శాస్త్రీయత లోపం.. పెద్ద శాపం

ఒక్కో సర్వే సంస్థ ఒక్కో రీతిన సర్వే అంశాలు చెబుతూ ప్రజలను పక్కతోవ పట్టిస్తంటాయి. ఒకప్పుడు కనీసం 70 శాతమో లేక 80 శాతమో నమ్మశక్యంగా ఉండేవి. మరి ఇప్పుడు రాజకీయ పార్టీలే తమకు అనుకూలంటా ఉండే సంస్థలతో సర్వేలు చేపట్టి చెప్పిస్తున్నారు. అసలు ఫలితాలు వచ్చేసరికి ఖంగు తింటున్నారు. తెలుగు రాష్ట్రాలలో 13న జరిగిన ఎన్నికల తర్వాత 23 రోజులు ఉత్కంఠగా ఎదురుచూడాల్సిన పరిస్థితి. అంటే దాదాపు నెల్లాళ్లు టెన్షన్ అనుభవిస్తూ ఎదురుచూస్తున్నారు.

శాస్త్రీయత లోపం.. పెద్ద శాపం

జయభేరి, హైదరాబాద్ :
సార్వత్రిక సమరం పతాక స్థాయికి వచ్చేసింది. సినిమా భాషలో చెప్పాలంటే క్లైమాక్స్ కు చేరుకుంది. అయితే జూన్ 1వ తారీఖు ఓటు వేసే వారు లక్కీఫెలోస్ అని చెప్పవచ్చు.

ఎందుకంటే అదే రోజు అర్థరాత్రి వరకూ ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు ఏ పార్టీ ఎక్కడ గెలుస్తుంది మెజారిటీతో అధికారం చేపట్టబోయే పార్టీ ఏమిటో చెప్పేస్తారు. ఎగ్జిట్ పోల్ సర్వే ఎగ్జాట్ గా అంచనా వేస్తుందా అంటే దానికి ఎక్కడా శాస్త్రీయత ఉండదు. ఒక్కో సర్వే సంస్థ ఒక్కో రీతిన సర్వే అంశాలు చెబుతూ ప్రజలను పక్కతోవ పట్టిస్తంటాయి. ఒకప్పుడు కనీసం 70 శాతమో లేక 80 శాతమో నమ్మశక్యంగా ఉండేవి. మరి ఇప్పుడు రాజకీయ పార్టీలే తమకు అనుకూలంటా ఉండే సంస్థలతో సర్వేలు చేపట్టి చెప్పిస్తున్నారు. అసలు ఫలితాలు వచ్చేసరికి ఖంగు తింటున్నారు. తెలుగు రాష్ట్రాలలో 13న జరిగిన ఎన్నికల తర్వాత 23 రోజులు ఉత్కంఠగా ఎదురుచూడాల్సిన పరిస్థితి. అంటే దాదాపు నెల్లాళ్లు టెన్షన్ అనుభవిస్తూ ఎదురుచూస్తున్నారు. సాధారణ పౌరుల నుంచి సెలబ్రిటీల దాకా అంతా ఉత్కంఠగా ఎదురుచూసేవి ఎగ్జిట్ పోల్ సర్వేలే. మరి అవి ప్రజల విశ్వాసాన్ని ఈ సారైనా చూరగొంటాయా లేదా అన్నది చూడాలి.

Read More ముస్లిం లందరికీ ఇఫ్తార్ విందు

వాస్తవానికి ప్రీపోల్ సర్వేలకు, ఎగ్జిట్ పోల్ సర్వేలకు పెద్దగా తేడా కనిపించదు. ఎందుకంటే 2003 సంవత్సరం ఆఖరులో జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, రాజస్తాన్ ఎన్నికలలో బీజేపీకి అనుకూల ఫలితాలు రావడంతో ఇండియా షైనింగ్ నినాదంతో 2004 కేంద్రంల బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. అయితే బీజేపీకి అనుకూలంగా అప్పటి ఫలితాలు రావడంతో ఇండియా షైనింగ్ నినాదంతో 2004 కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. అయితే అప్పట్లో బీజేపీ మిళితమైన ఎన్టీఏ కూటమికి 240 నుంచి 250 స్థానాలు వస్తాయని మెజారిటీ పోల్స్ ప్రకటించాయి. అయితే ఫలితాలు మాత్రం తారుమారయ్యాయి. ఎన్టీయే కూటమి కేవలం 187 స్థానాలకే పరిమితమయింది. ప్రీ పోల్‌ సర్వేలకు, ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలకు పెద్ద వ్యత్యాసం కనిపించదు. 2003 చివర్లో జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ ఎన్నికల్లో బీజేపీకి అనుకూల ఫలితాలు రావడంతో ఇండియా షైనింగ్‌ నినాదంతో 2004 కేంద్రంలో బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి 240–250 నుంచి స్థానాలు సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటించగా ఫలితాలు రివర్సయ్యాయి. ఎన్‌డీఏ 187కే పరిమితమైంది. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ గా అంచనాలు వేయలేకపోవడంతో దాదాపు 70 స్థానాలలో ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయి.2014 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కూడా బీజేపీ సొంతంగా స్పష్టమైన మెజారిటీ సాధించబోతోందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపు అంచనాలు వేశాయి. కానీ అవి ఊహించిన రీతిలో మెజారిటీ స్థానాలు బీజేపీ దక్కించుకోలేకపోయింది.

Read More చలో నల్లగొండ  రైతు మహాధర్న కార్యక్రమానికి బయలుదేరిన  చందంపేట మండల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు

2016 చివర్లో మోదీ సర్కార్ పెద్ద నోట్లను రద్దు చేశాక సామాన్య జనం ఎంతలా ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసింది. అయితే జనం కసిగా ఈ సారి జరగబోయే ఎన్నికలలో ఎన్టీఏ కూటమి సరైన గుణపాఠం చెబుతారని అంతా అంచనాలు వేశారు. ఆ వెంటనే జరిగిన 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తల్లక్రిందులయ్యాయి. హంగ్ వస్తుందని చాలా సంస్థలు తమ అంచనాలను ప్రకటించాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని నిరూపిస్తూ బీజేపీ ఏకంగా 300 స్థానాలు తన సొంతం చేసుకుంది. ఎన్నికల్లో ఎవరికి ఓటేసే అవకాశం ఉందంటూ ఓటర్ల అభిప్రాయాలను తెలుసుకుని రూపొందించేవి ఒపీనియన్‌ పోల్స్‌. ఓటేసి పోలింగ్‌ బూత్‌ల నుంచి తిరిగి వెళ్లే ఓటర్లను ప్రశ్నించి వేసే అంచనాలే ఎగ్జిట్‌ పోల్స్‌. ఒపీనియన్‌ పోల్స్‌ ఫలితాలను ఎన్నికల నోటిఫికేషన్‌ రావడానికి ముందు వరకు ప్రకటించవచ్చు. తుది దశ పోలింగ్‌ ముగిశాక ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల చేసుకోవచ్చు. చాలావరకూ ఒపీనియన్ పోల్స్ అంచనాలు తల్లక్రిందులు కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అంచనాలల తప్పులు ఎంత తక్కువగా ఉంటే ఫలితాలు అంత కచ్చితంగా దగ్గరగా ఉంటాయి.

Read More నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి 

1999 లోక్ సభ ఎన్నికలలో ఒపీనియన్ పోల్స్ అంచనాలు, వాస్తవ ఫలితాల మధ్య 20 సీట్లు తేడా వచ్చాయి. 2009 ఎన్నికలకు వచ్చేసరికి ఈ గ్యాప్ 25 నుంచి 60 స్థానాలకు పెరిగింది. 2014 సంవవ్సరానికి వచ్చేసరికి 50 నుంచి 100 సీట్ల వరకూ తేడాలొచ్చాయి. అలా ఒక్కో పార్టీ/కూటమికి వచ్చే స్థానాలను లెక్కగడుతుంటాయి. ఇది కాలం చెల్లిన పాత విధానమని నిపుణులు అంటున్నారు. పోలింగ్‌ ఏజెన్సీలు సర్వేకు కావాల్సిన బలమైన వసతులు లేకపోవడం కూడా అంచనాల్లో తప్పులు పెరగడానికి కారణం.ప్రతి నియోజకవర్గం నుంచి శాంపిల్‌ సైజు వీలైనంత ఎక్కువగా ఉండాలి. ఇందుకు భారీగా సిబ్బంది, నిధులు, సమయం కావాలి.

Read More కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం

కానీ మన దగ్గర పోల్‌ ఏజెన్సీలకు ఈ వనరుల్లేవు. పార్టీల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే, ఫలితాల అంచనాలు అంత కష్టమవుతాయని సీఎస్‌డీఎస్‌ సైతం చెబుతోంది. 2014 ఎన్నికలలో 464 పార్టీలు పోటీ చేశాయి. 1998తో పోలిస్తే ఇది రెట్టింపు. పోలింగ్‌ ఏజెన్సీలు పోటాపోటీగా పెరుగుతున్నాయి. దాంతో చాలా శాస్త్రీయంగా పోల్‌ సర్వేలు నిర్వహించకుండానే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. సర్వే అంచనాలు ఎందుకు తప్పాయని చాలా పోలింగ్‌ ఏజెన్సీలు విశ్లేషణను చేసుకోవడం లేదు. పైగా సర్వే ఫలితాలను ఎలా రూపొందించారో ఆధారాలను కూడా వెల్లడించడం లేదు. ప్రీ పోల్‌ అంచనాలకు సంబంధించి జవాబుదారీ లేకపోవడం కూడా సమస్యకు కారణమే.

Read More అన్నను హతమార్చిన తమ్ముడు