విమానాశ్రయాలను తలపించేలా రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ

మేడ్చల్ రైల్వే స్టేషన్ పనులను పరిశీలించిన ఎంపీ ఈటల రాజేందర్

విమానాశ్రయాలను తలపించేలా రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ

మేడ్చల్ :

బ్రిటిష్ కాలం నాటి రైల్వే స్టేషన్లను అత్యాధునిక సాంకేతికతో అభివృద్ధి పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టిందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.

Read More Telangana I రాజకీయంలో ఇవన్నీ మామూలే..

గురువారం మేడ్చల్ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న ఆర్.యు.బి పనులను పరిశీలించి, రైల్వే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రెండువేల కోట్లతో రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేపట్టడం జరిగిందని, సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లను విమానాశ్రయాలను తలపించే విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎంపీ తెలిపారు. మేడ్చల్ రైల్వే స్టేషన్లో రూ.32 కోట్లతో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, మరి 20 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా అండర్ పాస్ బ్రిడ్జ్ పనులు పూర్తి చేసే విధంగా చూస్తామని ఈటల తెలిపారు.

Read More Telangana I ఇది గౌడలను అవమానించడమే..!

గౌడవెళ్లి, గుండ్లపోచంపల్లి, బొల్లారం, అల్వాల్, అమ్ముగూడా రైల్వే స్టేషన్లను ఆధునీకరణ చేస్తున్నామన్నారు. మెట్రోరైలు మాదిరిగా ఎంఎంటీఎస్ కి కూడా దగ్గర దగ్గర స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారని వారి సూచనలను కేంద్రమంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ ఈటల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో అతి త్వరలో రైల్వే అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని అన్నారు.

Read More Telangana I కంచర గాడిద.. రేసుగుర్రం... సన్నాసి! దద్దమ్మలు! దున్నపోతును కొనుక్కున్నది ఎవరు?

ఈ కార్యక్రమంలో అధికారులు సిపిఎం జిఎస్ ఏకే సింగ్, డిఇఎన్ ముత్యాలు నాయుడు, అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ గోవిందరావు, మేడ్చల్ స్టేషన్ సూపరింటెండెంట్ లక్ష్మీ నారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ళ విక్రమ్ రెడ్డి, నాయకులు అమరం మోహన్ రెడ్డి, గిరివర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్ యాదవ్, నందారెడ్డి, నరేందర్ రెడ్డి, మాజీ జడ్పిటిసి శైలజ హరనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Read More College I సాంకేతికతతో భోధన చేయాలి

Views: 0