పేదింటి విద్యార్థులకు నేనుంటా అండగా BLR

పేదింటి విద్యార్థులకు నేనుంటా అండగా BLR

జయభేరి, ఉప్పల్ : గత కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గంలోని పేదింటి విద్యార్థులకు ఆపన్న హస్తాన్ని అందిస్తూ.

డాక్టర్ కావాలన్న కలలకు ఆర్థిక పరిస్థితులు అడ్డుగా ఉన్న వారిని అందరిని ఆదరిస్తూ వారికి ఐదు సంవత్సరాల MBBS చదువులకు ఉచితంగా ఫీజులు కడుతున్న గొప్ప నాయకుడు మన ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి. నాచారం రాఘవేంద్ర నగర్ కు చెందిన మహమ్మద్ కాజా నిరుపేద కుటుంబానికి చెందినవాడు కనీసం సొంత ఇల్లు కూడా లేని నిరుపేద.

Read More Telangana I కంచర గాడిద.. రేసుగుర్రం... సన్నాసి! దద్దమ్మలు! దున్నపోతును కొనుక్కున్నది ఎవరు?

ఇతని కొడుకు  మహమ్మద్ ఓమర్ ఫరూక్ ను ప్రైవేటు స్కూల్లో చదివించే ఆర్థిక స్తోమత లేక  ఏడవ తరగతి నుండి 12వ తరగతి వరకు గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఏర్పాటు చేసిన TMREIS (తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ సొసైటీ) లో చదివించాడు ఇంటర్లో 956 మార్కులు సాధించి గోల్డ్ మెడల్ అందుకోవడం జరిగింది. అనంతరం TMRJC బార్కాస్ లో నీట్ కోచింగ్ తీసుకొని ప్రతిష్టాత్మకమైన NEET ఎంట్రన్స్ లో స్టేట్ ర్యాంక్ 1583 సాధించాడు.

Read More Love : అమ్మను ప్రేమించలేనోడికి  అమ్మాయి కావాల్సొచ్చిందిరా?

వారి ఆర్థిక పరిస్థితులు  డాక్టర్ అయ్యేందుకు మళ్ళీ అడ్డుపడ్డాయి అలాంటి సమయంలో ఉప్పల్ శాసనసభ్యులు శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు మహమ్మద్ హోమర్ ఫరూక్ ఇంటికి వచ్చి మొదటి సంవత్సరం ఫీజు 29వేల రూపాయలను అందజేయడం జరిగింది.

Read More BRS I ఎల్బీనగర్ గడ్డ.. ఎవరి అడ్డ!?

ఎమ్మెల్యే మాట్లాడుతూ ను ఆదర్శంగా తీసుకొని నాచారం డివిజన్లోని ఇంకా చాలామంది విద్యార్థులు బాగా చదివి ర్యాంకులు సాధించాలన్నారు పేద విద్యార్థులకు అన్ని రకాలుగా నా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు.

Read More telangana politics I రాజకీయ ప్రకటనల మాయాజాలం ఓటర్ల అయోమయం

ఈ కార్యక్రమంలో గ్రేటర్ బారాసా నాయకులు సాయి జన్ శేఖర్ విట్టల్ యాదవ్ రామచందర్ భూపాల్ రెడ్డి దాసరి కర్ణ వేముల మారయ్య అజ్మీరి కట్ట బుచ్చన్న గౌడ్ చంద్రశేఖర్ సంజన యాదగిరి వెంకట్ రెడ్డి బాలరాజ్  gyasuddin శేఖర్ గౌడ్ లావణ్య భాగ్య మల్లమ్మ మరియు కాలనీవాసులు ఓవర్ ఫారుక్ బంధువులు పాల్గొన్నారు.

Read More Health I ప్రజా ఆరోగ్యం మెరుగుపడేదెలా!?

Views: 0