేదిక కన్వీనర్ బాదావత్ రాజు మాట్లాడుతూ... విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పన కోసం విద్యాసంస్థల్లో బోధనా సిబ్బందిని నియమించాలని, స్కాలర్షిప్, ఫీజు రీఎంబర్స్మెంట్ వంటి సమస్యలపై పోరాడే విద్యార్థి సంఘాల పై కుట్ర కేసులు బనాయించే అంతటి అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమి వచ్చిందని ప్రశ్నించారు. విద్యార్థుల పోరాటాలు త్యాగాలు లేకుండా తెలం గాణ రాష్ట్రం సాధ్యమయ్యేదా? ఇదేనా మీ ప్రజా పాలన? అని విమర్శించారు.

Read More సీఎం రేవంత్ ను అభినందించిన బీసీ నేతలు

సమాజంలో అనేక పెడ ధోరణలకు వ్యతిరేకంగా విద్యార్థి పోరాటాలు  జరిగా యని సమాజ స్థితిని గతినే మార్చిన చరిత్ర విద్యార్థుల పోరాటాలదేనని అన్నారు. సమాజంలో అంతరాల సమాజం పోవాలని సమసమాజం రావాలని అందుకు శాస్త్రీయ విద్యా విధానం కావాలని పోరాడుతున్న సం స్థ PDSU అని తెలిపారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా విద్యా ర్థి సంఘాలు ప్రజా సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాల ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నా రు. ఈ సమస్యపై రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమా వేశాలు నిర్వహించాలని, రాష్ట్ర సీఎంకు పోస్టు కార్డులు, యూనివర్సిటీలో సంతకాల సేకరణ కార్యక్రమాలు నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానిం చింది. రౌండ్ టేబుల్ అనంతరం విద్యార్థి సంఘ నా యకులందరూ కలిసి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నా యిని రాజేందర్ రెడ్డిని వారి కార్యాలయంలో కలిసి వెంకట్ రెడ్డి పైన తదితర విద్యార్థి నాయకుల పైన పెట్టిన అక్రమ పూసపల్లి కేసును ఎత్తివేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

Read More వైస్ చైర్మన్ ఇరగ దిండ్ల కృష్ణ కు సినిమా డైరెక్టర్ సేనాపతి ఘనంగా శాలువాతో సన్మానం

ఈ కార్యక్రమంలో PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబ,PDSU మాజీ రాష్ట్ర కార్యదర్శి విజయ్ కన్నా, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, AISF జిల్లా ప్రధాన కార్య దర్శి సంతోష్, USFI జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్, PDSU జిల్లా కార్యదర్శి నరసింహ రావు, DSA రాష్ట్ర నాయకులు శ్రావణ్, AISB ప్రవీణ్, BSP జిల్లా కన్వీనర్ మనోహర్, SSU జిల్లా కన్వీనర్ సాయి, MSF జిల్లా కన్వీనర్ శ్రీనాథ్, మహేష్ చరణ్ రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Read More కేటీఆర్ చిట్టా మొత్తం నా దగ్గరుంది.. 

Views: 1