MLC : ఎమ్మెల్సీ అభ్యర్థి డా. ఈడా శేషగిరిరావు గౌడ్ ను గెలిపించుకోవాలి

యువత భవిష్యత్తు బాగుంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని గాఢంగా విశ్వసించే సుప్రీం కోర్టు న్యాయవాది డా. ఈడా శేషగిరిరావు గౌడ్ 27 మే 2024లో జరుగనున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ  జిల్లాల పట్టభద్రుల  నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. విద్యావంతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపట్ల న్యాయవాదిగా, రాజ్యాంగ న్యాయశాస్త్ర నిపుణులుగా వారికి అపారమైన విషయ  పరిజ్ఞానం ఉన్నది. ఆయా సమస్యలకు తగిన పరిష్కారాన్ని చట్టబద్దంగా తీర్చాలన్న సంకల్పంతోనే వారు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 

MLC : ఎమ్మెల్సీ అభ్యర్థి  డా. ఈడా శేషగిరిరావు గౌడ్ ను గెలిపించుకోవాలి

జయభేరి, హైదరాబాద్ :
ఏడు దశాబ్దాల చరిత్ర కలిగిన భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారం కొన్ని ప్రధాన పార్టీల కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఆ కొన్ని పార్టీలు అగ్రవర్ణాల ధనవంతుల ఆధీనంలో ఉంచుకొని బహుళ సంఖ్యాకులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, పేద అగ్రకులాల వారికి ప్రాధాన్యత కల్పించకుండా వారిని అధికారానికి దూరంగా పెడుతూ వంచిస్తున్నారు. రాజకీయం అంటేనే డబ్బుతో కూడిన వ్యవహారమనే ధోరణికి ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చి, తమకు అనుకూలంగా వ్యవస్థను మలచుకున్నారు. వారి గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా, బహుళ సంఖ్యాకులందరికి  అధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే సంకల్పంతో డా. ఈడా శేషగిరిరావు గౌడ్ 'ఆదార్ పార్టీ ( అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ)ని స్థాపించారు.

కాన్స్టిట్యూషనల్ న్యాయశాస్త్రంలో పి.హెచ్.డి. చేసిన డా. ఈడా శేషగిరి రావు గౌడ్ ప్రస్తుతం సుప్రీం కోర్టు న్యాయవాదిగా కొనసాగుతున్నారు. డా. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా, ప్రజాస్వామ్యానికి ప్రాణమైన ఎన్నికల వ్యవస్థలో డబ్బు ప్రమేయం లేకుండా ఎన్నికలు నిర్వహించబడాలనేది వారి ఆశయం. 2004 నుండి 2009 వరకు నాటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ ప్లీడరుగా పనిచేసిన వీరు, హైకోర్టు బార్ అసోసియేషన్ కు ప్రధాన కార్యదర్శిగా రెండుసార్లు సేవలందించారు. ఈ.ఎస్.ఆర్. ఎన్జీవో పేరిట స్వచ్ఛంద సంస్థను నడుపుతూ పేదలకు ఎన్నో వైద్య, నేత్ర చికిత్సా శిబిరాలు ఏర్పాటుచేసి చికిత్స చేయించారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పలు క్రీడా టోర్నమెంట్లు వారి స్వచ్చంద సంస్థనుండి నిర్వహించారు.

Read More కుంట్లూర్ గ్రామంలో విషాదం

యువతకు రాజకీయాలపట్ల ఆసక్తి, అవగాహన పెంపొందించాలని, ప్రధాన పార్టీల్లోని కుటుంబ పాలనను అంతమొందించాలనే సంకల్పంతో సదరన్ పొలిటికల్ అకాడమీని స్థాపించారు. అకాడమీ ద్వారా గత 3 సంవత్సరాలుగా రాజ్యంగం, ఎన్నికల వ్యవస్థ, పరిపాలనా విషయాలు, నాయకత్వ లక్షణాలు తదితర అంశాలపై పలు వర్క్ షాప్స్, సెమినార్స్, శిక్షణా తరగతులను విశ్వవిద్యాలయాల్లోనూ, ఇతర వేదికల్లోను నిర్వహించారు. ఇందులో అవగాహన, శిక్షణ పొందిన యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో, బీసీ తదితర వర్గాల వారికి కూడా అధికారంలో భాగస్వామ్యాన్ని కల్పించాలని 'ఆధార్ పార్టీ'ని స్థాపించి, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం యువతకు, అందులో మహిళలకు 33 శాతం సీట్లను కేటాయిస్తూ ఎన్నికల్లో పోటి చేయించారు.

Read More శివం హిల్స్ కాలనీ లో R.R చికెన్ సెంటర్ ను ప్రారంభించిన

27-5-2024న జరిగే వరంగల్ - ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం (ఎమ్మెల్సీ) ఉప ఎన్నికల బ్యాలెట్ పేపర్ లో డా. ఈడా శేషగిరిరావు గౌడ్ గారి సీరియల్ నెం.12 పై వారికి మొదటి ప్రాధాన్యతా ఓటును వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత విజ్ఞత, ముందుచూపు కలిగిన విద్యావంతులైన వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఓటర్లకు ఉంది. కావున విద్యావంతులు, న్యాయశాస్త్రం, రాజ్యాంగంపట్ల అపారమైన పరిజ్ఞానం కలిగి సమస్యలపై సరైన వాణిని వినిపించి, పరిష్కారాన్ని చూపే డా. ఈడా శేషగిరి రావుగౌడ్ గారికి మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించుకోవాలి.

Read More నాయిదొరా జానపద నృత్య షూటింగ్ ప్రారంభం

- ఎమ్. రఘునాథ్ గౌడ్ 
కోశాధికారి, సదరన్ పొలిటికల్ అకాడమీ 

Read More దొరికిన హ్యాండ్ బ్యాగ్ ను డిపో అధికారులకు అందజేసినారు

Views: 0

Related Posts