Modi : యావత్ భారత దేశం కోరుకుంటుంది మోడీ యే మళ్ళీ ప్రధాని

వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరురి రమేష్

  • కడియం శ్రీహరి నీకు దమ్ము దైర్యం ఉంటే నేను ఎక్కడ కబ్జా చేశానో నిరుపించు. బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కొండా సు రేఖ కు టిక్కెట్ రాకుండా చేసింది నువ్వు కదా తాటికొం డ రాజయ్య మీద అనేక ఇబ్బందులు పెట్టి లేనిపోని ఆరోపణలు అంటాకట్టి రాజకీయం బదనం చేసింది నువ్వు కదా.

Modi : యావత్ భారత దేశం కోరుకుంటుంది మోడీ యే మళ్ళీ ప్రధాని

జయభేరి, బ్యూరో చీఫ్ వరంగల్, మే 7:      

ప్రెస్ క్లబ్ లో అద్యక్షులు వేముల నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ  బిజెపి అభ్యర్థి అరూరి రమేష్ ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మీడి యా మిత్రులు మీట్ ద ప్రెస్ కార్యక్రమం ఏర్పాటు చేసి నందుకు ధన్యవాదాలు. యావత్ భారత దేశం మోడీ యే మళ్ళీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. 13 తేదిన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వుకు ఓటు వేస్తామని ప్రజలు డిసైడ్ అయ్యారుబుధవారం (రేపు)జరిగే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన సభకి ప్రజలు, బిజెపి కార్యకర్తలు, పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయగలరు.ఉదయం 10:00 గంటలకు ప్రజలు, కార్యకర్తలు సభ ప్రాంగణానికి చేరుకొవాలి. వరంగల్ పార్లమెంటు ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే మోడీ సహకారంతో వరంగల్ పార్లమెంట్ నీ అభివృద్ధి చేస్తాను.కేంద్రంలో గెలిచేది మోడీ... ఇక్కడ గెలిచేది అరూరి.

Read More రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి:- ఎమ్మెల్యే మల్లారెడ్డి

కడియం శ్రీహరి చరిత్ర అందరికీ తెలియాలి. కడియం శ్రీహరి ఒక మేక వన్నె పులి. ఊసరవెల్లి కంటే తొందరగా రంగులు మార్చే వ్యక్తి కడియం. కడియం శ్రీహరి ఉపాధ్యాయుడిగా ఉండి రాజీనామా చేసిన అనంతరం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కడియం శ్రీహరి 1994 లో నాకు ఎమ్మె ల్యేగా అవకాశం కల్పించండి అని అడిగారు గుర్తుందా. కడియం శ్రీహరి కి గతంలోనే దళిత దొర అని ప్రజ లు నామకరణం చేశారు. కడియం శ్రీహరి కి ఎలాంటి ఆస్తులు లేకుంటే ఇంద్రభవనం లాంటి ఇండ్లు ఎక్క డివి. ఇక్కడ ఎంపి అభ్యర్థి కడియం శ్రీహరి నా.... అయినా కూతురు కావ్య నాకడియం కావ్య భర్త పేరు నజిరుద్దిన్ వాళ్ల స్వస్థలం గుంటూరు. నేను పక్క లోక ల్ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బిడ్డ ని కడియం శ్రీహరి 20 సంవత్సరాలు మంత్రిగా ఉండి వరంగల్ జిల్లా అభివృద్ధి చెందలేదు అని చెప్పడం విడ్డూరంగా ఉంది. మంత్రిగా ఉండి అభివృద్ధి చెయ్యాలేని వాడివి ఇప్పుడు ఎలా చేస్తావో చెప్పాలి.

Read More సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం...

IMG-20240507-WA4113

Read More గాంధీభవన్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి 

కడియం శ్రీహరి నీకు దమ్ము దైర్యం ఉంటే నేను ఎక్కడ కబ్జా చేశానో నిరుపించు. బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కొండా సురేఖకు టిక్కెట్ రాకుండా చేసింది నువ్వు కదా తాటికొండ రాజయ్య మీద అనేక ఇబ్బందులు పెట్టి లేనిపోని ఆరోపణలు అంటాకట్టి రాజకీయం బదనం చేసింది నువ్వు కదా. నేను మూడో సారి గెలిస్తే బిఆర్ఎస్ ప్రభు త్వంలో మంత్రిని అవుతాను అని నన్ను ఒడించడం కోసం కుట్రలు చేసింది నువ్వు కదా. స్టేషన్ ఘనపూర్ లో PRP నుండి నేను పోటీ ఒడించినందుకు నాపైన కుట్రలు పన్నాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం నన్ను బదనం చేస్తున్నారు ఓటమి భయం తోనే రేవంత్ రెడ్డి ఓరుగల్లులో మూడు సార్లు ప్రచారా నికి వచ్చారు. రేవంత్ రెడ్డి ఇంకా ఎన్ని సార్లు వచ్చి ప్రచారం చేసిన నా గెలుపు ను ఆపలేరు. నన్ను గెలిపిస్తే వరంగల్ పార్లమెంట్ లో చేసే అభివృద్ధి పనులను మీ ముందు ఉంచుతున్నా.. మామునూరు ఎయిర్ పోర్ట్ పునరుద్ధరణ చేస్తాను. వరంగల్ ను IT హాబ్ గా మా రుస్తాను.

Read More తెలంగాణ క్రీడా పాఠశాలలో 2k రన్ విజయవంతం చేయాలి

పాలకుర్తి నియోజకవర్గంలో కోడకండ్ల లో మినీ టెక్స్ట్ టైల్ పార్క్ పనులు పూర్తి చేయిస్తాను. కాజీపేట నుండి భూపాలపల్లి కి నూతన రైల్వే లైన్ తెస్తాను. మన పార్లమెంట్ లో వ్యవసాయ అనుసం ధానంగా  పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కృషి చేస్తాను. ఆసియా ఖండం లోనే రెండవ అతి పెద్ద వ్య  వసాయ మార్కెట్ ఎనుమాములను ఆధునీకరణ చేస్తా. గతంలో ఎవరు చేయని అభివృద్ధి నేను చేసి చూపిస్తాను. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యదర్శి సదయ్య, కోశాధికారి అమర్, జర్నలిస్టు సంఘాల నేతలు మధు, బీఆర్ లెనిన్, దయాసాగర్, గడ్డం రాజిరెడ్డి, మెండు రవీందర్. వివిధ పత్రికలు, ఛానళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు..

Read More జర్నలిస్టుల సంక్షేమం కోసం పని చేస్తాం