నర్సారెడ్డి ఉన్నన్ని రోజులు గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీ బాగుపడదు..!
- కోవర్టు రాజకీయాలు చేసేది నర్సారెడ్డి..
- 20 ఏళ్ల నుండి కష్టపడి పని చేస్తే పైసలకు అమ్ముడు పోతుండు....
- గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ నాశనం కావడానికి ముఖ్యకారకుడు నర్సారెడ్డి..
- ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని ఆదుకున్న దాఖలాలు ఉన్నాయా....
- నర్సారెడ్డి హటావో కాంగ్రెస్ బచావో అనే వ్యక్తులు నర్సారెడ్డి తో ఉన్నారు....
జయభేరి, గజ్వెల్, మర్చి 01 : గజ్వేల్ కాంగ్రెస్ లో డిసిసి అధ్యక్షుడు నర్సారెడ్డి ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ లేకుండా పోతదని, తాను బేరాలు కుదుర్చుకునే నాయకుడని టిపిసిసి కార్యదర్శి నాయిని యాదగిరి విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ కోసం నర్సారెడ్డిని నమ్ముకున్నందుకు ఆస్తులు అమ్ముకొని పోటీచేశామన్నారు. నర్సారెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్తే తిట్టనోళ్లు లేరన్నారు. ఎవరి వద్ద ఎంత డబ్బులు తీసుకున్నావో మాదగ్గర ఆధారాలు ఉన్నాయని. నీ ఆటలన్నీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు వివరిస్తామన్నారు. గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న కేడర్ ఎక్కడా లేదు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మనదే అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సిఎం రేవంత్ రెడ్డి. బండారు శ్రీకాంత్ రావు ఆధ్వర్యంలో పనిచేస్తామన్నారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్పిస్తానని మోసం చేశాడు.. జూపల్లి మల్లారెడ్డి... నర్సారెడ్డి పిలవగానే వెంటనే వాలిపోయే కరుడు గట్టిన కాంగ్రెస్ కార్యకర్తను అయిన నన్నే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇప్పిస్తానని మోసం చేశారని మనోహరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూపల్లి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో నర్సారెడ్డి ఉంటే పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని, పది నెలలు గజ్వేల్ నియోజకవర్గంలో నర్సారెడ్డి లేకుంటే పార్టీ కోసం ఎంతో కష్టపడి తిరిగామని, నాకు పదవి వద్దన్నా పదవి ఇస్తానని మాట ఇచ్చి మోసం చేశారని అన్నారు.
పదవి కోసం నావద్ద ఎకరం భూమి రాసి ఇచ్చి , రూ.30 లక్షల నగదు ఇచ్చానని అన్నారు. ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా తన జేబు నుండే డబ్బులు పెట్టేవాడినని, ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా ముందుండి సహాయం చేసేవాడినని, కార్యకర్తలు చనిపోతే నర్సారెడ్డి ఏ ఒక్కరికి ఆర్ధిక సహాయం అందించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని అనే అర్హత నర్సారెడ్డికి లేదన్నారు. ఎకరం భూమి తీసుకొని మార్కెట్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని మోసం చేసిన ఘనుడు నర్సారెడ్డి అన్నారు. నా తప్పు ఉంటే నేను కాళ్లు మొక్కి వెళ్లి పోతానని, లక్షలు లక్షలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మోసం చేయడం సరైందికాదన్నారు.
గజ్వేల్ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి మాట్లాడుతూ... నర్సారెడ్డి మమ్మల్ని ఉద్దేశించి కోవర్టులని అంటే ఊరుకునేదిలేదని, నర్సారెడ్డి పదినెలలు గజ్వేల్లో కనిపించకున్నా మండల పరిధిలో కాంగ్రెస్ జెండా మోసానని అన్నారు. మాకు నామినేటెడ్ పదవులు ఇవ్వకుండా పార్టీకి ఏ మాత్రం కష్టపడని వారికి డబ్బులు తీసుకొని పదవులు కట్టబెట్టడం మంచి పద్దతి కాదన్నారు. పార్టీ ఆదేశాలను గీత దాటుతున్న నర్సారెడ్డిని నియోజకవర్గ ఇంచార్జ్ నుండి తొలగించాలని, పార్టీలో పనిచేసే వారికి న్యాయం జరిగేలా చూడాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ములుగు మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ... నర్సారెడ్డి హటావో కాంగ్రెస్ బచావో అనే వ్యక్తులకు ఈ రోజు కాంగ్రెస్లో స్థానం ఇచ్చిన ఘనుడు నర్సారెడ్డి అన్నారు. గజ్వేల్ కాంగ్రెస్ పార్టీలో కొత్త వ్యక్తులు తప్ప గతంలో కష్టపడిన ఏ నాయకుడు ఆయనకు కనిపించలేదన్నారు. నామినేటెడ్ పదవుల కోసం డబ్బులు వసూలు చేస్తూ కాలం గడుపుతున్నారని, గజ్వేల్ కాంగ్రెస్ పై అధిస్థానం దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గోపాల్రావు, రాజు, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, విజయ్ కుమార్ , బాబా, అనిల్ రెడ్డి , సింగంరాజు, మామిడి కృష్ణ, సూరజ్, సల్మాన్ హుసేన్, కరుణాకర్,కప్ప భాస్కర్, ప్రవీణ్ గుప్తా, సమీర్ ఈర్షద్, నందు తదితరులు పాల్గొన్నారు.
Post Comment