శివం హిల్స్ కాలనీ లో R.R చికెన్ సెంటర్ ను ప్రారంభించిన

GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి

శివం హిల్స్ కాలనీ లో R.R చికెన్ సెంటర్ ను ప్రారంభించిన

జయభేరి, ఎల్బీనగర్ : మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలోని శివం హిల్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఆర్ చికెన్ సెంటర్ ను ముఖ్య అతిథిగా విచ్చేసి GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్,స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి యజమానులు రవి గౌడ్ తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... బొమ్మల గుడి ప్రాంతంలోని దినదిన అభివృద్ధి చెందుతున్న కాలనీలకు అతి సమీపంగా చికెన్ సెంటర్ ను ఏర్పాటు చేసి వచ్చే కస్టమర్లు అందరికీ నాణ్యమైన చికెన్ను అందించాలని అన్నారు. కాలనీలకు అతి చొరవగా ఉండే విధంగా ఒక సెంటర్లో ఏర్పాటు చేసిన షాప్ యజమానులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షాపు యజమాన్యం వారి కుటుంబ సభ్యులు, వీరన్న గుట్ట ప్రాంతవాసులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More జర్నలిస్టుల జీవితాలు గాలిలో దీపాలు..