ఇంటర్ బోర్డ్ అఫిలియేషన్ లేదు.. నిబంధనలు అమలులో భేఖాతరు.. లక్షల్లో ఫీజుల వసూళ్లు.. వసతుల కల్పనలో సూన్యం.. ఇంటర్ అధికారుల నిర్లక్ష్యం

ఇంటర్ బోర్డ్ అఫిలియేషన్ పొందకుండా అక్రమంగా,అనధికారికంగా నడుస్తున్న కొండాపూర్, మాదాపూర్ లోని శ్రీ చైతన్య కళాశాలను సీజ్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలి

అనధికారికంగా నడుస్తున్న శ్రీచైతన్య కళాశాలలో ముందస్తు అడ్మిషన్లు చేపట్టి, తరగతులు నిర్వహిస్తున్న యాజమాన్యం పై క్రిమినల్ చర్యలు చేపట్టాలి

ఇంటర్ బోర్డ్ నిబంధనలను భేకాతరు చేస్తున్న కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవడంలో ఇంటర్ బోర్డ్ విఫలం: ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర సమితి డిమాండ్

ఇంటర్ బోర్డ్ అఫిలియేషన్ లేదు.. నిబంధనలు అమలులో భేఖాతరు.. లక్షల్లో ఫీజుల వసూళ్లు.. వసతుల కల్పనలో సూన్యం.. ఇంటర్ అధికారుల నిర్లక్ష్యం

జయభేరి, హైదరాబాద్ : 

ఇంటర్ బోర్డ్ అఫిలియేషన్ లేదు.... నిబంధనల అమలులో భేఖాతరు.... లక్షల్లో ఫీజుల వసూళ్లు... వసతుల కల్పనలో సూన్యం... ఇంటర్ అధికారుల నిర్లక్ష్యం ఇవన్నీ హైదరాబాద్ లోని మాదాపూర్, కొండాపూర్ లో ఉన్న శ్రీచైతన్య కళాశాలల ఉదంతం. రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి అఫిలియేషన్,గుర్తింపు పొందకుండా అక్రమ పద్ధతిలో అడ్మిషన్లు చేపట్టి, అనుమతులు లేని ఆకర్షణీయ పేర్లతో ఐపీఎల్, సీపీఎల్, నియాన్, ఐకాన్, ఫాస్ట్ ట్రాక్, సూపర్ 60, చైనా బ్యాచ్లు అంటూ తరగతులు నిర్వహిస్తూ, జూన్ నెలలో ప్రారంభం కావాల్సిన క్లాస్ లు మే లోనే యధేచ్చగా నిర్వహిస్తూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య కళాశాలను సీజ్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని,యాజమాన్యం పై క్రిమినల్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ కొండాపూర్ లోని శ్రీ చైతన్య కళాశాల వద్ద తరగతులను బహిష్కరించి, ధర్నా నిర్వహించడం జరిగింది.

Read More చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 

ఈ సందర్భంగా ఏఐ వైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, ఏఐ వైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్ లు సంయుక్తంగా మాట్లాడుతూ... ధనార్జనే ధ్యేయంగా కేవలం కాసుల కక్కుర్తితో విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తూ ఇంటర్ బోర్డ్ నిబంధనలు ఉల్లంఘించి అనధికారకంగా శ్రీచైతన్య జూనియర్ కళాశాలను నడిపిస్తూ విద్యార్థులను మోసం చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు అన్నారు.

Read More చలో నల్లగొండ  రైతు మహాధర్న కార్యక్రమానికి బయలుదేరిన  చందంపేట మండల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు

ఇంటర్మీడియట్ రెండవ విద్యా సంవత్సర తరగతులను జూన్ రెండవ వారం నుండి ప్రారంభించవలసి ఉండగా, ఏప్రిల్ 20వ తేదీ నుండే తరగతులు ప్రారంభించడం సిగ్గు చేటు అన్నారు. శ్రీచైతన్య కళాశాల కేవలం మార్కులు, రాంక్యుల పేరిట విద్యార్థులను ఆట వస్తువులుగా మార్చి, మానసిక పునరుత్తేజానికి అవకాశం ఇవ్వకుండా ప్రశాంతతను దూరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వాస్తవానికి ఈ కళాశాలలో లక్షలాది రూపాయలు ఫీజుల రూపంలో వసూళ్లు చేస్తున్న విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. ఈ కళాశాలలో పూర్తి స్థాయి నీటి సౌకర్యం లేక విద్యార్థులు 2రోజులకొకసారి స్నానం చేస్తున్నా యాజమాన్యంకు విద్యార్థుల ఆరోగ్యం పట్ల బాధ్యత లేదని ధ్వజమెత్తారు.

Read More ఎమ్మెల్సీ రామచంద్రారావును సన్మానించిన మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్

IMG-20240526-WA1736

Read More ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.

అదే విధంగా ఈ కళాశాల ఇంటర్ బోర్డ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించబడుతున్నదని వారు ఆరోపించారు. కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు ఆయా కళాశాలల యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్నారనే సందేహాలు తమకు వస్తున్నాయని వారు అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇంటర్ బోర్డ్ గుర్తింపు లేకుండా నడుస్తున్న జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తక్షణమే ఇంటర్ బోర్డ్ కార్పొరేట్ కళాశాలల ఆగడాలను ఆపాలని, లేనిపక్షంలో బోర్డ్ ఆదేశాలను భేకాతరు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై దాడులు చేస్తామని దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు మాజీద్, అనీల్, విజయ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Read More ముస్లిం లందరికీ ఇఫ్తార్ విందు