ఉగాది పంచాంగ పుస్తక ఆవిష్కరణ..
హాజరైన విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజి భిక్షపతి చారి... విశ్వకర్మ కుటుంబీకులకు సరుకులు అందచేసిన మాజీ ఉపసర్పంచ్ వెంకట రమణ రెడ్డి
దుద్దెడ బ్రహ్మ చారి భువనగిరి సిద్ధాంతి రచించిన పంచాంగం పుస్తకాలను ఆవిష్కరించి అందజేశారు. కాగా మూడు చింతలపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్ వెంకటరమణారెడ్డి ఉగాది పండుగకు కావలసిన సరుకులను దాదాపు 100 విశ్వకర్మ కుటుంబాలకు ఉచితంగా పంపిణీ చేశారు.
మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండల కేంద్రంలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం వద్ద విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వకర్మ ఐక్య సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజి భిక్షపతి చారి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు భాషపల్లి రమేష్ చారి, మూడు చింతలపల్లి మండల డిప్యూటీ తహసిల్దార్ నాగజ్యోతిలు హాజరయ్యారు. అనంతరం దుద్దెడ బ్రహ్మ చారి భువనగిరి సిద్ధాంతి రచించిన పంచాంగం పుస్తకాలను ఆవిష్కరించి అందజేశారు. కాగా మూడు చింతలపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్ వెంకటరమణారెడ్డి ఉగాది పండుగకు కావలసిన సరుకులను దాదాపు 100 విశ్వకర్మ కుటుంబాలకు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు వెంకట సాయి సిరామిక్స్ అధినేత మోటకూరి మధు సుదన్ చారి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల విశ్వకర్మ అధ్యక్షుడు బాలకృష్ణ చారి మాట్లాడుతూ... వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద ప్రతి ఆదివారం అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. క్రోధి నామ సంవత్సరంలో ప్రజలందరూ సుబిక్షంగా, ఆయురారోగ్యాలతో ఉండాలనీ ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో విశ్వకర్మ ఐక్య సంఘం ప్రధాన కార్యదర్శి అనంతోజి బ్రహ్మ చారి, మల్కాజ్ గిరి మండల అధ్యక్షులు బంగారు మల్లేష్ చారి, ప్రధాన కార్యదర్శి శ్రావణ చారి, కోశాధికారి శ్రీనివాస్ చారి, రాష్ట్ర కార్యదర్శి ముచ్చర్ల లక్ష్మణ్ చారి, కొల్తుర్ మాజీ సర్పంచ్ వీరేషం చారి,ఎంపీటీసీ నాగరాజు, నాయకులు క్యాతం మధు కృష్ణ ,ఆలయ కమిటీ చైర్మన్ మహంకాళి ఆంజనేయులు చారీ, ఉపాధ్యక్షులు విష్ణు చారి, కోశాధికారి వర్నోజు రాములు చారి, మహంకాళి బిక్షపతి చారి, బంగారు వెంకటేష్ చారి, లక్ష్మాపూర్ గ్రామ అధ్యక్షుడు సాయి నాథ్ చారి, కేశవరం గ్రామ అధ్యక్షుడు విష్ణు చారి, ఆలయ అర్చకులు బంగారు తిరుమల చారి, జగన్ గూడ పిన్నోజీ శ్రీనివాస్ చారి, మంచోజు సురేందర్ చారి తదితరులు పాల్గొన్నారు.
Post Comment